స్టార్ కాస్ట్ : ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ తదితరులు..
దర్శకత్వం : రాహుల్ సాంకృత్యాన్
నిర్మాతలు: శ్రీ హర్ష కొనుగంటి
మ్యూజిక్ : దేవి శ్రీ
విడుదల తేది : జనవరి 14, 2021
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5
దిల్ రాజు బ్యానర్ లో వచ్చే ప్రతి సినిమాకు శిరీష్ సహా నిర్మాతగా వ్యవహరిస్తుంటాడనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈయన కొడుకు ఆశిష్ రెడ్డి ఇండస్ట్రీ కి హీరోగా పరిచయం అయ్యాడు. ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో ఆశిష్ రెడ్డి హీరోగా ‘రౌడీ బాయ్స్’ మూవీ తెరకెక్కింది. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో కోమలి ప్రసాద్, విక్రమ్ సహిదేవ్, ‘హుషారు’ తేజ్ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా ఈరోజు జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలాంటి హిట్ అందుకుంది..? ఆశిష్ రెడ్డి యాక్టింగ్ ఎలా ఉంది..? సంక్రాంతి బరిలో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా..? అసలు ఈ మూవీ కథ ఏంటి..? అనేది ఇప్పుడు చూద్దాం.
కథ :
అక్షయ్( ఆశిష్) ఎలాంటి బాధ్యత లేకుండా అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు. జీవితంలో ఎలాంటి లక్ష్యం లేని అక్షయ్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరతాడు. కావ్య(అనుపమా పరమేశ్వరన్) మెడికల్ స్టూడెంట్. బీటెక్ లో చేరేందుకు వెళ్తూ.. కావ్యను చూస్తాడు అక్షయ్.. తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. అయితే అక్షయ్ జాయిన్ అయిన కాలేజీ విద్యార్థులకు కావ్య చదువుతున్న కాలేజీ విద్యార్థులకు అస్సలు పడదు. ఈ రెండు కాలేజీలో విద్యార్థుల మధ్యగ్యాంగ్ వార్స్ జరుగుతూనే ఉంటాయి. మరో వైపు కావ్యను అక్షయ్ తో పాటు.. తన క్లాస్ మెట్ విక్రమ్ (విక్రమ్ సహదేవ్)కూడా ప్రేమిస్తుంటాడు. అయితే ఈ ఇద్దరిలో కావ్య ప్రేమని ఎవరు పొందారు? ఈ ప్రేమను పొందే క్రమంలో ఎదురైన సవాళ్లు ఏమిటి? అనేదే కథ.
ప్లస్ :
- హీరో హీరోయిన్ కెమిస్ట్రీ
- దేవి శ్రీ ప్రసాద్ సంగీతం
- సినిమాటోగ్రఫీ
మైనస్ :
- రొటీన్ స్టోరీ
నటీనటుల తీరు :
- ఆశిష్ రెడ్డి కి ఫస్ట్ మూవీనే అయినప్పటికీ సక్సెస్ కొట్టాడని చెప్పాలి. ముందు నుంచి పెద్దగా అంచనాలు లేవు కానీ సినిమా చూసిన తర్వాత హీరో అవ్వాల్సిన క్వాలిటీస్ ఆశిష్ లో కనిపించాయి.. ఎక్కడ ఇది మొదటి సినిమా అనే అనుమానం కలగలేదు అంటే ఆశిష్ ఎంతలా కష్టపడ్డాడో అర్థం చేసుకోవచ్చు. ఎమోషనల్ సీన్స్ లో కొంచెం తడబడినా ఓవరాల్ గా ఓకే అనిపించాడు.
- అనుపమ హీరోయిన్ గా ఇప్పటిదాకా చాలా సినిమాల్లో నటించింది కానీ ఒక రకంగా హీరో తో పాటు మిగతా సినిమా మొత్తాన్ని అనుపమ తన భుజాల మీద వేసుకొని నడిపించింది. ముందు నుంచి ట్రోల్ అయిన ముద్దు సీన్లు కూడా నటించాల్సిన మేరకే నటించింది. ఆమె నటనలో కాస్త పరిణితి కనిపించింది.
- తేజ్ కూరపాటి, లగడపాటి శ్రీధర్ కుమారుడు విక్రం సహదేవ్, కోమలి ప్రసాద్, కార్తీక్ రత్నం, శ్రీకాంత్ అయ్యంగార్, జయప్రకాష్ ఇలా కొంత మంది నటీనటులు తమ పాత్ర పరిధిమేర నటించి ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం :
- దేవి శ్రీ అందించిన పాటలు, నేపథ్య సంగీతం కూడా అలరించింది.
- సినిమాటోగ్రఫీకి 100కి 100 మార్కులు వేయవచ్చు.
- ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.
- ఎడిటర్ మధు తన కత్తెరకు మరింత పని చెప్పి ఉంటే బాగుండేదేమో.
- హుషారు లాంటి యూత్‌ఫుల్ సినిమా చేసిన శ్రీహర్షను నమ్మి తన తమ్ముడి కుమారుడిని లాంచ్ చేయడం అనే పెద్ద బాధ్యత ఉంచారు దిల్ రాజు. స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుని లాంచ్ చేయడం అంటే ఆ ప్రెజర్ గట్టిగా ఉంటుంది కానీ దర్శకుడు కూడా ఎక్కడా తగ్గకుండా సరే డాన్స్, యాక్షన్, కామెడీ, హీరో, హీరోయిన్లు నటించడానికి స్కోప్ ఉన్న మంచి కథను ఎంచుకున్నాడు. అనుకున్న కథను కరెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో కాస్త తడబడ్డాడు కానీ ఓవరాల్ గా ఒకే అనిపించాడు.
ఫైనల్ :
రౌడీ బాయ్స్ స్టోరీ రొటీన్ అయినప్పటికీ..యూత్ కు నచ్చే అంశాలు నిండుగా ఉండడం తో బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధించినట్లే.