Site icon TeluguMirchi.com

రివ్యూ : సావిత్రి – పెళ్లి తప్ప ఏమి లేదు..

టైటిల్ : సావిత్రి (2016)
స్టార్ కాస్ట్ : నారా రోహిత్ , నందిత , పోసాని కృష్ణ మురళి
డైరెక్టర్ : పవన్ సాదినేని
ప్రొడ్యూసర్స్ : వి.బి. రాజేంద్ర ప్రసాద్
మ్యూజిక్ : శ్రవణ్
విడుదల తేది : ఏప్రిల్ 1, 2016
తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5

నారావారి అబ్బాయి నారా రోహిత్ జెట్ స్పీడ్ తో సినిమాలు పూర్తి చేసి , బాక్స్ ఆఫీసు దగ్గర సందడి చేస్తున్నాడు..ఈ ఒక్క ఏడాది లోనే దాదాపు 11 సినిమాలు చేసి రికార్డు బ్రేక్ చేసాడు. గత నెలలో తుంటరి వచ్చి ప్రేక్షకులను అలరించిన రోహిత్ , తాజాగా సావిత్రిగా ఈరోజు మన ముందుకు వచ్చాడు. నందిత , నారా రోహిత్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం, ఎంత వరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

కథ:

ఎప్పుడు పెళ్లి గురించే ఆలోచించే సావిత్రి (నందిత ) కు ఓ రోజు పెళ్లి సంబంధం కుదురుతుంది..పెళ్లి కుదిరిన సంద‌ర్భంలో మొక్కులు తీర్చుకోవ‌డానికి కుటుంబ సబ్యులతో కలిసి షిర్డీ కి బయలేదేరుతారు..అదే ట్రైన్ లో రుషి (నారా రోహిత్ ) సావిత్రి ని చూడగానే ప్రేమించడం మొదలు పెడతాడు. దీంతో సావిత్రి కి కోపం వచ్చి రుషి కి క్లాసు పికుతుంది..

కట్ చేస్తే..సావిత్రి ని చేసుకునే అబ్బాయి , అప్పటికే వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాని సావిత్రి కి చెప్పి , ఈ పెళ్లి చేసుకోనని వెళ్ళిపోతాడు. దాంతో సావిత్రి తండ్రి (మురళి శర్మ ) మరో సంబంధం కోసం ట్రై చేస్తాడు. ఇంతలో మన హీరో రుషి ఆ ఊరిలోకి ఎంట్రీ ఇస్తాడు. అక్కడ అతడికి అసలు విషయం తెలుస్తుంది..ఆ విషయం ఏంటి..? సావిత్రిని ఎలా పెళ్లి చేసుకుంటాడు..? అనేది మిగతా స్టొరీ..

ప్లస్ :

* నారా రోహిత్ – నందిత లవ్ ట్రాక్

* కామెడీ

మైనస్ :

మ్యూజిక్

కథ – కధనం

దర్శకత్వం

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

ఎప్పుడు సీరియస్ క్యారెక్టర్ లలో కనిపిస్తూ వచ్చిన నారా రోహిత్ ఈ చిత్రం లో ఫుల్ కామెడీ క్యారెక్టర్ లో కనిపించి అందరిని ఆశ్చర్య పరిచాడు. సినిమా మొత్తాన్ని తన భుజాల ఫై మోసాడు . ఇక నందిత సావిత్రిగా అమాయ‌క‌త్వం, చిలిపిత‌నం, అందం ఇలా అన్ని కలబోసి ఆకట్టుకుంది.

ఇక దొరబాబు పాత్రలో మురళి శర్మబాగానే చేశాడు. తన తమ్ముడు కృష్ణగా అజయ్ మరోసారి తన నటన ఏంటో చూపించాడు. చేసింది తక్కువ స్కోప్ ఉన్న పాత్రే అయినా సినిమాను నడిపించేది ఈ పాత్రే. ఇక కామెడీ విషయానికి వస్తే మరోసారి షకలక శంకర్ , ప్రభాస్ శ్రీను నవ్వులు పోయించారు.

సాంకేతిక విభాగం :

ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో పర్వాలేదనిపించుకున్న పవన్ సాధినేని, సావిత్రి కథ ను ఎంచుకొని బాగానే కష్ట పడ్డాడు. కానీ కథ లో కాస్త కొత్తదనం ఉంటె బాగుండు. వ‌సంత్ సినిమాటోగ్ర‌పీ బాగుంది. గౌత‌మ్ ఎడిటింగ్ సినిమాని స్పీడ్ పెంచింది. శ్ర‌వ‌ణ్‌ అందించిన నేపధ్య సంగీతం పర్వాలేదు. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది.

చివరిగా :

కథ లో కొత్తదనం లేకపోవడం , అక్కడక్కడ కామెడీ ని జోడించి సినిమాను పూర్తి చేసాడు..ఇక క‌మ‌ర్షియ‌ల్‌గా ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Exit mobile version