Site icon TeluguMirchi.com

Waltair Veerayya Review | వాల్తేరు వీరయ్య రివ్యూ

Waltair Veerayya Review
తెలుగుమిర్చి రేటింగ్ : 3.25/5

Waltair Veerayya Review
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సంక్రాంతికి కానుకగా ఈ రోజు (జనవరి 13 ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ మహారాజా రవితేజ, శృతిహాసన్ కీలక పాత్రల్లో నటించారు. బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వచ్చిన ఈ చిత్రం భారీ క్రేజ్‌తో అభిమానుల్లో అంచనాలు పెంచింది.

కథ :
సముద్రం ఒడ్డున ఉండే ఒక ప్రాంతానికి వీరయ్య (చిరంజీవి) లీడర్. ఆ ప్రాంతంలో వీరయ్యకి తెలీకుండా కొందరు డ్రగ్స్ బిజినెస్ చేస్తుంటారు. ఈ విషయం తెలుసుకున్న ఏసీపీ విక్రమ్ సాగర్(రవితేజ) డ్రగ్స్ బిజినెస్ చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తాడు, అడ్డువచ్చిన వీరయ్యతో సహా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీరయ్య, ఏసీపీ విక్రమ్ సాగర్ అన్నదమ్ములు. తమ బిజినెస్ కి అడ్డువస్తున్నాడని ఏసీపీ విక్రమ్ సాగర్ ని డ్రగ్ లీడర్ సాల్మన్ సీజర్‌ (బాబీ సింహ) చంపిస్తాడు. తరవాత వీరయ్య మలేషియా వెళ్తాడు, వెళ్ళాక ఎం చేస్తాడు, తన తమ్ముడి చావుకి కారణమైన సాల్మన్ సీజర్‌ ని ఎలా అంతమొందిస్తాడు… శృతి హాసన్, చిరంజీవి కి ఎలా కలుస్తారు అనేది తెరపై చూడాల్సిందే …

నటీనటులు :

చిరాంబీజీవి ‘వీరయ్య’ మాస్ లీడర్ పాత్రలో ఇరగతీసాడు అందులో సందేహమేమిలేదు. రవితేజ నిడివి కొంచెమే అయినా కూడా ఈగోయిస్టు పోలీస్ పాత్రలో తన నట విషురూపాన్ని చూపించాడు. శృతి హాసన్ సిబిఐ ఆఫీసర్ పాత్రలో నటించినప్పటికీ గ్లామర్ కి పరిమితం చేసినట్లనిపించింది. రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహ, కాథరిన్ ట్రెసా, నాజర్, సత్య రాజ్ మిగతా తారాగణమంతా వారివారి పాత్రలకి మేర నటించారు. ఈ సినిమాకి దేవిశ్రీ మ్యూజిక్ హైలైట్ అని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్ :

మాస్ లీడర్ గా చిరంజీవి నటన
రవితేజ రోల్
ఇంటర్వెల్ బ్యాంగ్
మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

కథలో కొత్తదనం లేకపోవడం
సాగదీత సన్నివేశాలు

ఫైనల్ పాయింట్ : కమర్షియల్ మెగా మాస్ ఎంటర్టైనర్

Exit mobile version