రివ్యూ : కళావతి – భయపెట్టలేకపోయింది…

టైటిల్ : కళావతి (2016)
స్టార్ కాస్ట్ : సిద్ధార్థ్ , హన్సిక , త్రిష
డైరెక్టర్ : సి. సుందర్
ప్రొడ్యూసర్స్ : గుడ్ సినిమా గ్రూప్
మ్యూజిక్ : హిప్ హాప్ తమిజ్హా
విడుదల తేది : 29 జనవరి 2016
తెలుగు మిర్చి రేటింగ్ : 2.25/5

రివ్యూ : : కళావతి – భయపెట్టలేకపోయింది..

Kalavathi-Telugu-Review

ఈ మద్య తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా హర్రర్ మూవీస్ కి బ్రహ్మ రధం పడుతున్నారు..మొన్నటి ప్రేమకథ చిత్రం నుండి నిన్నటి రాజు గారి గది వరకు దెయ్యం నేపద్యం లో వచ్చి సూపర్ హిట్ సాదించాయి..ఇక గతఏడాది ‘చంద్రకళ’ గా వచ్చి ఎంతటి ఘన విజయం సాదించిందో అందరికి తెలిసిందే…తాజాగా ‘చంద్రకళ’ కు సీక్వెల్ గా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘కళావతి’..సిద్దార్థ్ , త్రిష , హన్సిక , పూనం బజ్వా జంటగా నటించిన ఈ చిత్రానికి సుందర్.సి దర్శకత్వం వహించాడు..గుడ్ సినిమా గ్రూప్ వారు తెలుగు లో రిలీజ్ చేయగా, ఆరణ్మనై 2 గా తమిళ్ లో రిలీజ్ కాబోతుంది…మరి తెలుగు ప్రేక్షకులను ఎంతగా భయపెట్టిందో ఇప్పుడు చూద్దాం…

కథ :

మురళి (సిద్దార్థ్), అనిత (త్రిష) ఎంగేజ్మెంట్ కావడం తో కొన్ని రోజులు జాలిగా ఎంజాయ్ చేద్దామని విదేశాలకు వెళ్ళతారు..ఈ లోపు మురళి తండ్రి రాధరవి , ఊరిలో ఉండే పురాతన అమ్మవారి గుడిని బాగుచేసి , అమ్మవారి విగ్రహ్హన్ని పున ప్రతిష్ట చేయాలనీ పనులు స్టార్ట్ చేస్తాడు..ఈ లోపు అదే ఊరిలో ఉండే మంత్రగాళ్ళు అమ్మవారి పున నిర్మాణం ఆయెలోపు ఎలాగైన దుష్ట శక్తులను అవగించుకోవాలని ప్రయత్నాలు మొదలు పెడతారు..ఆ తరుణం లో ఓ దెయ్యం ఆత్మ రాధరవి జమిందారి బంగ్లాలోకి చొరబడుతుంది..అప్పుడు ఓ సదవు ఎంత చెప్పిన వినకుండా జమిందారి బంగ్లాలోకి వెళ్ళతాడు..అదే రాత్రి ఆ దెయ్యం జమిందారిని కోమాలోకి పంపుతుంది..

దీంతో విదేశాల్లో ఉన్న మురళి వెంటనే ఇండియా కు వస్తాడు..అప్పటికే ఆ బంగ్లా లో ఆత్మ ఉందని తెలుసుకొని , త్రిష అన్నయ్య సుందర్ .సి సహాయం తీసుకుంటాడు..అప్పుడు ఆ ఆత్మ ఎవరో సుందర్ తెలుసుకుంటాడు..ఈ లోపు ఆ ఆత్మ త్రిష ను ఆవహిస్తుంది..అలా ఆవహించిన ఆత్మ ఎలా బయటపడుతుంది..? ఇంతకి ఆ ఆత్మ ఎవరు..? హన్సిక కు , మురళి కి సంబందం ఏంటి..? అనేవి మీరు తెరఫై చూడాల్సిందే..

ప్లస్ :

త్రిష గ్లామర్
సుందర్ .సి నటన
అక్కడక్కడ వచ్చే భయానక సన్నివేశాలు

మైనస్ :

రొటీన్ స్టొరీ
క్లైమాక్స్
కామెడీ
ఫోటోగ్రఫీ

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

సిద్దార్థ్ , త్రిష , హన్సిక , పూనం బజ్వా వంటి నాల్గురు స్టార్ నటినటులు ఉన్న కానీ ఎవరు పెద్దగా చెప్పుకునే అంతగా నటించలేకపోయారు..ముఖ్యంగా సిద్దార్థ్ హీరో అని ప్రచారం చేసారు కానీ సినిమా మొత్తం మీద 20 నిమిషాల పాత్ర లేదు..ఉన్నంత సేపు భయపడుతూ ఉండడం తప్ప ఏం చేయలేకపోయాడు..ఇక త్రిష విషయానికి వస్తే పాత్ర కంటే అందాల అరబోతకే ఎక్కువ ప్రాముఖ్యత కలిపించింది..తన మునపటి సినిమాల కంటే ఈ చిత్రం లో కాస్త ఎక్కువగానే ఎక్స్ పోజ్ చేసింది..ఫస్ట్ సాంగ్ లోనే బికినీ తో కనిపించి ప్రేక్షకులను అలరించింది..

‘చంద్రకళ’ చిత్రం తన యాక్టింగ్ తో అందరిని భయపెట్టిన హన్సిక , ఈ చిత్రం లో మాత్రం పెద్దగా భయపెట్టలేకపోయింది..తక్కువ కులం వాడ్ని పెళ్లి చేసుకొని.. అతడి కారణంగా గర్భవతి కావడం , తండ్రి చేతిలో మరణించే సన్నివేశంలో హన్సిక నటన హాస్యాస్పదంగా ఉంది. సుందర్.సి మాత్రం బాగా నటించాడు..ఆత్మ ని ఎలా కనిపెట్టాలో చేసి ట్విస్ట్ లలో తన హావభావాలు ఆకట్టుకున్నాయి..నర్స్ పాత్రలో పూనమ్ భాజ్వా అందాల ప్రదర్శన చేసినప్పటికీ కథ లో పెద్దగా చెప్పుకునే పాత్ర చేయలేకపోయింది. కోవై సరళ కామెడీ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు..

సాంకేతిక విభాగం :

ముఖ్యంగా ఫోటోగ్రఫీ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు..హర్రర్ నేపద్యం లో సాగే కథకు తగిన ఫోటోగ్రఫీ యు.కె.సెంథిల్ కుమార్ అందించలేకపోయాడు. మ్యూజిక్ కూడా తెలుగు అనువాదానికి తగిన రీతిలో ఆకట్టుకోలేకపోయింది.. అమ్మవారి విగ్రహాన్ని , భవంతి సెట్ సెట్ ఫై పెట్టిన శ్రద్ద , విజువల్ , టెక్నికల్ ఫై పెడితే బాగుండు..

చివరిగా :

‘చంద్రకళ’ హిట్ కావడం తో దానిని కాస్త అటు ఇటు చేంజ్ చేసి జనాలముందుకు తీసుకవచ్చారు, తప్ప కథ లో ఏలాంటి కొత్తదనం లేదు…ఫస్ట్ పార్ట్ లో కాస్త భయానక సన్నివేశాలతో భయపెట్టింది కానీ కళావతి లో అలాంటి భయానక సన్నివేశాలు పెద్దగా లేవు..బోర్ కొట్టించే పాటలు , నవ్వించలేకపోయిన కామెడీ తప్ప చిత్రం లో థ్రిల్ గా ఫీల్ అయ్యే సన్నివేశాలు ఒక్కటి కూడా లేదు..కాకపోతే త్రిష గ్లామర్ డోస్ బాగా పెంచింది..బికినీ, తడి చీర అందాలు చూసి యూత్ కాస్త ఎంజాయ్ చేయవచ్చు. మొత్తంగా చూస్తే ‘చంద్రకళ’ చిత్రాన్ని చూసినవారికి ఇది పెద్దగా నచ్చకపోవొచ్చు..హర్రర్ చిత్రాలు చూసే వారు ఒక్కసారి చూడచ్చు…