నటీనటులు: నితిన్, కీర్తీ సురేష్, వెన్నెల కిషోర్ తదితరులు
దర్శకత్వం : వెంకీ అట్లూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ
మ్యూజిక్ : దేవిశ్రీ
విడుదల తేది : మార్చి 26, 2021
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5
భీష్మ తో సూపర్ హిట్ అందుకున్న నితిన్.. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే మూవీ చేసాడు. ‘గిమ్మీ సమ్ లవ్’ అనేది ట్యాగ్ లైన్. నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించగా.. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. పాటలు , టీజర్స్ సినిమా ఫై అంచనాలు పెంచడం తో సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలో పెరిగింది. దానికి తగ్గట్లే ఈరోజు ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్ కు పరుగులు పెట్టారు. మరి వారి అంచనాలకు తగ్గట్లు సినిమా ఉందా..? అసలు చిత్ర కథ ఏంటి..? మహానటి ఫేమ్ కీర్తి యాక్టింగ్ ఎలా ఉంది..అనేది ఇప్పుడు చూద్దాం.
కథ :
అర్జున్ (నితిన్), అనుపమ (కీర్తి సురేష్) చిన్ననాటి నుండి స్నేహితులు. పక్క పక్క ఇంట్లో ఉండే ఫ్యామిలీ ఫ్రెండ్స్. చదువుల్లో అర్జున్ వెనుకుంటే.. అనుపమ ఎప్పుడూ టాప్ స్కోరర్‌గా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వారిద్దరి మధ్య స్నేహం, ప్రేమతోపాటు ద్వేషం కూడా కొనసాగుతుంటుంది. అయితే ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకొన్న అనుపమ కు తల్లి అడ్డు పడి పెళ్లి ఏర్పట్లు చేస్తుంది. అర్జున్ మీద ప్రేమను చంపుకోలేక.. ఇష్టం లేని వివాహం చేసుకోలేక పెళ్లి పీటల మీద నుంచి లేచి అర్జున్ ను పెళ్లి చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి తర్వాత వాళ్ల కాపురం సజావుగా సాగిందా లేదా..? ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న అను..ప్రెగ్నెంట్ అవుతుంది. ప్రెగ్నెంట్ తర్వాత అర్జున్‌కు ఎందుకు విడాకులు ఇవ్వాలనుకొంటుంది? విడాకులకు సిద్ధమైన అనుపమతో రాజీ చేయడానికి అర్జున్ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నారు..? అనేది కథ.
ప్లస్ :
- కీర్తి సురేష్- నితిన్ యాక్టింగ్
- ఫ్యామిలీ ఎమోషన్స్
*సినిమాటోగ్రఫి - దేవి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ :
- రొటీన్ స్టోరీ
- సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా బోరింగ్ సన్నివేశాలు
నటీనటుల తీరు :
- ఇప్పటి వరకు రొమాంటిక్, లవర్ బాయ్‌గా కనిపించిన నితిన్ ఈ మూవీ లో అర్జున్‌గా ఓ డిఫరెంట్ రోల్‌లో ఒదిగిపోయాడు. సెకండాఫ్‌లో నితిన్ నటనలో అనూహ్యమైన మార్పు కనిపిస్తుంది. బలమైన, భావోద్వేగమైన సీన్లలో మెప్పించాడు.
- అను రోల్ లో కీర్తి సురేష్ మహానటి లెవల్లో నటించింది. ఫస్ట్ హాఫ్ లో గ్లామర్ పాత్రలో కనిపించి.. సెకండాఫ్‌లో సినిమాను తన భుజాల మీద మోస్తూ ఆడియెన్స్‌ను భావోద్వేగానికి గురిచేసింది. చివరి 40 నిమిషాల్లో కీర్తీ సురేష్ నటన మరోస్థాయిలో ఉంటుంది. నితిన్ – కీర్తి జోడీ యూత్ ను బాగా ఆకట్టుకుంది.
- వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం కామెడీ ప్రధాన ఆకర్షణ. సుహాస్‌తో కలిసి అభివన్ తొలి భాగంలో తన మార్కును చూపించగా… సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్ మరోసారి కామెడీ టైమ్‌తో ఆకట్టుకొన్నాడు.
- హీరో తండ్రిగా నరేష్, హీరోయిన్ తల్లిగా రోహిణి బలమైన పాత్రల్లో కనిపించారు.
- బ్రహ్మాజీ ప్రథమార్ధంలో నవ్వులు పండించారు. ఇక మిగతా నటీనటులు వారి వారి పరిధిలో మెప్పించారు.
సాంకేతిక వర్గం:
- దేవిశ్రీప్రసాద్ పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్ గా నిలిచాయి.
- పీసీ శ్రీరాం సినిమాటోగ్రఫి స్పెషల్ ఎట్రాక్షన్స్. సెంటిమెంట్‌తో కూడిన ఎమోషనల్ సీన్లలో లైటింగ్, కలర్ కాంబినేషన్స్ సినిమాకు పాజిటివ్‌గా మారాయి. కీర్తి సురేష్, నితిన్‌ను మరింత గ్లామర్‌గా చూపించారు.
- ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు ఓకే
- నిర్మాణ విలువలు ఆకట్టుకున్నాయి.
- ఇక డైరెక్టర్ వెంకీ విషయానికి వస్తే..మొదటి నుండి కూడా ప్రేమ కథలపై ఫోకస్ చేసే ఈ యంగ్ డైరెక్టర్ ..ఈ మూవీ కథ లో ప్రేమతో పాటు ఫ్యామిలీ ఎమోషనల్ ను జోడించాడు. రైటర్ గా హ్యూమర్, ఎమోషనల్ అంశాలను పక్కగా పండించడంలో సఫలమయ్యారని చెప్పవచ్చు.
మహానటి తర్వాత సక్సెస్ పరంగా తడబాటుకు గురవుతున్న కీర్తీ సురేష్‌కు బలమైన పాత్రను అందించారు. అలాగే నితిన్‌లో కొత్త ఫెర్ఫార్మర్‌ను చూపించాడు. నరేష్, రోహిణి, వినీత్ లాంటి క్యారెక్టర్లతో ఫ్యామిలీ ఎలిమెంట్స్, అభినవ్, వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ బాగా పండించాడు. కాకపోతే కథలో కొత్తదనం లేకుండా రొటీన్ కథనే రాసుకున్నాడు. సెకండ్ హాఫ్ లోను కాస్త బోరింగ్ సన్నివేశాలు అనిపించాయి.
ఫైనల్ గా :
మల్టీఫ్లెక్స్ ఆడియన్స్ కు బాగానే నచ్చుతుంది..కానీ మాస్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో..