రివ్యూ : పటేల్ సర్ – జగ్గు ప్రతీకారం

టైటిల్ : ‘ పటేల్ సర్‘ (2017)
స్టార్ కాస్ట్ : జగపతిబాబు, పద్మప్రియ, తాన్య హోప్, పోసాని కృష్ణ‌ముర‌ళి తదితరులు.. దర్శకత్వం : వాసు పరిమి
నిర్మాతలు: వారాహి చ‌ల‌న చిత్రం
మ్యూజిక్ : వసంత్
విడుదల తేది : జులై 14, 2017
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

రివ్యూ : పటేల్ సర్ – జగ్గు ప్రతీకారం

ఫ్యామిలీ హీరో నుండి విలన్ గా టర్న్ తీసుకొన్న జగపతి బాబు..ప్రస్తుతం విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీ లలో రాణిస్తున్నాడు. విలన్ గా టర్న్ తీసుకొన్న తర్వాత తొలిసారి పటేల్ సర్ అనే మూవీ తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వాసు పరిమి అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ మూవీ ని ఫ్యామిలీ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయినా వారాహి చ‌ల‌న చిత్రం వారు నిర్మించడం విశేషం.

ట్రైలర్ లో స్టైలిష్ గా కనిపించిన జగపతి బాబు ను చూసి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కథలో కొత్త ట్విస్ట్ లు ఉన్నట్లు ప్రచారం చేయడం తో సినిమాపై ఆసక్తి పెంచుకున్నారు. మరోపక్క చాల రోజుల తర్వాత జగపతి బాబు హీరోగా చేయడం తో సినిమా ఫై అంచనాలు పెంచుకున్నారు. మరి అంచనాలకు తగ్గట్టే పటేల్ సర్ అలరించాడా ..లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

సుభాష్ ప‌టేల్ (జ‌గ‌ప‌తిబాబు) ఇండియ‌న్ ఆర్మీలో ఓ మేజ‌ర్‌…తన ఫ్యామిలీ అంత కూడా దేశ సేవ చేయడం తో తాను కూడా ఆర్మీలో చేరి మేజర్ స్థాయికి చేరుకుంటాడు. తన తరువాత తరం కూడా ఆర్మీలో చేరాలని అనుకుంటాడు..కానీ అతడి కోరిక మాత్రం తీరడం లో అసంతృప్తి ఎదురువుతుంది. ఇక వయసు మీద పడడం తో సుభాష్ రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకుంటాడు ..కానీ అదే టైం లో తన భార్య భార‌తి (ఆమ‌ని) చనిపోవడం తో తీవ్రంగా కుమిలిపోతాడు..కాకపోతే తన భార్య చనిపోవడం వెనుక ఓ నిజం తెలుసుకుంటాడు..దాంతో చేయాల్సిన యుద్ధం బార్డర్ లో కాదని దేశం లోపలా అని మళ్లీ తుపాకీ పట్టుకుంటాడు..ఆ తర్వాత ఏం జరుగుతుంది..? అసలు భారతి ఎలా చనిపోద్ది..? సుభాష్ కు తెలిసిన నిజం ఏంటి అనేది మీరు తెర ఫై చూడాల్సిందే..

ప్లస్ :

* జగపతి బాబు యాక్టింగ్

* నేపధ్య సంగీతం

* సెకండ్ హాఫ్

మైనస్ :

* ఫస్ట్ హాఫ్

* కథనం

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* ముందుగా జగపతి బాబు యాక్టింగ్ గురించి చెప్పుకోవాలి..హీరోగా కెరియర్ ముగిసిపోయిందనుకునే టైం లో విలన్ గా ఎంట్రీ ఇచ్చి మళ్లీ తన సత్తాను చాటుకున్నాడు. అన్ని భాషల్లో వరుస పెట్టి అవకాశాలు చేస్తూ బిజీ అయ్యాడు. ఈ టైం లో మళ్లీ హీరో అవతారం ఎత్తడం తో అందరూ కూడా జగపతి హీరో అయ్యాడేంటి అని అనుకున్నారు. కానీ ఈ మూవీ చూస్తే అందరికి ఆ సందేహం తొలగిపోతుంది. ఎందుకంటే ఈ మూవీ కేవలం జగపతి మాత్రమే చేయగలడు అని నిరూపించుకున్నాడు.

సుభాష్ పటేల్ రోల్ లో అద్భుతమైన నటన ను కనపరిచాడు. తన ఫ్యామిలీ ని చంపిన వారి ఫై ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి గా ఆకట్టుకున్నాడు. యాక్షన్ తో పాటు సెంటిమెంట్ సన్నివేశాల్లో కూడా కంట తడి పెట్టేంచాడు. వ‌ల్ల‌భ్ ప‌టేల్‌గా.. సుభాష్ ప‌టేల్‌గా వేరియేష‌న్స్ చూపించిన విధానం, న‌ట‌న బాగుంది.

* చాల రోజుల తర్వాత ప‌ద్మ‌ప్రియ‌ మరోసారి వెండి తెర ఫై కనిపించి ఆకట్టుకుంది. తన పరిధి మేరకు బాగానే చేసింది. తాన్య హోప్ కూడా చాల చక్కగా నటించి మార్కులు కొట్టేసింది.

* క‌బీర్‌సింగ్, పృథ్వీ, ప్ర‌భాక‌ర్ విలన్ రోల్ లో కనిపించరు..చాలామందే విలన్లు ఉన్నప్పటికీ ఇంకాస్త విలనిజం చూపిస్తే బాగుండు.

* పోసాని కృష్ణ మురళి , రఘుబాబు కామెడీ బాగానే ఆకట్టుకుంది. శుభలేఖ సుధాకర్, బేబీ డాలీ యాక్టింగ్ బాగుంది… మిగిలిన నటి నటులు వారి వారి పాత్ర ల మేరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

సాంకేతిక విభాగం :

* వసంత్ అందించిన మ్యూజిక్ జస్ట్ ఒకే అనిపించింది..బ్యాక్ గ్రౌండ్ బాగుంది. సినిమాలో హైలైట్ గా నిలిచింది శ్యామ్ కె.నాయుడు సినిమా ఫోటోగ్రఫీ. ప్రతి ఫ్రేమ్ కూడా ఎంతో ఆకట్టుకుంది. ప్రకాష్ డైలాగ్స్ బాగానే పేలాయి. యాక్షన్ తో పాటు సెంటిమెంట్ సన్నివేశాల్లో ఈయన రాసిన మాటలు కంటతడి పెట్టించాయి.

* కథ కు తగట్టే గౌతమ్ రాజు ఎడిటింగ్ ఉంది..కాకపోతే డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ లో ఇంకాస్త ఇంట్రస్ట్ పెడితే బాగుండు. నిర్మాణ విలువల విషయానికి వస్తే లాభాల కోసమే కాకుండా సినిమా తో జనాలకు ఎంతో కొంత అవగాహనా తేవాలనే చూసే నిర్మాత సాయి కొర్రపాటి. ఈ మూవీ కూడా అలాగే నిర్మించాడు. ఎక్కడ కూడా ఖర్చు కు వెనకడుగు వెయ్యకుండా ఓ సీనియర్ హీరో కు కూడా అగ్ర హీరోకు పెట్టె బడ్జెట్ పెట్టి సినిమా ఫై తనకున్న ఫ్యాషన్ కు నిరూపించుకున్నాడు.

* ఇక డైరెక్టర్ వాసు పరిమి విషయానికి వస్తే మొదటి చిత్రమైనప్పటికీ వృద్ధుడైన ఒక తండ్రి ప్ర‌తీకారం తీర్చుకొనే కథ ను చూపించి సక్సెస్ అయ్యాడు. కేవలం ప్రతీకారం మాత్రమే కాకుండా సెంటిమెంట్ , దేశ సేవ , కథలో ట్విస్ట్ లు పెట్టి ప్రేక్షకుడికి ఆసక్తి పెంచేలా చేసాడు. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో మొత్తం ప్రతీకారం మాత్రమే చూపించి ఇదో పగ నేపథ్యం లో సాగే కథలా అనిపించాడు. కాకపోతే ఇంటర్వెల్ ట్విస్ట్ మరొకటి చూపించి సెకండ్ హాఫ్ ఫై ఆసక్తి పెరిగేలా చేసి దర్శకుడి గా సక్సెస్ అయ్యాడు.

చివరిగా :

ఒక‌ప్పుడు త‌న కుటుంబాన్ని మ‌ట్టుబెట్టిన వాళ్ల‌పై ఓ వృద్ధుడు ఎలా పగ తీర్చుకున్నాడు..అనేదే కథ..జగపతి బాబు ఈ మూవీ లో స్టైలిష్ గా కనిపించడమే కాదు , యువ హీరోలు కూడా ఈయన కింద తక్కువే అనిపించేలా యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. సెంటిమెంట్ , యాక్షన్ , కామెడీ ఇలా అన్ని సమపాలనలో ఉన్నాయి. యాక్షన్ ప్రియులకు బాగానే నచ్చుతుంది.

కొన్ని నెలలుగా విలన్ కే పరిమితం అయినా జగ్గు..ఈ మూవీ తో మరోసారి హీరోగా సక్సెస్ అయ్యాడు. డైరెక్టర్ కూడా ప్రతీకార నేపధ్య కథను ఎంచుకొని సక్సెస్ అయ్యాడని చెప్పాలి..ఫస్ట్ హాఫ్ కాస్త అటు ఇటుగా ఉన్న సెకండ్ ట్విస్ట్ లతో ఆకట్టుకుంటుంది. ఓవరాల్ గా ప్రతీకారం తో కూడిన పటేల్ సర్.