Site icon TeluguMirchi.com

రివ్యూ : జక్కన్న – నిలబెట్టుకున్నాడు

టైటిల్ : జక్కన్న (2016)
స్టార్ కాస్ట్ : సునీల్ , మన్నార్ చోప్రా, సప్త గిరి , పృద్వి
డైరెక్టర్ : వంశీ కృష్ణ ఆకెళ్ళ
ప్రొడ్యూసర్స్ : ఆర్పీఏ క్రియేషన్స్
మ్యూజిక్ : దినేష్
విడుదల తేది : 29 జూలై, 2016
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

రివ్యూ : జక్కన్న – నిలబెట్టుకున్నాడు

కమెడియన్ గా మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు హీరో గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్న సునీల్ , ఆ తర్వాత వరుస డిజాస్టర్ లతో సతమతం అవుతున్నాడు. ఈ నేపథ్యం లో తనకు ఓ మంచి హిట్ ఇచ్చిన రాజమౌళి పేరు పెట్టుకొని ఈరోజు ప్రేక్షకుల ముందుకు జక్కన్న గా వచ్చాడు. వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం లో ప్రేమ కథ చిత్రం వంటి సూపర్ హిట్ ఇచ్చిన ఆర్పీఏ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కింది. సునీల్ కు జత గా మన్నార్ చోప్రా నటించింది. మరి ఈ చిత్రమైన సునీల్ ను గట్టెక్కించిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి గణేష్ (సునీల్ ). ఇతనికి హెల్ప్ చేసినవారికి తిరిగి హెల్ప్ చేస్తుంటాడు. ఈ క్రమం లో వైజాగ్ సిటీకి డాన్ అయినా భైరాగి , గణేష్ చిన్నతనం లో హెల్ప్ చేస్తాడు. దీంతో అతడిని కలవడానికి వైజాగ్ వెళ్ళతాడు. అతడో పెద్ద రౌడీ అని తెలుసుకొని అతడిని మార్చే ప్రయత్నం చేస్తాడు. ఈ లోపు భైరాగి చెల్లెలు సహస్ర (మన్నారా చోప్రా) గణేష్ ని లవ్ చేయడం మొదలు పెడుతుంది. మరి భైరాగి మారతాడా..? సహస్ర ప్రేమకు ఒకే చెపుతాడా ..? అనేది మిగతా స్టోరీ.

ప్లస్ :

సునీల్
సప్తగిరి & పృథ్వీ కామెడీ ట్రాక్
క్లైమాక్స్
స్క్రీన్ప్లే

మైనస్ :

కధలో డ్రాగింగ్
ఊహించగలిగిన కథ
మ్యూజిక్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

మరోసారి సునీల్ తనదయిన కామెడీ & యాక్షన్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక డాన్స్ లలో మరో సారి చిరును తలపించాడు. అలాగే మన్నార్ చోప్రా తన అందచందాలతో ఆకట్టుకుంది. మొదటిసినిమా కావడం తో కాస్త నటనలో అక్కడక్కడా తడబడింది. సప్తగిరి . 30 ఇయర్స్ పృద్వి ఇద్దరు థియేటర్ లో నవ్వులు పూయించారు. వీరి కామెడీ సినిమా కు మరింత హెల్ప్ అయ్యింది. విలన్‌గా నటించిన కబీర్ సింగ్ కూడా బాగానే నటించాడు.

సాంకేతిక విభాగం :

రక్ష చిత్రం తో భయపెట్టిన వంశీ కృష్ణ ఆకెళ్ళ , జక్కన్న లో మాత్రం కామెడీ తో అందరిని ఆకట్టుకున్నాడు. అక్కడక్కడ కాస్త కథ డ్రాగ్ అయినా కానీ ప్రేక్షకులను 2: 30 గంటలు థియేటర్ లో కూర్చుపెట్టడం లో సక్సెస్ అయ్యాడు. దినేష్ మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. సి. రాం ప్రసాద్ అందించిన సినిమాటోగ్రాఫర్ బాగుంది. ఆర్పీఏ క్రియేషన్స్ వారి ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి

చివరిగా :

ఓవరాల్ గా సునీల్ మళ్లీ గాడిలో పడతాడు అని జక్కన్న తో చెప్పచ్చు. గత వారం కబాలి తో డిస్పాయింట్ అయినా ప్రేక్షకులు జక్కన్న తో హ్యాపీ కావొచ్చు. టైం పాస్ కామెడీ ఫామిలీ ఎంటర్టైనర్ ఎంచుకొని సునీల్ హిట్ కొట్టాడు.

Exit mobile version