Site icon TeluguMirchi.com

రివ్యూ : పుష్ప – పుష్పరాజ్ తగ్గిదేలే అనిపించుకున్నాడు

స్టార్ కాస్ట్ : అల్లు అర్జున్ , రష్మిక , సునీల్ తదితరులు..
దర్శకత్వం : సుకుమార్
నిర్మాతలు: మైత్రి మూవీ మేకర్స్
మ్యూజిక్ : దేవి శ్రీ
విడుదల తేది : డిసెంబర్ 17, 2021
తెలుగు మిర్చి రేటింగ్ : 3.25/5

స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ పుష్ప. లాక్‌డౌన్ కారణంగా రెండేళ్లుగా ఈ సినిమా ప్రేక్షకులకు దూరమైంది. అయితే మోషన్ పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా బన్నీ కెరీర్‌లో తొలి ప్యాన్ ఇండియా మూవీ కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై దృష్టి పడింది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ అంచనాలను అందుకుందా..? బన్నీ ని పాన్ ఇండియా స్టార్ చేస్తుందా..? సుకుమార్ టేకింగ్ ఎలా ఉంది..? సమంత ప్రేక్షకుల చేత ఊ కొట్టించుకుందా..? అసలు సినిమా కథ ఏంటి..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

తిరుపతి శేషాచలం అడవుల్లో పుష్ప రాజ్ ( అల్లు అర్జున్) గంధం చెక్కల అక్రమ వ్యాపారంలో కూలీగా పనిచేస్తుంటాడు. అయితే చెప్పుకోవడానికి ఇంటి పేరు లేకపోవడం, కూలీగా తన జీవితాన్ని చూసి ప్రపంచాన్ని జయించాలనే కసి పెరుగుతుంది. ఇక తన వ్యాపారంలో ఎదురు పడిన కొండారెడ్డి (అజయ్ ఘోష్), మంగళం శ్రీను (సునీల్) దాక్షయిని (అనసూయ)తో చేతులు కలుపుతాడు. అయితే ఓ దశలో తనకు అన్యాయం చేసిన మంగళం శ్రీనును ఎదురించి సవాల్ విసురుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా పోలీస్ ఉన్నతాధికారిగా వచ్చిన భన్వర్ సింగ్ షెకావత్ (ఫాజిల్ ఫహద్) అమీతుమీ సిద్దమవుతాడు. మరి భన్వర్ సింగ్ ను ఎదురు నిలిచి గెలిచాడా..? లేదా..? మనసుపడిన శ్రీవల్లి (రష్మిక ) ను పెళ్లి చేసుకున్నాడా లేదా..? మంగళం శ్రీను..పుష్ప రాజ్ కు చేసిన మోసం ఏంటి..? అనేది మీరు తెరపై చూడాల్సిందే.

ప్లస్ :

మైనస్ :

సాంకేతిక వర్గం :

నటీనటుల తీరు :

పుష్ప సినిమాలో అల్ల అర్జున్‌ది వన్ మ్యాన్ షో. ప్రేక్షకులకు స్టైలిష్ హీరోగా కనిపించిన పుష్పగా ముతక పాత్రలో ఇరగదీశాడు. ఇటీవల కాలంలో దక్షిణాదిలో (కేజీఎఫ్‌లో యష్ మినహాయిస్తే) ఏ హీరో చూపించిన విధంగా ఫెర్ఫార్మెన్స్‌తో తనలో నటుడిని బయటపెట్టాడు.

ప్రతీ సీన్‌ సీన్‌కు కథను లేపుకొంటూ వెళ్లిపోయాడు. కొండారెడ్డి, మురుగన్, మంగళం శ్రీను, పోలీస్ ఉన్నతాధికారులు గోవింద్ (శత్రు), షెకావత్ (ఫాహద్ ఫాజిల్) పోటాపోటీగా నడిచే సీన్లలో విశ్వరూపం చూపించాడు. రొమాంటిక్ సీన్లలో రష్మికతో కలిసి మంచి కెమిస్ట్రీని పండించాడు.

దర్శకుడు సుకుమార్ మదిలో మెదిలిన పాయింట్‌‌ను ఒక్కొక్క పొరగా అల్లిన తీరు చాలా బాగుంది. పాత్రలను డిజైన్ చేసిన విధానం అద్బుతంగా ఉంది. పిరియాడిక్ మూవీకి కావాల్సిన క్యాస్టూమ్ డిజైనింగ్ సినిమాకు ఓ రకమైన శోభను తీసుకొచ్చింది. పాత్రల హావభావాలు, ఎమోషనల్, రొమాంటిక్, యాక్షన్ అంశాలు మేలవించి తెర మీద చూపించిన పద్ధతి చాలా బాగుంది. తెలుగు తెర మీద ఓ కొత్త అనుభూతిని కలిగించే విధంగా ఉంది. కాకపోతే కథనం ఫై ఇంకాస్త పెడితే బాగుండు. అలాగే సెకండ్ లో చాల సన్నివేశాలు స్లో గా సాగాయి. ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిందనే విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నట్లు స్మగ్లింగ్ సీన్స్ నే ఎక్కువ పెట్టారు. పోలీసుల నుంచి హీరో ఎదుర్కొనే అవరోధాలు, అటాక్ లు కూడా పూర్తి సినిమాటిక్ గానే సాగాయి. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త తగ్గింది.

ఓవరాల్ గా :

పుష్పరాజ్ – తగ్గిదేలే అనిపించుకున్నాడు

Exit mobile version