Site icon TeluguMirchi.com

రివ్యూ : సస్పెన్సు గా సాగే ‘నిశ్శబ్దం’

స్టార్ కాస్ట్ : అనుష్క , మాధవన్ తదితరులు..
దర్శకత్వం : హేమంత్ మధుకర్
నిర్మాతలు: కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ
మ్యూజిక్ : గోపీ సుంద‌ర్‌
విడుదల తేది : అక్టోబర్ 02 , 2020
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

భాగమతి తర్వాత స్వీటీ అనుష్క హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘సైలెన్స్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో నటించింది. తెలుగులో ‘నిశ్శబ్దం’ పేరిట గాంధీ జయంతి సందర్భాంగా ఈరోజు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. తెలుగు, తమిళ్ మరియు మళయాళ భాషల్లో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

సాక్షి (అనుష్క) చెవిటి, మూగ అమ్మాయి. కానీ, మంచి పెయింటర్. ఆంటొని (మాధవన్) సెలబ్రిటీ మ్యుజీషియన్.. మిలియనీర్. వీరిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. ఎంగేజ్‌మెంట్ తరవాత వీరిద్దరూ కలిసి సరదాగా ట్రిప్‌కు వెళ్తారు. 1972లో యు.ఎస్‌లోని సీటెల్ ప్రాంతానికి 70 కి.మీ దూరంలోని వుడ్ హౌస్‌లో ఉండే భార్యాభ‌ర్త‌లు పీట‌ర్, మెలిసాల‌ను ఎవ‌రో చంపేస్తారు. ఆ వుడ్ హౌస్ ఓన‌ర్ జోసెస్ ఆత్మే వారిని హ‌త్య చేసి ఉంటుంద‌ని అంద‌రూ భావించారు. కేసును పోలీసులు ఛేదించ‌లేక మిస్ట‌రీ కేసుగా వ‌దిలేస్తారు. త‌ర్వాత ఆ విల్లాను అంద‌రూ హాంటెడ్ హౌస్‌గా భావిస్తారు. దాంతో ఆ విల్లాను ఎవ‌రు కొన‌రు. 2019లో కొలంబియాకు చెందిన బిజినెస్‌మేన్ మార్టిన్ ఎస్క‌వాడో ఆ విల్లాను ధైర్యం చేసి కొంటాడు. కానీ ఆ ఇంట్లో ఉండ‌టానికి అంద‌రూ భ‌య‌ప‌డుతుంటారు. ఎవ‌రూ రారు. అలాంటి పాత ఇంటికి సాక్షి , ఆంటొని వెళ్తారు.

ఆ ఇంట్లోకి వెళ్లిన కొద్దిసేప‌టికి ఆంటోనీ చనిపోతాడు. మరి ఆంటోనీ ని ఎవరు చంపుతారు..సాక్షి ఎలా బయటపడుతుంది. అసలు ఆ ఇంట్లో ఏముంది..? అనేది సినిమా కథ.

ప్లస్ :

మైనస్ :

సాంకేతిక విభాగం :

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

చెవిటి, మూగ అమ్మాయిగా అనుష్క అద్భుతంగా నటించింది. మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్‌సన్.. ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. కాకపోతే, ఏ ఒక్క పాత్ర మనపై పెద్దగా ఇంపాక్ట్ చూపించదు. ప్రధానంగా సాక్షి, ఆంటొని పాత్రలే కనిపిస్తాయి. ఆఖరికి హాలీవుడ్ యాక్టర్ మైఖేల్ మ్యాడ్‌సన్ పాత్ర సైతం పెద్దగా ఆకట్టుకోదు.

ఫైనల్ :

సస్పెన్సు గా సాగే నిశ్శబ్దం

Exit mobile version