రివ్యూ : ‘కాలా’- రజనీ మాస్ పెర్ఫామెన్స్..

స్టార్ కాస్ట్ : ర‌జనీకాంత్‌, నానా ప‌టేక‌ర్‌, ఈశ్వ‌రీరావు తదితరులు..
దర్శకత్వం : పా.రంజిత్‌
నిర్మాతలు: ధ‌నుశ్‌
మ్యూజిక్ : స‌ంతోశ్ నారాయ‌ణ్‌
విడుదల తేది : జూన్ 7, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 3.25/5

రివ్యూ : ‘కాలా’-
రజనీ మాస్ పెర్ఫామెన్స్..

సూపర్ స్టార్ రజనీకాంత్..ఈ పేరు చెపితే చాలు అభిమానులు ఊగిపోతారు. ఈయన నుండి సినిమా వస్తుందంటే తమిళనాట పెద్ద పండగల భావిస్తారు. వయసు తో సంబంధం లేకుండా ఇప్పటికి తన క్రేజ్ కొనసాగించడం ఒక్క రజనీకే చెల్లింది. అలాంటి రజనీ కబాలి తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకొని ఈరోజు కాలా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ముంబై ధారావి అనే ప్రాంతంలోని ఓ డాన్ త‌న ప్రాంత ప్రజల కోసం ఏం చేసాడనేది ఈ చిత్ర కథ గా డైరెక్టర్ పా. రంజిత్ తెరకెక్కించారు. మరి కబాలితో ఆకట్టుకోలేకపోయిన రంజిత్..ఈ మూవీ తో ఆకట్టుకున్నాడా..లేదా..? త్వరలో రాజకీయాల్లో రాబోతున్న రజనీ కి ఈ మూవీ హెల్ప్ అవుతుందా..లేదా…? అసలు కాలా కథ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

క‌రికాల‌న్‌(ర‌జ‌నీకాంత్‌) ముంబై లోని ధారావి అనే మురికివాడలో ఉంటూ, అక్కడి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని వారి సమస్యలఫై పోరాడుతూ నాయకుడుగా ఉంటాడు. ఎప్పటినుండో ఆ ప్రాంతాన్ని నమ్ముకొని చాలామంది ప్రజలు అక్కడ నివాసం ఉంటారు. అయితే ఆ ప్రాంతాన్ని కబ్జా చేయాలనీ చాల రోజులుగా రాజకీయ నాయకుడైన హ‌రినాథ్ దేశాయ్‌(నానా ప‌టేక‌ర్‌) ట్రై చేస్తుంటాడు. కానీ అక్కడి ప్రజలు మాత్రం ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లేందుకు ఇష్టపడరు.

దాంతో ఎలాగైనా ఆ ప్రాంతం దక్కించుకోవాలని అనుకున్న హ‌రినాథ్ దేశాయ్‌, వారి మధ్య కుల మత గొడవలు సృష్టిస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? క‌రికాల‌న్‌ ఈ గొడవలను ఎలా ఆపుతాడు..? అసలు క‌రికాల‌న్‌ ఎక్కడి నుండి వస్తాడు..? చివరకు ధారావి ప్రాంతం ఎవరికీ దక్కుతుంది..? అనేది మీరు తెర ఫై చూడాల్సిందే.

ప్లస్ :

* కథ

* రజనీకాంత్ యాక్షన్

* డైరెక్షన్

మైనస్ :

* స్లో నేరేషన్

* పాటలు

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* రజనీకాంత్ నటన గురించి కొత్తగా చెప్పాల్సింది ఏముంది..సరైన మాస్ కథ పడితే తెర మీద ఓ ఆట ఆడుకుంటాడు. ఈ సినిమా విషయం లో కూడా అదే చేసాడు. పేదవాడి కోసం ప్రాణాలైనా ఇచ్చే నాయకుడిగా తన మాస్ యాక్షన్ తో అదరగొట్టాడు.

సినిమా అంత కూడా రజనీ చుట్టూనే తిరుగుతుంది. ప్రేమ , కోపం , యాక్షన్ ఇలా ప్రతి దానిలో రజనీ మార్క్ చూపించాడు. ఈ వయసులో కూడా ఆ రేంజ్ లో నటించడం ఒక్క రజనీ కే చెల్లుతుందని సినిమా చూస్తే ఎవరైనా అంటారు.

* నానా ప‌టేక‌ర్‌ యాక్టింగ్ కూడా సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఏ రాజకీయ నాయకుడైన ఖాళీ స్థలం కనిపిస్తే చాలు దానిని దోచుకోవాలని చూస్తుంటాడు. ఈ సినిమాలో నానా ప‌టేక‌ర్‌ అదే చేసాడు.

* రజనీ భార్య గా ఈశ్వ‌రీరావు నటన చాల బాగుంది.

* ఎన్‌జి.ఒ స‌భ్యురాలుగా హ్యూమా న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది.

* స‌ముద్ర‌ఖ‌ని పాత్ర ప‌రిధి మేర చ‌క్క‌గా ఉంది.

* అంజ‌లి పాటిల్‌, అర‌వింద్ ఆకాశ్‌, షాయాజీ షిండే త‌దిత‌రులు వారి వారి పరిధిలో బాగానే నటించారు.

సాంకేతిక విభాగం :

* స‌ంతోశ్ నారాయ‌ణ్‌ మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపించింది.

* చ‌ంద్ర‌బోస్‌, వ‌న‌మాలి సాహిత్యం ఏ మాత్రం బాగాలేదు.

* శ్రీరామ‌కృష్ణ‌ మాటల్లో ఇంకాస్త పంచ్ లు ఉంటె బాగుండు.

* ముర‌ళి.జి సినిమా ఫొటోగ్రాహి బాగుంది.

* ధనుష్ నిర్మాణ విలువలు ఆకట్టుకున్నాయి.

* ఇక పా. రంజిత్ విషయానికి వస్తే..కబాలి తో నిరాశ పరిచినప్పటికీ , ఈ మూవీ తో మాత్రం ఆకట్టుకున్నాడు. రజనీ నుండి ప్రజలు ఏం కురుకుంటున్నారో దానిని చూపించాడు. ఇంత పెద్ద దేశం లో పేదవాడు ఉండడానికి భూమి ఎందుకు లేదు అనే పాయింట్ తీసుకున్నాడు.

స్వాతంత్యం వ‌చ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. 60 శాతం మంది ప్ర‌జ‌లు స్వంత ఇల్లు లేకుండా ఉన్నారు. అటువంటి వారి గురించి, వారి స‌మ‌స్య‌లు గురించి తెలుపే సినిమా గా ఈ కాలా ను తెరకెక్కించాడు. కథ కు కరెక్ట్ గా రజనీ ని ఎంచుకొని సక్సెస్ అయ్యాడు. ఆయన ఏమి చెప్పదల్చుకున్నాడో తెర ఫై అర్ధమయ్యే విధంగా చూపించాడు. కాకపోతే స్లో నేరేషన్ వల్ల కాస్త ఇబ్బంది తప్పదు. త్వరలో రాజకీయాల్లో రాబోతున్న రజనికి ఈ మూవీ చాల హెల్ప్ అవుతుంది.

చివరిగా :

రజనీ నుండి అసలుసిసలైన సినిమా కావాలని ఎదురు చూసే వారికీ కాలా ఫుల్ భోజనం అవుతుంది. పేదవాడు ఎలాంటి కష్ఠాలు పడుతున్నాడో..ఇంత పెద్ద దేశం అయి ఉండి కూడా కనీసం ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి పేదవాడిదని డైరెక్టర్ బాగా చూపించాడు. రజనీ సైతం ఈ కథకు పూర్తి న్యాయం చేసాడు. ఈయన చుట్టే కథ అంత సాగుతుంది. ఓవరాల్ గా కాలా..రజనీ మాస్ పెర్ఫామెన్స్.