స్టార్ కాస్ట్ : నాని , సాయి పల్లవి , కృతిశెట్టి తదితరులు..
దర్శకత్వం : రాహుల్ సాంకృత్యాన్
నిర్మాతలు: వెంకట్ బోయినపల్లి
మ్యూజిక్ : మిక్కీ జె మేయర్
విడుదల తేది : డిసెంబర్ 24, 2021
తెలుగు మిర్చి రేటింగ్ : 3.25/5
నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘శ్యామ్ సింగరాయ్’. ఈ మూవీ లో నాని డ్యూయల్ రోల్ పోషించగా..ఆయన సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ ఎస్. బోయనపల్లి పాన్ మూవీ గా నిర్మించారు. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది..? డ్యూయల్ రోల్ లో నాని ఎలా నటించాడు..? అసలు కథ ఏంటి..? అనేది ఇప్పుడు చూద్దాం.
కథ :
వాసు (నాని) స్టార్ డైరెక్టర్ కావాలని కలలుకంటూ ఆ లక్ష్యాన్ని చేరుకోడానికి ముందు తను ఒక షార్ట్ ఫిలిం తీస్తుంటాడు. ఆ షార్ట్ ఫిలింలో నటించేందుకు కీర్తి (కృతిశెట్టి) అనే యువతిని ఒప్పిస్తాడు. ఆ తర్వాత ఆ షార్ట్ ఫిలింకు విశేష ఆదరణ రావడం తో.. వాసుకుపెద్ద సినిమా ఆఫర్ రావడం.. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో వాసు జాతకం మారుతుంది. పెద్ద డైరెక్టర్ అయిపోతాడు. అయితే.. అదే సినిమాను హిందీలోనూ డైరెక్ట్ చేసి కొన్ని లీగల్ సమస్యల్లో చిక్కుకుంటాడు వాసు. ఆ లీగల్ సమస్యలను ఎదుర్కొనే క్రమంలో వాసు దేవ్, శ్యామ్ సింగరాయ్ మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే విషయం బయటపడుతుంది.
మరి ఆలా బయటపడిన శ్యామ్ సింగ రాయ్ ఎవరు..? అతడికి వాసు కు ఏ సంబంధం..? అసలు శ్యామ్ సింగ రాయ్ ఎవరు..?అతడి గతం ఏంటి..? శ్యామ్ సింగ రాయ్ కి మైత్రి (సాయి పల్లవి ) సంబంధం ఏంటి..? వాసు లింగాలు సమస్యల నుండి ఎలా బయటపడతాడు అనేది తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
ప్లస్ :
- సెకండ్ హాఫ్
- నాని – సాయి పల్లవి యాక్టింగ్
- క్లైమాక్స్
- మ్యూజిక్
మైనస్ :
- ఫస్ట్ హాఫ్ లో సాగదీత సన్నివేశాలు
నటీనటుల పనితీరు :
- నాని రెండు విభిన్న పాత్రలతో ఆకట్టుకున్నాడు. నాని వాసు కంటే.. శ్యామ్ సింగరాయ్ పాత్రలో ప్రేక్షకులను బాగా మెప్పించాడు. కోల్‌కత్త లో బ్యాక్ డ్రాప్ లో వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. మోడ్రన్ పాత్రలో ఈజీగా నటించేసిన నానీ శ్యామ్ సింగరాయ్ పాత్రలో దుమ్ము దులిపేశాడు.
- ఇక సాయి పల్లవి గురించి కొత్తగా చెప్పదేముంది. సాధారణంగానే చాలా ఎనర్జిటిక్ గా నటించే పల్లవికి దేవదాసి లాంటి ప్రత్యేక పాత్రలు పడితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అసలు సినిమా ముగిసేంత వరకు సాయిపల్లవి ఎక్కడా కనిపించదు.. మైత్రేయిని చూస్తున్నట్లే ఉంటుంది.
- కృతిశెట్టి మరోసారి తన గ్లామర్ తో యూత్ ను కట్టిపడేసింది. ఇక మిగిలిన నటి నటులు వారి వారి పాత్రల్లో బాగానే నటించారు.
సాంకేతిక వర్గం :
- మిక్కీ జే మేయర్ సంగీతం సోసోగా ఉన్నా.. నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు.
- Sanu John Varghese సినిమా ఫొటోగ్రఫీ సినిమాకే హైలైట్ గా నిలిచింది.
- ఇక నిహారిక నిర్మాణ విలువలు బాగున్నాయి.
- ఇక డైరెక్టర్ రాహుల్ విషయానికి వస్తే..అతడికి రెండో సినిమానే అయినప్పటికీ ఎంతో జాగ్రత్తగా సినిమాను తెరకెక్కించారు. ముఖ్యముగా సెకండ్ హాఫ్ మరో లెవల్లో తెరకెక్కించి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు.
ఓవరాల్ గా : అందరు మెచ్చే శ్యామ్ సింగ రాయ్.