Rangamarthanda Review
టెస్ట్ మ్యాచ్ ని క్లాసిక్ క్రికెట్ అంటారు. కానీ టెస్ట్ మ్యాచ్ చూడాలంటే చాలా మందికి చాలా బోరు. మూడు గంటల్లో తేలిపోయే టీట్వంటీలు ఉండగా.. ఇంకా ఆ టెస్ట్ మ్యాచులు ఎవరు చూస్తార్రా బాబు అనే ఫీలింగ్.
కానీ.. చివరి రోజు ఆట.. గెలవడానికి 50 పరుగులు కావాలి. చివరి వికెట్… అప్పుడు వస్తుంది అసలు టెస్ట్ మాజా. ఆ వికెట్ కోసం.. ఆ 50 పరుగుల కోసం టీవీలకి అత్తుక్కుపోతాం కదా.. అదీ.. టెస్ట్ క్రికెట్ మజా. అదిచ్చే కిక్కు.. టీట్వంటీ ఇవ్వలేదు. కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ కూడా అలా క్లాసిక్ టచ్ తోఎమోషనల్ గా కిక్కించే సినిమానే.
కథ చాలా సింపుల్.. స్టేజ్ పై తప్పితే.. రియల్ లైఫ్ లో నటించడం చేతకాని ఓ రంగస్థల నటుడి కథ.
ఈ కథ కూడా అలా నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. కానీ ఒక్కసారి ఫ్యామిలీ డ్రామా కనెక్ట్ అయిన తర్వాత.. ఇంక స్క్రీన్ కి ఎడిక్ట్ అయిపోతాం. మన ఇంట్లోనే జరుగుతున్న కథలా వుంటుంది కానీ ఎదో మ్యాజిక్ మనల్ని అలా లాక్కొంటూ వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ వచ్చే ఎమోషన్స్ మన పర్మిషన్ లేకుండా కన్నీళ్లు తెప్పించేస్తాయి. బ్రహ్మనందం, ప్రకాష్ మధ్య వచ్చే సీన్స్ గురించి చెప్పడానికి ఏం లేదు.. చూడాల్సిందే.
ప్రకాష్ రాజ్, బ్రహ్మనంద, రమ్యకృష్ణ జస్ట్ మైండ్ బ్లోయింగ్. సినిమా చూసిన వచ్చిన తర్వాత మనతో పాటే వచ్చేసే క్యారెక్టర్స్ అవి. కృష్ణవంశీ ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా చాలా నిజాయితీగా తీశారు. టెక్నికల్ గా కొన్ని లోపాలు కనిపిస్తాయి. కెమరాలో ఉన్న సమస్య ఏమో కానీ కొన్ని కొన్ని సీన్స్ సీరియల్ టోన్ లో కనిపిసాయి.
ఇళయరాజా మ్యూజిక్ మాత్రం… జస్ట్ వావ్. కృష్ణ వంశీ స్ట్రాంగ్ మెసేజ్ తో ఇంకా స్ట్రాంగ్ ఎమోషన్స్ తో రంగామార్తండ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ‘అక్షరాన్ని పొడిగా పలకకు… దాని వెనుక తడిని చూడు’ అనే మాటలో ఇందులో వుంది. అవును.. ఇది మనసుని ఎమోషన్ తో తడిపేసే సినిమా.
తెలుగులో అన్నీ కమర్షియల్ సినిమాలే. మలయాళంలా కంటెంట్, పెర్పార్మెన్స్ బేస్డ్ సినిమాలు ఇక్కడ రావని చాలా మంది బాధపడిపొతుంటారు. అలాంటి వారందరికీ సమాధానంగా ‘రంగమార్తాండ’ వచ్చింది. డోంట్ మిస్ ఇట్.