డైరెక్టర్ : శ్రీ నారాయణ
నటీనటులు : సోనాక్షి, అభి, రామరాజు
మ్యూజిక్ డైరెక్టర్ : సన్నీ మాలిక్
పాటలు : లక్ష్మణ్
కెమెరామెన్ : మహి
ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్
ప్రొడ్యూసర్స్ : మహీందర్ సింగ్, శ్రీ నారాయణ, శైలజ తాటిచెర్ల
శ్రీ నారాయణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ రోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మరి ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో ఇప్పుడు తెలుసుకుందాం..
కథ : గిరిజన నేపథ్యంలో సాగే ఈ కథ స్వచ్ఛమైన ప్రేమ కథగా డైరెక్టర్ మలిచాడు.. ఎమ్మెల్యే శర్మ తన కూతురు ఒక గిరిజన వ్యక్తిని ప్రేమించింది అని తెలిసి.. ఎలాగైనా ఆ ప్రేమను చెడగొట్టాలని గిరిజన ప్రాంతానికి వెళ్లగా.. అక్కడ జరిగిన పరిణామాల మధ్య ఈయన కూతురు ప్రేమను ఒప్పుకున్నాడా? లేదా? అనేది మిగిలిన కథ..
విశ్లేషణ :
ఈ సినిమాకు కథ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.. అందమైన ప్రకృతి మధ్య అడవిలోకి వెళ్లి వారి పాత్రలను చూస్తున్న ఫీలింగ్ ప్రేక్షకులకు కల్గుతుంది. డైరెక్టర్ శ్రీ నారాయణ రాసుకున్న సున్నితమైన ప్రేమ కథ ఈ సినిమాకు ప్రధాన బలం.. ఆయన ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ ను బాగా పండించ గలిగాడు.. ప్రేక్షకులు చూస్తున్నంత సేపు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు.
ఆయన ఈ సినిమాలోని పాత్రలను మలిచిన తీరు అద్భుతంగా ఉంది.. ఈయన టేకింగ్ వల్ల ఈ సినిమా సహజంగా అనిపిస్తుంది. ప్రతీ పాత్ర సహజంగా ఎమోషనల్ గా ఆకట్టు కుంటుంది.. ఇందులో కుల, మాత, జాతి, వర్గం అనే సున్నితమైన అంశాలను కూడా బాగా చూపించాడు..
అన్ని రకాల సాంకేతిక వర్గాలు ఈ సినిమాకు బాగా పని చేసాయి.. శ్రీ నారాయణ రచయితగా ఈ సినిమాకు పూర్తి న్యాయం చేసాడు.. సినిమాటోగ్రఫి బాగుంది.. సంగీతం అద్భుతంగా ఉంది.. సగటు ప్రేక్షకులను అలరించే అన్ని విషయాలు ఉన్నాయి..
తీర్పు : ఈ సినిమా ఎమోషనల్ ప్రేమ కథతో సున్నితమైన పాత్రలతో చాలా బాగా మెప్పిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. మంచి ఫీల్ కలిగిన సినిమాను కావాలని కోరుకునే వారికీ ఇది మంచి సినిమా అనే చెప్పాలి.
రేటింగ్ : 3/5