Veera Simha Reddy Review
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతిహాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, హానీ రోజ్, దునియా విజయ్, నవీన్ చంద్ర, పీ రవిశంకర్, అజయ్ ఘోష్, మురళీ శర్మ, చంద్రిక రవి, సప్తగిరి తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపిచంద్ మలినేని
నిర్మాతలు: మైత్రీ మూవీ మేకర్స్
మ్యూజిక్: ఎస్ థమన్
రిలీజ్ డేట్: 12-01-2023
తెలుగుమిర్చి రేటింగ్ : 3.5/5
Veera Simha Reddy Review
అఖండ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలకృష్ణ, క్రాక్ సినిమా భారీ సక్సెస్ తర్వాత మలినేని గోపిచంద్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్, యాక్షన్, థ్రిల్లర్ వీరసింహారెడ్డి. ‘వీరసింహారెడ్డి’ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా రోజుల తరవాత బాలకృష్ణ నుంచి మళ్లీ పూర్తిస్థాయి రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న సినిమా కావడంతో తమ హీరోను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూడాలా అని అభిమానులు ఆరాటపడుతున్నారు. బాలయ్యబాబు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్న ఈమూవీ ఈరోజు(12జనవరి ) రిలీజ్ మొదటగా ఓవర్సీస్ లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.
కథ :
వీరసింహారెడ్డి(బాలకృష్ణ), భానుమతి(వరలక్ష్మి శరత్ కుమార్) ఇద్దరూ ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు, అయితే తల్లులు వేరు. అయినా వీరసింహారెడ్డికి చెల్లెలు అంటే ఎంతో ప్రేమ కానీ, ఆ చెల్లెలు మాత్రం ఈ అన్నయ్యను ఎప్పుడూ ద్వేషిస్తూనే ఉంటుంది. తన అన్నపై పగ సాధించడానికి భానుమతి ఆయనకు విరోధి అయిన ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తిని పెళ్ళాడుతుంది. కొన్ని కారణాల వల్ల వీరసింహారెడ్డి విదేశాలకు వెళతాడు. ఒక పథకం ప్రకారం వీరసింహారెడ్డిని విదేశాలలో ఉండగానే తన చెల్లెలి సహకారంతో చంపేస్తారు తన విరోధులు. అసలు వీరసింహారెడ్డి ని చంపేంత కోపం భానుమతి కి ఎందుకు వస్తుంది. భానుమతి కోపం అంతటితో తీరినట్టేనా? వీరసింహారెడ్డి ప్రేమాభిమానాలను చెల్లెలు గుర్తించిందా? ఆ తరువాత ఏమైంది? అన్న అంశాలతో మిగతా కథ సాగుతుంది.
నటీనటులు :
ఎప్పటిలాగే బాలకృష్ణ తన ఉగ్రరూపం చూపించాడు. తన పవర్ఫుల్ డైలాగ్స్ తో అభిమానులను మెప్పించాడు. వరలక్ష్మి శరత్ కుమార్ బాలకృష్ణ చెల్లెలి పాత్రలో చాలా చక్కగా చేసిందని చెప్పొచ్చు. హీరోయిన్ శృతి హాసన్ ని గ్లామర్ కి మాత్రమే పరిమితం చేసినట్లు అనిపించింది. ముఖ్యంగా థమన్ బాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని చెప్పొచ్చు.
ప్లస్ పాయింట్స్:
బాలకృష్ణ నట విశ్వరూపం
ఫ్యాక్షన్ నేపధ్యం
థమన్ సంగీతం
గోపీచంద్ మలినేని దర్శకత్వం
మైనస్ పాయింట్స్:
– సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు
ఫైనల్ పాయింట్ : బాలయ్య బాబు ‘నట విశ్వరూపం’
తెలుగుమిర్చి రేటింగ్ : 3.5/5