రివ్యూ : ‘నగరం ‘- ఆకట్టుకునే థ్రిల్ల‌ర్‌.

టైటిల్ : ‘నగరం’ (2017)
స్టార్ కాస్ట్ : సందీప్ కిషన్, రెజీనా, శ్రీ, మధుసూదన్ తదితరులు.
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : లోకేష్ కనగరాజ్
నిర్మాతలు: పొటెన్షియల్ స్టూడియోస్
మ్యూజిక్ :జావేద్ రియాజ్
విడుదల తేది : మార్చి 10 , 2017
తెలుగు మిర్చి రేటింగ్ :3/5

రివ్యూ : ‘నగరం ‘- ఆకట్టుకునే థ్రిల్ల‌ర్‌.

nagaram-review

వరుస ప్లాప్స్ తో సతమవుతున్న సందీప్ కిషన్, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసి తో క‌్రైం & థ్రిల్ల‌ర్‌ కథ ను ఎంచుకున్నాడు. సందీప్ కిషన్, రెజీనా, శ్రీ ప్రధాన పాత్రల్లో లోకేష్ కనగరాజ్ దర్శకత్వం లో తెలుగు & తమిళం లో తెరకెక్కిన మూవీ ‘నగరం’. తమిళం లో మానగరం పేరుతో రిలీజ్ అయ్యింది. మరి సందీప్ కు ఈ నగరం ఎంత హిట్ ను ఇచ్చిందో..అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.

కథ :

శ్రీ, త‌న ప్రేమ కోసం మంచి ఉద్యోగాన్ని సంపాదించాల‌నుకుంటాడు. అందుకోసం రెజీనా పనిచేసే కంపెనీ కి ఇంటర్వ్యూ కోసం వెళ్ళతాడు. కానీ అతడి చదవు కు తగ్గ జాబ్ అక్కడ లేకపోవడం తో అతడి బాధలు , రెజీనా కు చెప్పుకొని వెనుకకు వెళ్ళబోతున్న క్రమం లో రెజీనా అతడి భాద ను , ప్రేమ ను తెలుసుకొని అతడికి జాబ్ ఇప్పిస్తుంది. కాకపోతే ఆ జాబ్ లో జాయిన్ కావడానికి ముందు అతడి సర్టిఫికెట్లు కంపెనీ లో సబ్మిట్ చేయాలనీ చెపుతుంది. అలాగే అని శ్రీ అక్కడి నుండి తన రూమ్ కు వస్తాడు. అప్పటికే రెజీనా ను ప్రేమిస్తున్నాని సందీప్ వెంటపడుతుంటాడు. సందీప్ తో పాటు మరో వ్యక్తి రెజీనా ను ప్రేమిస్తున్నాని రోజు ఆమె వెంట పడుతుంటాడు. ఈ క్రమంలో సందీప్ తనకు అడ్డు తగులుతున్నాడని అతడి చంపేయాలని అనుకుంటాడు.

ఇంతలో సందీప్ అనుకోని శ్రీ ఫై దాడి చేయబోతారు. అక్కడికి వచ్చిన సందీప్ వారితో గొడవ పడతాడు. ఆ గొడవలో శ్రీ సర్టిఫికెట్లు పోగొట్టుకుంటాడు. ఇదే స‌మ‌యంలో పోకిరి రెజీనాపై యాసిడ్ పోస్తాన‌ని చెప్ప‌డంతో సందీప్ అత‌నిపై యాసిడ్ పోస్తాడు. ఇది ఇలా ఉండగా ఆ నగరానికి మాఫియా డాన్ లాంటి పికెపి(మధుసూదన్) కొడుకుని కొందరు దుండగులు కిడ్నాప్ చేస్తారు. ఆ కిడ్నాప్ శ్రీ , సందీప్ , రెజీనా లతో పాటు మరో వ్యక్తి ఫై పడుతుంది. ఇంతకీ ఆ కిడ్నాప్ చేసింది ఎవరు..? కిడ్నాప్ ఈ నలుగురికి సంబంధం ఏంటి..? అనేది అసలు స్టోరీ.

ప్లస్ :

* సినిమా మొదలు నుండి చివరి వరకు సాగే సస్పెన్స్

* స్క్రీన్ ప్లే

మైనస్ :

* ఫస్ట్ హాఫ్

* రెజినా

* స్లో నేరేషన్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

సందీప్ కిషన్ బాధ్యత లేని ఓ మాస్ కుర్రాడి పాత్రలో ఒదిగిపోయాడు. తన లుక్ కూడా చాలా మాసివ్ గా ఉంది. శ్రీ పాత్ర సినిమాకు హైలైట్ గా నిలిచింది. తన అభినయంతో ఆకట్టుకున్నాడు. రెజీనా పాత్ర చిన్నదే అయినా.. ఉన్నంతలో ఆకట్టుకుంది. మధుసూదన్, చార్లే ఎవరి పాత్రల పరిధుల్లో వారు చక్క్గగా నటించారు.

సాంకేతిక విభాగం :

సెల్వకుమార్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. క్రైమ్ సన్నివేశాల్ని చాలా రియలిస్టిక్ గా చూపించాడు. పొటెన్షియల్ స్టూడియోస్ వారి నిర్మాణ విలువలు ఆకట్టుకున్నాయి. కథ ను బట్టి తక్కువ బడ్జెట్ లో సినిమాని తెరకెక్కించారు. జావేద్ రియాజ్ కథ కు తగిన విధంగా మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ అందించాడు.

నాలుగు కథల్ని విడి విడిగా చూపిస్తూ చివర్లో మరో ఎలిమెంట్తో ఈ కథల్ని జత చేస్తూ ప్రేక్షకులు ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వకుండా తన ఎడిటింగ్తో మ్యాజిక్ చేశాడు ఫిలోమిన్ రాజ్. ఇక డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గురించి చెప్పాలంటే రెగ్యులర్గా వచ్చే సినిమాలకు భిన్నంగా తన సినిమా వుండాలన్న ఆలోచనతో ఒక కొత్త కథకు శ్రీకారం చుట్టాడు. దానికి కొత్త తరహాలో స్క్రీన్ప్లే రాసుకున్నాడు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కథలో, కథనంలో, క్యారెక్టర్ల మధ్య వుండే వేరియేషన్స్లో, ఎమోషన్స్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి విషయానికి క్లారిటీ ఇస్తూ సినిమాని నడిపించాడు.

చివరిగా :

గత కొంతకాలంగా సరైన హిట్ లేకుండా పోతున్న సందీప్ కు ఈ చిత్రం మంచి జోష్ ని ఇస్తుందనడం ఎలాంటి సందేహం లేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. కొత్తగా ఆలోచించే వారికి ఈ మూవీ త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. ఓవరాల్ గా ‘నగరం ‘- ఆకట్టుకునే థ్రిల్ల‌ర్‌.