Site icon TeluguMirchi.com

రివ్యూ : పడి పడి లేచే మనసు – పడి పడి లేవలేకపోయింది

స్టార్ కాస్ట్ : శ‌ర్వానంద్, సాయిల‌ప్ల‌వి తదితరులు..
దర్శకత్వం : హ‌ను రాఘ‌వ‌పూడి
నిర్మాతలు: శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్
మ్యూజిక్ : విశాల్ చంద్ర‌శేఖ‌ర్
విడుదల తేది :డిసెంబర్ 21, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 2/5

రివ్యూ : పడి పడి లేచే మనసు – పడి పడి లేవలేకపోయింది

శర్వానంద్, సాయి పల్లవి జోడీగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కడం , టీజర్స్ , ట్రైలర్స్ సైతం ఆకట్టుకోవడం తో విడుదలకు ముందే సినిమాకు పాజిటివ్ బజ్ సొంతం చేసుకుంది. ఈరోజు (డిసెంబర్ 21) వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల అయ్యింది.

అంతరిక్షం, కేజీఎఫ్, జీరో, మారి 2 ఇలా భారీ చిత్రాలు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తుండడం తో , ‘పడి పడి లేచె మనసు’ ఏ మేరకు లేస్తుందో అని అంత ఆసక్తిగా ఎదురుచూసారు..మరి వారి ఆసక్తి తగ్గట్లు సినిమా ఉందా..? ఫిదా , ఎంసిఏ చిత్రాలతో హిట్స్ అందుకున్న సాయి పల్లవి ఈ సినిమా తో హ్యాట్రిక్ హిట్ అందుకుందా..లేదా..? హనురాఘవాపుడి ఎలాంటి ప్రేమ కథ తో వచ్చాడు..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌ అయినా సూర్య (శర్వానంద్), మెడికల్ స్టూడెంట్‌ వైశాలి (సాయిప‌ల్ల‌వి) ని చూసి మొదటి చూపులోనే ప్రేమించడం మొదలు పెడతాడు. వైశాలి మాత్రం సూర్య కు దూరంగా ఉంటూ వస్తుంది. కొన్ని రోజుల తర్వాత సూర్య లో నిజమైన ప్రేమ ఉందని గమనించి , ప్రేమించడం మొదలు పెడుతుంది. ఇద్దరు కూడా ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేము అనేంతగా దగ్గరవుతారు.

ఓ సంద‌ర్భంలో క్యాంప్ కోసం వైశాలి ఖాట్మండుకు వెళ్తుంది. ఆమె చూడ‌కుండా ఉండ‌లేక‌పోయిన సూర్య కూడా ఖాట్మండుకు వెళ్తాడు. అక్క‌డ అనుకోకుండా వైశాలి తండ్రిని క‌లుస్తాడు. ఆ సమయంలో కొన్ని విషయాలని సూర్య కు చెప్పడం తో .. సూర్య, వైశాలితో కలిసుందాం గాని పెళ్లి వద్దని అంటాడు. ఆ మాట వినగానే వైశాలి కోపం తో మనం కలిసి ఉండడం కాదు విడిపోదాం అని చెప్పి , సూర్య కు దూరం అవుతుంది. ఆలా దూరమైన సూర్య , వైశాలి మళ్లీ కలుసుకుంటారా..లేదా..? అసలు వైశాలి తండ్రి సూర్య కు ఏం చెపుతాడు…? అసలు కథ ఏంటి ..? అనేది మీరు తెర ఫై చూడాల్సిందే.

ప్లస్ :

* శర్వానంద్ , సాయి పల్లవి

* సినిమాటోగ్రఫీ

* సాంగ్స్

మైనస్ :

* సెకండ్ హాఫ్

* బోరింగ్ స్టోరీ

* స్లో నరేషన్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

ఫ్యామిలీ కథలకైనా , ప్రేమ కథలకైనా శర్వానంద్ యిట్టె సరిపోతాడని మరోసారి ఈ సినిమా తో రుజువు చేసాడు. రొమాంటిక్‌, లవ్ సీన్స్‌తో పాటు కామెడీ సన్నివేశాల్లోను తనదయిన మార్క్ నటన చూపించి ఆకట్టుకున్నాడు.

ఇక సాయి పల్లవి నటన గురించి చెప్పాల్సిన పనేలేదు. ఫిదా తోనే తన నటన ఏ రేంజ్ లో ఉంటుందో బయటపెట్టి అందరిని కట్టిపడేసింది. ఇక ఈ సినిమాలోనూ అద్భుతంగా నటించి మరో ఎత్తుకు ఎదిగింది. వైశాలి పాత్రలో సాయి నటించడం కాదు జీవించిందనే చెప్పాలి.

ముఖ్యం గా శర్వా, సాయి పల్లవిల మధ్య వచ్చే సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి. ఇద్దరు కూడా పోటాపోటీగా నటించి ఫుల్ మార్కులు వేసుకున్నారు.

* ప్రియదర్శి, సునీల్‌, వెన్నెల కిశోర్‌లు నవ్వించే ప్రయత్నం చేశారు. మురళి శర్మ, ప్రియా రామన్‌ తమ పాత్రల పరిది మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక విభాగం :

* ముందుగా విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి..బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్స్ తో పాటు చక్కని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అందర్నీకట్టిపడేసాడు. ‘పడి పడి లేచె మనసు’ టైటిల్ సాంగ్‌తో పాటు ‘పద పద’, ‘కల్లోలం’ సాంగ్స్ మళ్లీ మళ్లీ వినేలా ఉన్నాయి.

* జ‌య‌కృష్ణ గుమ్మ‌డి సినిమా ఫొటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణ గా నిలిచింది. కొల్‌కతా నగరం తో పాటు పాటల చిత్రీకరణలో తన మార్క్ పనితనం చూపించారు.

* సెకండ్ హాఫ్ లో శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్ ఎడిటింగ్ కు ఇంకాస్త పని చెప్పాల్సింది..చాల సన్నివేశాలు బోరింగ్ గా సాగడం తో ప్రేక్షకులకు విసుగొస్తుంది.

* శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ నిర్మాణ విలువలు పర్వాలేదు అనిపించాయి.

* ఇక డైరెక్టర్ హను రాఘవపూడి విషయానికి వస్తే.. ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడి..ఆ తర్వాత నితిన్ తో లై చిత్రాన్ని తెరకెక్కించి నిరాశ పరిచాడు. లై ప్లాప్ అయినాగానీ హను ఫై అందరిలో మంచి అంచనాలే ఉన్నాయి. ప్రేమకథలు తెరకెక్కించడంలో మంచి పట్టు ఉందని అంత భావిస్తారు. పడి పడి లేచే మనసు కూడా అలాగే ఉంటుందని అంత భావించారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేసాడు.

ఫస్ట్ హాఫ్ అంత హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, కామెడీ, సాంగ్స్‌ తో నడిపించిన , సెకండ్ హాఫ్ ను మాత్రం వదిలేసాడు అనిపిస్తుంది. బోరింగ్ సన్నివేశాలు , స్లో నేరేషన్ తో సినిమా ను ఏటో తీసుకెళ్లాడు. అక్కడక్కడా సునీల్‌ కామెడీ వర్క్‌ అవుట్‌ అయినా ఫస్ట్ హాఫ్ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. క్లైమాక్స్‌ సన్నివేశాలు సైతం ఏదో ముగించాలి అన్నట్లు పూర్తి చేయడం తో ప్రేక్షకులకు నిరాశ కలిగింది.

నోట్ :

సినిమాను థియేటర్స్ లలో చూడండి..పైరసీ చేసి సినిమా ఇండస్ట్రీని నాశనం చేయకండి. ఎంతో ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంది కేవలం మన ఆనందం కోసమే..అలాంటి ఆనందాన్ని పైరసీ లో చూడకండి.

తెలుగు మిర్చి రేటింగ్ : 2/5

Click here for English Review

Exit mobile version