Site icon TeluguMirchi.com

రివ్యూ : కబాలి – వన్ మ్యాన్ షో

టైటిల్ : క‌బాలి (2016)
స్టార్ కాస్ట్ : రజనీకాంత్ , రాధికా ఆప్టే
డైరెక్టర్ : పా. రంజిత్
ప్రొడ్యూసర్స్ : కలైపులి S. దాస్
మ్యూజిక్ : సంతోష్ నారాయణన్
విడుదల తేది : 22 జూలై, 2016
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

రివ్యూ : క‌బాలి – వన్ మ్యాన్ షో

ఒక హీరోను ఇంతలా ఆదరిస్తారా..! అతడి సినిమా అంటే కోట్ల ఆదాయం వచ్చే ఆఫీసులు కూడా మూసేస్తారా..! రోడ్డు మీదనుండి ఆకాశం వరకు అంత అతడే, ఎటు చూసిన ఏ పేరు విన్న అంత ఆయన జేపమే, ఆ సినిమా గురించే చర్చ ..ఇంతకీ దేనిగురించి చెపుతున్నాడు అనుకుంటున్నారా..? ఇంకా దేనిగురించి చెపుతామండీ అంత కబాలి , రజనీకాంత్ గురించే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు.

పా . రంజిత్ దర్శకత్వంలో సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అర్ధరాత్రి నుండే థియేటర్ల దగ్గర అభిమానుల సందడి మొదలయ్యింది. కేవలం మనదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా కబాలి హవా కనిపించింది. భారీ అంచనాల మధ్య విడుదల అయినా ఈ చిత్రం ఎలా ఉంది..? కథ ఏంటి..? అభిమానులను రజని ఎంత వరకు అలరించాడు..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ:

మలేషియా లో జీవనం సాగించే కబాలి (రజనీకాంత్ ) అక్కడ భారతీయులకు జరిగే అన్యాయాలను చూసి చలించిపోతాడు..ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళ్లి ప్రజలను కాపాడుతూ ఓ మంచి గ్యాంగ్ స్టార్ గా ఎదుగుతాడు. కానీ ఇతడి ఎదుగుదలను చూసి తట్టుకోలేక మరో విలన్ గ్యాంగ్ టోనీలీ (వింగ్‌స్టన్‌ చావ్‌) ఇతడిని చంపాలని ప్లాన్ చేస్తారు. ఈ ఇద్దరి మధ్య పెద్ద వార్ జరుగుతుంది. ఈ వార్ లో కబాలి భార్య కుందనవల్లి (రాధికా ఆప్టే ) కి బుల్లెట్ తగులుతుంది. అదే టైం కు పోలీసులు వచ్చి కబాలి ని అరెస్ట్ చేసి 25 ఏళ్ల పాటు జైలులో ఉంచుతారు. ఆ తర్వాత పోలీసులు మళ్ళీ గ్యాంగ్ వార్ మొదలుపెట్టవద్దని కబాలికి చెప్పి విడుదల చేస్తారు. జైలు నుండి వచ్చిన కబాలి తన భార్య కోసం వెతకడం మొదలు పెడతాడు..అప్పటికి మలేషియా రౌడీ గ్యాంగ్ ల దోపిడీలు మారవు..ఇవన్నీ చూసిన కబాలి మళ్ళీ గ్యాంగ్ స్టార్ గా మారతాడా..? లేక పోలీసులు చెప్పిన మాదిరిగా సైలెంట్ గా ఉంటాడా అనేది మిగతా కథ.

ప్లస్ :

* రజనీకాంత్

* రాధికా ఆప్టే

మైనస్ :

* స్లో నారేషన్
* యదార్థ దృశ్యాలు
* మ్యూజిక్
* డైరెక్షన్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

ప్రధానంగా రజని మరో సారి కబాలి గా తన నట విశ్వ రూపాన్ని చూపించాడు. 65 ఏళ్ల వయసులో కూడా ఎక్కడ కూడా తన స్టయిల్ లో కానీ నటనలో కానీతక్కువ కాకుండా చూసుకున్నాడు. మరోసారి తన మార్క్ స్టయిల్ తో అభిమానులను కట్టిపడేసాడు. అలాగే కబాలి కి భార్య గా రాధికా ఆప్టే నటన బాగుంది. కనిపించింది కొద్దీ సేపు అయినా కానీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో ఫుల్ మార్కులు వేసుకుంది.

ఓ పవర్ ఫుల్ విలన్ రోల్ లో మలేషియా నటుడు విన్స్స్టన్ చావో కరెక్ట్ గా సరిపోయాడు. ఇక లేడీ డాన్ గా ధన్సిక బాగా ఆకట్టుకుంది. నాజర్, కిషోర్ , దినేష్ రవి మొదలగు వారు వారి పాత్రల మేరకు బాగానే చేశారు.

సాంకేతిక విభాగం :

పా. రంజిత్ కు ఇదే మూడో చిత్రం అయినా కానీ పెద్ద డైరెక్టర్ మాదిరి సినిమా ని బాగా హాండెల్ చేసాడు. మైన్ గా రజని లాంటి సూపర్ స్టార్ తో పూర్తి స్థాయి యాక్షన్ చిత్రాన్ని తీయడం లో సక్సెస్ అయినా , అభిమానులను అలరించడం లో కాస్త విఫలం అయ్యాడని చెప్పవచ్చు. అలాగే మ్యూజిక్ విషయానికి వస్తే సంతోష్ నారాయణ్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు.

జి. మురళి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ విషయం లోనే ప్రవీణ్ ఇంకాస్త శ్రద్ద పెట్టాల్సిందే. చాల వరకు సినిమా స్లో నారేషన్ తో సాగింది.

చివరిగా :

ఎన్నో అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకులకు, వారి అంచనాలను అందుకోవడం లో కబాలి కాస్త తడబడింది. కథ లో కొత్తదనం లేకపోవడం కేవలం గ్యాంగ్ స్టార్ తో వార్ నడుస్తుండం, పూర్తి యాక్షన్ తప్ప కామెడీ లేకపోవడం, వీటిన్నిటికి మించి రజని నుండే ప్రేక్షకులు కోరే డైలాగ్స్ లేకపోవడం తో కాస్త నిరాశ చెందారు. దీంతో కబాలి కాస్త ‘వన్ మాన్ షో ‘ గా మిగిలిపోయింది.

Exit mobile version