స్టార్ కాస్ట్ : నాని,సుధీర్ బాబు,నివేదా థామస్,అదితిరావు హైదరి తదితరులు..
దర్శకత్వం : మోహనకృష్ణ ఇంద్రగంటి
నిర్మాతలు: దిల్ రాజు
మ్యూజిక్ : అమిత్
ఓటిటి విడుదల తేది : సెప్టెంబర్ 05 , 2020
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5
నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం వి
. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ డైరెక్షన్లో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ అమెజాన్ స్ట్రీమింగ్ లో ఈరోజు (సెప్టెంబర్ 05) విడుదల అయ్యింది. ఇప్పటి వరకు ఏ పెద్ద తెలుగు సినిమా కూడా ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ కాకపోవడం..నాని సినిమాతోనే ఓ పెద్ద సినిమా రిలీజ్ అవుతుండడం తో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు , సినీ ప్రముఖులు , ప్రేక్షకులు ఆసక్తి కనపరుస్తున్నారు.
అలాగే నానికి ఈ సినిమా 25 వ చిత్రం కావడం..అందులోనూ తొలి సారి విలన్ ఛాయలున్న పాత్రలో నటించడంతో ఈ మూవీ ఫై భారీ అంచనాలు మొదలయ్యాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా ఉందా..? లేదా..? అనేది ఇప్పుడు చూద్దాం.
కథ :
ఆదిత్య (సుధీర్ బాబు) ఓ సూపర్ కాప్. ఎలాంటి కేసైనా ఈజీ గా సెటిల్ చేస్తూ అవార్డ్స్ , రివార్డ్స్ అందుకుంటాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో వరుసగా మర్డర్లు జరుగుతుంటాయి. హంతకుడు ఓ క్లూ కూడా ఆదిత్య వదులుతుంటాడు. ఆ క్లూల ఆధారంగా హంతకుడ్ని పట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా – ఫలితం ఉండదు. ఆదిత్య తన ఇన్విస్టిగేషన్ మరింత స్పీడు పెంచుతాడు. హంతుకుడు చెప్పిన ఓ పొడుపు కథను ఛేదించి ముంబై వెళతాడు. ఆదిత్య అక్కడకి చేరుకునేలోపు ముంబైలో కె.కె అనే ఓ డాన్ ని దారుణంగా చంపేస్తాడు. కిల్లర్ ను పట్టుకుందామని విశ్వ ప్రయత్నం చేసినా తృటిలో తప్పించుకుంటాడు. దాంతో డిపార్టమెంట్ నుంచి ఆదిత్యకు ఒత్తిడి పెరుగుతుంది. మరి ఆ హంతకుడు ఎవరు? అసలు ఆ హంతుకుడు హత్యలు చేయటానికి కారణం ఏంటి..? చివరకు ఆదిత్య, సదరు హంతుకుడిని పట్టుకోగలిగాడా? అనేది తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
ప్లస్ :
- నాని, సుధీర్ బాబుల నటన
- ఫస్ట్ హాఫ్
- కథ
- అమిత్ త్రివేది మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
- సెకండాఫ్‌లో కొన్ని లాగ్ సీన్స్
- సస్పెన్స్
- క్లైమాక్స్
నటీనటులు నటన :
నాని ఈ సినిమాలో కూడా తన సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. స్టైలిష్ కిల్లర్‌గా నాని నటన అద్భుతం అని చెప్పాలి. అటు ఎమోషనల్ సీన్స్.. ఇటు యాక్షన్ సీన్స్‌లో చక్కటి ఈజ్‌ను చూపించాడు. డీసీపీ ఆదిత్యగా సుధీర్ బాబు సరిగ్గా సరిపోయాడు. సినిమా మొదటిభాగంలో వచ్చే కొన్ని సన్నివేశాలు ఎంతో ఎంగేజింగ్‌గా ఉన్నాయి.
హీరోయిన్ల విషయానికి వస్తే.. నివేదా, అదితి రావు హైదరీ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. ఈ సినిమాలో అదితి పాత్ర నిడివి తక్కువే.. అయినా ఆ పాత్రలో ఒదిగిపోయి నటించింది. అటు నివేదా మాత్రం క్రైమ్ నవలా రచయిత్రీగా చక్కటి ప్రదర్శన కనబరిచింది. ఇక మిగిలిన నటీనటులు అందరూ కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక వర్గం :
- అమిత్ త్రివేది మ్యూజిక్ బాగుంది. నేపథ్య సంగీతం థమన్ సమకూర్చారు. థమన్ తన స్టైల్లోనే బీజీఎం చాలా బాగా ఇచ్చారు. కానీ, థీమ్ మ్యూజిక్ మాత్రం నిరాశపరిచింది. ఇది ‘రాక్షసుడు’ థీమ్ మ్యూజిక్‌ను గుర్తుచేస్తుంది. సినిమాలో మూడు, నాలుగు చోట్ల ‘రాక్షసుడు’ బీజీఎం మన మైండ్‌లోకి వచ్చేస్తుంది.
- పి.జి.విందా సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ విలువల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు.
ఫైనల్ :
డైరెక్టర్ మోహనకృష్ణ రాసుకున్న కథ బాగుంది. ఆ కథలో ఆయన సృష్టించిన కిల్లర్, పోలీస్ ఆఫీసర్ పాత్రలు కూడా బలంగా ఉన్నాయి. కానీ, కథనం బలహీనంగా ఉంది. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్‌కు స్క్రీన్‌ప్లే ప్రధాన బలం. కానీ స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకోలేకపోయారు. ఫస్టాఫ్ బాగుంది. సెకండాఫ్ కాస్త స్లో అయ్యింది. ఫస్టాఫ్‌లో సస్పెన్స్‌ను మెయింటైన్ చేసిన దర్శకుడు.. సెకండాఫ్‌లో దాన్ని రివీల్ చేసిన తరవాత నుంచి సినిమా అంత ఆసక్తిగా సాగలేదు. క్లైమాక్స్ సైతం పెద్దగా లేదు. ఓవరాల్ గా వన్ టైం వాచ్ మూవీ.