రివ్యూ : ఓదెల 2 | Odela 2 Review

Odela 2 Review

తెలుగుమిర్చి రేటింగ్ : 3.25/5
ఓదెల 2 రివ్యూ: తమన్నా అఘోరిగా మెరిసిన హారర్ థ్రిల్లర్!
తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ‘ఓదెల 2’, దర్శకుడు అశోక్ తేజ విజన్‌లో, సంపత్ నంది సూపర్విజన్‌లో రూపుదిద్దుకుంది. కొత్త నిర్మాత మధు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే “ఓదెల రైల్వే స్టేషన్”కు సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రమోషన్స్ వల్ల భారీ హైప్ క్రియేట్ చేసుకుంది. థ్రిల్లింగ్ కాన్సెప్ట్, తమన్నా లుక్, ఇంటెన్స్ విజువల్స్ తో ఎట్టకేలకు, సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను కట్టిపడేసిందో ఇప్పుడు చూద్దాం.

కథ సంగతేంటి?

‘ఓదెల రైల్వే స్టేషన్’ కథ ముగిసిన చోటే ఈ సినిమా ప్రారంభమవుతుంది. కొత్తగా పెళ్లైన ఆడవాళ్లను శోభనం రోజున రేప్ చేసి చంపే తిరుపతి (వశిష్ట సింహ)ను భార్య రాధ (హెబ్బా పటేల్) హత్య చేస్తుంది. ఊరి పెద్దలు తిరుపతికి “సమాధి బంధం” అనే శిక్ష విధిస్తారు. కానీ, ఈ శిక్ష తిరుపతిని భయానక ఆత్మగా మారుస్తుంది. అప్పటి నుంచే ఊరిలో పెళ్లయిన మహిళలపై మళ్లీ అదే దుర్మార్గమైన ఘటనలు జరుగుతుంటాయి. ఈ ఘటనల వెనుక తిరుపతి ఆత్మ ఉందని ఊరిలో తాయత్తులు వేసే అల్లా భక్షు (మురళీ శర్మ) చెబుతాడు. దీనితో ఊరి ప్రజలు రాధకు మళ్లీ సహాయం కోసం మొగ్గు చూపుతారు. కానీ, రాధ తాను కాదు… తన అక్క భైరవి (తమన్నా) అనే అఘోరీ తప్ప ఈ సమస్యను ఇంకెవరూ పరిష్కరించలేరని చెప్పడంతో ఊరి ప్రజలు భైరవి ఊరిలోకి తీసుకొస్తారు. ఆ తరువాత తిరుపతి ఆత్మ బారి నుంచి భైరవి ఊరిని ఎలా కాపాడింది? చివరికి ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానం తెరపై చూడాల్సిందే!

Also Read :  Baahubali Re-release : బాహుబలి రీ-రిలీజ్, శోభు యార్లగడ్డ అఫిసియల్ అనౌన్స్మెంట్..

విశ్లేషణ:

సినిమా కథ ఇప్పటికే ప్రమోషన్స్ ద్వారా భాగంగా తెలిసినదే అయినా, దాన్ని తెరపై ఎంగేజింగ్‌గా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ మాత్రం కథను నెమ్మదిగా బిల్డ్ చేసుకునేలా సాగుతుంది. అయితే, తమన్నా ఎంట్రీతో సినిమా ఆసక్తిగా మారిపోతుంది. ఇంటర్వెల్ బ్లాక్ గట్టి పంచ్ ఇస్తుంది. సెకండ్ హాఫ్‌లో తిరుపతి ఆత్మతో భైరవి పోరాటం కొన్ని చోట్ల రొటీన్‌గా అనిపించినా… క్లైమాక్స్ మాత్రం బాగానే పేలుతుంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. కొన్ని సీన్స్ అయితే నిజంగానే గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.

Also Read :  పాక్ క్రికెటర్లకు భారత్ గట్టి షాక్: యూట్యూబ్‌లో నిషేధం

నటీనటుల ప్రదర్శన:

తమన్నా: భైరవి పాత్రలో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ & డిఫరెంట్ రోల్ చేసినట్టే చెప్పాలి. గ్లామర్ ముసుగుతీసేసి రా ఫెర్ఫామెన్స్ ఇచ్చింది.

వశిష్ట సింహ: తిరుపతి ఆత్మగా ఇంటెన్స్ ప్రెజెన్స్, భయపెట్టే నటన పర్ఫెక్ట్.

హెబ్బా పటేల్: పాత్ర పరిమితంగానే ఉంది.

మిగిలిన వారు తమ పాత్రలతో జస్టిస్ చేశారు.

టెక్నికల్ టీమ్:

సంపత్ నంది డైలాగ్స్ కొన్నిచోట్ల బాగా బలంగా ఉన్నాయి.

అజనీష్ లోకనాథ్ సంగీతం & BGM – సినిమా విజయం వెనక అసలైన హీరో. థ్రిల్ బూస్ట్ చేయడంలో అతని స్కోర్ కీలకంగా నిలిచింది.

గ్రాఫిక్స్ పరంగా కూడా సినిమా స్టాండర్డ్‌కి తగ్గట్టే ఉంది. ముఖ్యంగా శివుడు – నంది సీక్వెన్స్ ఆకట్టుకుంటాయి.

సినిమాటోగ్రఫీ: విజువల్స్ హైవాల్యూలో కనిపించాయి.

ఫైనల్ పాయింట్ :
‘ఓదెల 2’ ఒక ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్. హారర్‌ను రా & రస్టిక్ టచ్‌తో చూపించిన ఈ సినిమా, సున్నితమైన మనస్కులు చూసే సినిమా కాదేమో… కానీ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ కోసం వెతుకుతున్న వారికి మాత్రం గూస్‌బంప్స్ గ్యారంటీ!
తెలుగుమిర్చి రేటింగ్ : 3.25/5