టైటిల్ : లక్కున్నోడు (2017)
స్టార్ కాస్ట్ : మంచు విష్ణు, హన్సిక, రాజేంద్రప్రసాద్, జయప్రకాష్, పోసాని తదితరులు.
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : రాజ్ కిరణ్
నిర్మాతలు: ఎంవివి సినిమా
మ్యూజిక్ : అచ్చు, ప్రవీణ్ లక్కరాజు
విడుదల తేది : జనవరి 26, 2017
తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5
రివ్యూ : లక్కున్నోడు – టైటిల్ కు మాత్రమే
వెర్సటైల్ యాక్టర్ మంచు విష్ణు, బబ్లీ బ్యూటీ హన్సిక మోత్వాని జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ `లక్కున్నోడు`. ఎం.వి.వి.సినిమా బ్యానర్‌పై ఎం.వి.సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది..
‘ఈడో రకం ఆడో రకం’ సక్సెస్ అందుకున్న విష్ణు , ‘గీతాంజలి’తో హారర్ కామెడీ హిట్ ఇచ్చిన రాజ్ కిరణ్ వీరిద్దరి కాంబినేషన్ లో ఈ మూవీ రావడం తో మంచు అభిమానులతోనే కాక సినీ ప్రేక్షకులకు సైతం ఈ మూవీ ఫై అంచనాలు ఏర్పడ్డాయి..మరి వారి అంచనాలకు లక్కున్నోడు ఏమాత్రం అందుకున్నాడో ఇప్పుడు చూద్దాం..
కథ :
లక్కీ(విష్ణు) పేరుకు మాత్రం లక్కీ, కానీ ఇతడు పుట్టినప్పటి నుండి దురదృష్టం నీడలా వెంటాడుతుంది. ఇలాంటి అతడికి పద్మావతి(హన్సిక) కనిపిస్తుంది..మొదటి చూపులోనే ఆమెను ప్రేమించడం మొదలు పెడుతాడు..ఇదే సమయం లో లక్కీ చెల్లెలికి నిశ్చితార్థం అవుతుంది. కట్నం డబ్బు రూ.25లక్షలు ఇవ్వడానికి లక్కీ వెళ్తుండగా అతడి బ్యాగ్ ఎక్కడో మిస్ అవుతుంది. దీంతో తండ్రి చేత చివాట్లు తింటాడు..ఇక బ్రతకడం వెస్ట్ ఇక చనిపోతానని చెప్పి ఆత్మ హత్య చేసుకుంటున్న సమయంలో ఓ వ్యక్తి వచ్చి బ్యాగ్ ఇస్తాడు. దాన్ని ఒక్కరోజు దగ్గరుంచుకుంటే కోటి రూపాయలు ఇస్తానని చెబుతాడు. ఇక ఈ బ్యాగ్ తో తనకు అదృష్టం తలుపుతట్టిందని అనుకుంటాడు..ఆ తరువాత ఏం జరుగుతుంది..? అసలు బ్యాగ్ లో ఏముంది..? లక్కీ నిజంగానే లక్కీ అయ్యాడా..? పద్మావతి – లక్కీ ని ప్రేమ ఏమవుతుంది..? అనేవి మీరు తెర ఫై చూడాల్సిందే..
ప్లస్ :
* ఫస్ట్ హాఫ్
* కామెడీ
మైనస్ :
* స్టోరీ
* బోరింగ్ సన్నివేశాలు
* సెకండ్ హాఫ్
* మ్యూజిక్
నటీనటుల పెర్పామెన్స్ :
మంచు విష్ణు కాస్త ఈ మూవీ లో తన నటనలో మార్పు కనిపించింది. తనదయిన కామెడీ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు..మోహన్‌బాబును ఇమిటేట్ చేస్తూ మంచు ఫ్యామిలీ అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇక ఫైట్స్ లలో ఒకే..ఇక హన్సిక విషయానికి వస్తే కథలో చెప్పుకోదగ్గ రోల్ ఏమి కాకపోయినా గ్లామర్ కు మాత్రమే పనికొచ్చింది. వెన్నెల కిషోర్, సత్యం రాజేశ్, ప్రభాస్ శ్రీను కామెడీ పర్వాలేదనిపించిది. తనికెళ్లభరణి, పోసాని కృష్ణమురళి మిగతా నటి నటులు వారి వారి పాత్రల మేరకు బాగానే నటించారు.
సాంకేతిక విభాగం :
ముందుగా మ్యూజిక్ విషయానికి వస్తే సినిమాకు సంగీతం పెద్దగా ఉపయోగపడలేదని చెప్పవచ్చు.. అచ్చు, ప్రవీణ్ లక్కరాజు ఇద్దరు కూడా తమ సంగీతం తో ఆకట్టుకోలేకపోయారు. డైమండ్ రత్నబాబు డైలాగ్స్ అక్కడక్కడా ఏదో ఆలా అనిపించాయి..విష్ణు చేత ఎక్కవగా మ్యావ్ మ్యావ్ అంటూ విసుగు తెప్పించాడు. ‘గీతాంజలి ‘ తో ప్రేక్షకులను మెప్పించిన రాజ్ కిరణ్ , ఈ మూవీ లో ఆస్థాయి గా మెప్పించలేక పోయాడు. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించినా , సెకండ్ హాఫ్ ఆకట్టుకోవడం లో విఫలం అయ్యాడు. ఎంవివి సినిమా సంస్థ నిర్మాణాలు ఆకట్టుకున్నాయి.
చివరిగా :
‘ఈడో రకం ఆడో రకం’ తో వరుస ప్లాప్స్ నుండి బయట పడినప్పటికీ లక్కున్నోడు తో మాత్రం మళ్లీ మొదటికే వచ్చాడు..కలిసొచ్చే హన్సిక ను హీరోయిన్ గా పెట్టుకున్నప్పటికీ ఈసారి కలిసిరాలేదు..మోహన్ బాబు ను కూడా రంగం లోకి దించినప్పటికీ పెద్దగా యూస్ కాలేకపోయాడు. ఓవరాల్ గా లక్కున్నోడికి..లాక్కు లేకుండాపోయింది..