Site icon TeluguMirchi.com

రివ్యూ : రెడ్ – సస్పెన్స్ థ్రిల్లర్

స్టార్ కాస్ట్ : రామ్ పోతినేని,నివేదా పెతురాజ్,మాళవిక శర్మ,అమృత అయ్యర్,అపూర్వ,పోసాని  తదితరులు..
 దర్శకత్వం : తిరుమల కిషోర్  
 నిర్మాతలు: స్రవంతి రవికిశోర్
 మ్యూజిక్ : మణిశర్మ
 విడుదల తేది : జనవరి 14 , 2021
 తెలుగు మిర్చి రేటింగ్ : 3.25/5

రామ్ ,నివేదా పేతు రాజ్ జంటగా కిషోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం రెడ్. సంక్రాంతి కానుకగా ఈ మూవీ (జనవరి 13) న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ మూవీ తాడం కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ లో రామ్ డ్యూయల్ రోల్ చేసాడు. మరి ఈ మూవీ ఎలా ఉందనేది చూస్తే..

కథ :

సోనియా అగర్వాల్, రవి ప్రేమించి పెళ్లి చేసుకుని అభిప్రాయ భేదాలతో విడిపోతారు. అప్పటికే వీరిద్దరికి సిద్ధార్థ్, ఆదిత్యలు (రామ్ & రామ్ ) పుడతారు. తల్లిదండ్రులు విడిపోవడంతో సిద్దార్థ్ తండ్రి వద్ద.. ఆదిత్య తల్లి వద్ద పెరుగుతాడు. ఆదిత్య తల్లికి పేకాట వ్యసనం ఉండడం తో రోజు తనతో పాటు కొడుకుని కూడా పేకాట క్లబ్‌కి తీసుకుని వెళ్లి తన అలవాటుని మానుకోలేక ఇబ్బందుల్లో కూరుకుపోతుంది. దీంతో ఆదిత్య కోపం పెంచుకుంటాడు.

అదే సందర్భంలో కొడుకు కోసం తన వ్యసనాన్ని వదిలేసినా తల్లిని అర్థం చేసుకోలేకపోతాడు ఆదిత్య. జీవితంలో ఓడిపోయిన సోనీ అగర్వాల్ ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో తన సోదరుడు సిద్ధార్థ్, తండ్రి దగ్గరకు వెళ్లిపోతాడు ఆదిత్య. అయితే సిద్దార్థ్‌ని చూసుకున్నట్టుగా ఆదిత్యను చూసుకోలేకపోతాడు తండ్రి. దీంతో తండ్రి, సోదరుడుపై కోపం పెంచుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆలా బయటకు వచ్చిన ఆదిత్య ఏమవుతాడు..? ఆ తర్వాత తన ప్రవర్తనను మార్చుకుంటాడా లేదా..? మహిమ ఎవరు..ఆమెకు సిద్దార్థ్ సంబంధం ఏంటి..? అనేది పూర్తి స్టోరీ.

ప్లస్ :

* రామ్ యాక్టింగ్

* మ్యూజిక్

* యాక్షన్

మైనస్ :

* స్లో రన్

నటీనటుల తీరు :

* డ్యుయెల్ రోల్‌లో రామ్ అదరగొట్టాడు. సిద్ధార్థ్ పాత్రలో సాఫ్ట్‌గా కనిపించి.. ఆదిత్య పాత్రలో ఊర మాస్‌గా అనిపించాడు. డించికి డించికి సాంగ్‌లో ఫుల్ ఎనర్జీతో డాన్స్ అదరగొట్టేశాడు. రామ్ పర్‌ఫార్‌మెన్సే సినిమాకు మేజర్ అట్రాక్షన్

* ఎస్సై యామినిగా నివేదా పేతురాజ్ మంచి ప్రదర్శన ఇచ్చారు. యామిని పాత్రలో మాళవికా శర్మ మెప్పించారు. తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినా..తనదైన ముద్రవేశారు. మాళవిక శర్మ‌-రామ్ రొమాన్స్ బాగా పండింది. లిప్ లాక్‌లతో హీటెక్కించారు.

* ఇక అమాయకపు యువతి పాత్రలో అమృతా అయ్యర్‌ అద్భుతంగా నటించాడు.

* ఇక ఈ సినిమాలో పవిత్ర ఆంటీ అపవిత్రమైన పాత్రలో కనిపించి సర్ ప్రైజ్ చేసింది. డబ్బున్న అంకుల్స్‌ని ట్రాప్‌లో పెడ్డడం.. మందు, సిగరెట్‌‌లు తాగుతూ రచ్చ చేసింది. కమెడియన్ సత్య తన పంచ్‌లతో నవ్వులు పంచాడు. ఇక డించిక్ డించిక్ ఐటమ్ సాంగ్‌లో హెబ్బా పటేల్ అందాల ఆరబోతను షురూ చేసింది. గ్లామర్ డోస్ పెంచి రామ్‌తో రచ్చ చేసింది.

సాంకేతిక వర్గం :

* మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో పాటు మ్యూజిక్ అదిరిపోయింది.

* సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా అనిపిస్తుంది.

*  పీటర్ హెయిన్ స్టంట్స్ బాగున్నాయి. ఎడిటర్ జునైద్ సిద్ధఖీ ఫస్టాఫ్‌లో ఓ పది నిమిషాలు తగ్గిస్తే రన్ టైమ్ క్రిస్పీగా అనిపించేది.

* స్రవంతి రవి కిషోర్, కృష్ణ చైతన్య నిర్మాణ విలువలు స్క్రీన్‌పై కనిపించాయి.

* డైరెక్టర్ కిషోర్ విషయానికి వస్తే..

‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ వంటి సూపర్‌ హిట్ల తర్వాత తిరుమల కిశోర్, రామ్‌ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్‌ చిత్రం రెడ్‌.   ‘ఇస్మార్ట్ శంకర్’లాంటి సూపర్‌ హిట్‌ తర్వాతా రామ్‌ నుంచి వస్తున్న తొలి చిత్రం ఇదే కావడంతో ‘రెడ్‌’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను దర్శకుడు అందుకున్నాడు. తమిళ్ మూవీ తడమ్‌కు ఇది రీమేకే అయినా.. తెలుగు ఆడియన్స్‌కు నచ్చేలా కథలో మార్పులు చేసి మెప్పించాడు.

స్వతహాగా రచయిత కావడంతో ఈ కథకు కావాల్సిన స్టఫ్ తన కలం నుంచి సమకూర్చుకున్నాడు కిషోర్ తిరుమల. డైలాగ్స్ బాగున్నాయి. నచ్చింది తినాలనుకున్నా.. తినకపోతే ఏమౌతుందిలే అనుకునే బతుకులు వాళ్లవి. అంటూ మధ్యతరగతి వాళ్లపై రాసిన డైలాగ్ బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి. ఇలాంటి డైలాగ్‌లు సినిమాలో చాలానే ఉన్నాయి. రామాయణం మగాళ్లు కాకుండా ఆడాళ్లు రాసిఉంటే.. అనుమానం అనేది ఇప్పటికీ లేకుండా ఉండేది లాంటి గమ్మత్తైన డైలాగ్‌లతో ఆకట్టుకున్నాడు కిషోర్ తిరుమల. మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్లే కొలదీ థ్రిల్లింగ్ ట్విస్ట్‌లు, సర్ ప్రైజ్‌‌లతో కథ సాఫీగా నడిపించి సక్సెస్ అయ్యాడు.

ఫైనల్ :

సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ మిస్టరీ చిత్రాలను ఇష్టపడేవారికి బాగా నచ్చుతుంది.

Exit mobile version