Site icon TeluguMirchi.com

Kalki 2898 AD Review | కల్కి2898 AD రివ్యూ

Kalki 2898 AD Review

TeluguMirchi Rating : 3.5/5
ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898 AD నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో క‌మ‌ల్‌హాస‌న్‌, అమితాబ్‌బ‌చ్చ‌న్‌, దీపికా పదుకొణె లాంటి స్టార్స్‌ కీలక పాత్రలు పోషించడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. సైన్స్ ఫిక్షన్ కథకు మహాభారతాన్ని జోడించి కొత్త కథను ప్రేక్షకుల ముందు ఉంచాడు దర్శకుడు నాగ్ అశ్విన్ . ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్).. కురుక్షేత్ర యుద్ధంలో నా అనుకున్నవారందరినీ పోగొట్టుకుంటాడు. దీంతో తన వంశాన్ని నాశనం చేసిన పాండవుల వంశం లేకుండా చేయాలని.. గర్భంతో ఉన్న అభిమన్యుడి భార్య అయిన ఉత్తర (మాళవిక నాయర్) పై కడుపులో బ్రహ్మాస్త్రను సంధిస్తాడు. దీంతో ఆ శిశువు మరణిస్తాడు. ఇక ఇది తెలుసుకున్న కృష్ణుడు.. అశ్వద్ధామకు శాపం విధిస్తాడు. అశ్వద్ధామ కృష్ణుడు ని శాప విమోచనము కోరగా అప్పుడు కలియుగంలో పాపాలు ఎక్కువ అయ్యినప్పుడు మళ్లీ నేను పుడతాను. అప్పుడు కూడా కల్కి నన్ను చంపడానికి చూస్తాడు. ఆ సమయంలో ఆ తల్లి కడుపులో ఉన్న నన్ను నువ్వే కాపాడాలి.. అప్పుడే నీకు శాపవిమోచనం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు కృష్ణుడు.

కురుక్షేత్రం అయిపోయాక 6 వేల సంవత్సరాలు తరవాత ప్రపంచం మొత్తం పాపాలతో నిండిపోతుంది. ముఖ్యంగా కాశీ పట్టణం మొత్తం తిండి లేక, నీళ్లు లేక అల్లాడిపోతూ ఉంటుంది. 2898 AD లో ప్రజలు దిక్కులేనివారుగా తయారవుతారు. ఇక వారిని తన గుప్పిట్లో పెట్టుకొని నడిపిస్తూ ఉంటారు సుప్రీం యాస్మిన్ (కమల్ హాసన్). కాంప్లెక్స్ లో ప్రాజెక్ట్ కె పేరుతో ఒక ప్రయోగం చేస్తూ ఉంటాడు. దానికి అక్కడ ఉన్న ఆడవారి గర్భంలో ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. అది ఇంజెక్ట్ చేసిన అమ్మాయిలు 100 రోజులు కూడా దాన్ని మోయలేకపోతారు. కానీ, సుమతి (దీపికా పదుకొనే) మాత్రం 150 రోజులు దాన్ని మోస్తుంది. ఇది తెల్సిన యాస్మిన్ మనుషులు ఆమెను పట్టుకోవాలని చూస్తుండగా.. సుమతి కాంప్లెక్స్ నుంచి పారిపోయి శంభలలో దాక్కుంటుంది. సుమతిని వెతికి పట్టుకున్నవారికి ఊహించనంత యూనిట్స్ ఇస్తామని ఆశ చూపుతారు. ఇక ఆ విషయం తెలుసుకున్న భైరవ (ప్రభాస్) ఆమె కోసం శంభల వెళ్తాడు. సుమతి కడుపున పుట్టబోయే బిడ్డనే భగవంతుడు అని తెలుసుకున్నా అశ్వద్ధామ.. ఆమెకు రక్షగా నిలబడతాడు. మరి చివరికి ఎవరు గెలిచారు.. ? భైరవ ఎవరు.. ? అశ్వద్ధామతో యుద్ధం చేసే శక్తి అతడికి ఎలా వచ్చింది..? సుమతి కడుపులో బిడ్డను యాస్మిన్ ఎందుకు చంపాలనుకుంటాడు.. ? అశ్వద్ధామ శాప విమోచనం జరిగిందా.. ? అనేది తెలియాలంటే కల్కి 2898 AD సినిమాను తెరపై చూడాల్సిందే.

Exit mobile version