Jack Movie Review
నిర్మాత: బీవీఎస్‌ఎన్ ప్రసాద్
డైరెక్టర్: బొమ్మరిల్లు భాస్కర్
నటులు: సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవీ చైతన్య, ప్రకాశ్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ
సంగీతం: సురేష్ బొబ్బిలి, అచ్చు రాజమణి
తెలుగు మిర్చి రేటింగ్ : 1.75/5
జాక్” మూవీ రివ్యూ: జాక్ గాడు టిల్లుని మిస్ అయ్యాడు!
పాబ్లో నెరుడా అలియాస్ జాక్ (సిద్దు జొన్నలగడ్డ) ఓ యంగ్‌స్టర్ — ఎనర్జీతో, కాని డైరెక్షన్ లేకుండా. ఎన్నో గేమ్స్ ట్రై చేసి, ఎక్కడా ఫిట్ కాలేదు. చివరికి “రా” ఏజెంట్ కావాలన్న డ్రీమ్‌తో తనదైన దారిలో క్రైమ్ కేసుల్ని స్టడీ చేసి, ఇంటర్వ్యూకి రెడీ అవుతాడు. అయితే, సెలక్షన్‌కి ముందే జాక్ దేశం కోసం పని చేయాలని డిసైడ్ అవుతాడు. ఇక టెర్రరిస్ట్ అటాక్ నేపథ్యంలో, ఒక ఐపీఎస్ అధికారి (సుబ్బరాజు)తో కలిసి మిషన్ స్టార్ట్ చేస్తాడు. రా చీఫ్ మనోజ్ కుమార్ (ప్రకాశ్ రాజ్)ని కిడ్నాప్ చేయడం మొదలుకొని నేపాల్ వరకూ ప్రయాణం. ఈ కథలో భానుమతి (వైష్ణవీ చైతన్య) అనే ప్రైవేట్ డిటెక్టివ్ కూడా జాక్‌ను ఫాలో అవుతుంది. చివరికి ఈ మిషన్ ఎంతవరకు సక్సెస్ అయ్యిందో, జాక్ రా ఏజెంట్‌గా సెట్ అయ్యాడో, అనేదే మిగతా సినిమా.
టిల్లు స్క్వేర్”తో కడుపుబ్బా నవ్వించిన సిద్దు, ఇప్పుడు టోన్ మార్చి యాక్షన్ కామెడీ మిక్స్ తో “జాక్”గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఫలితం మాత్రం కలిసిరాలేదు. బొమ్మరిల్లు భాస్కర్ కథ చెప్పిన తీరు, ఎమోషన్, హ్యూమర్ అన్నీ తేడా కొట్టినట్టు అనిపిస్తుంది. సినిమాలో కామెడీ ఉంటుందనుకున్నాం – కానీ అది కొన్ని డైలాగ్స్, టిల్లు టచ్ ఉన్న కాసేపు వరకే పరిమితమైంది. మిగతా సినిమా సీరియస్ టెర్రరిస్ట్ డ్రామాగా సాగుతుంది – అది కూడా ఫోన్‌లో వినిపించే న్యూస్ లా, ఎమోషన్ లేకుండా. కథ చాలా రొటీన్, ట్విస్ట్ లు లేకుండా బోరింగ్‌గా సాగుతుంది. “రా” మీద ఆధారపడిన కథ కావడంతో మంచి సీరియస్ ట్రీట్మెంట్ ఉంటే బాగుండేది, కానీ దర్శకుడు సిల్లీగా టేకప్ ఇచ్చాడు. బొమ్మరిల్లు భాస్కర్ స్టైల్ ఉన్నా, ఈసారి దాని స్పష్టత లేదు. “రా” నేపథ్యం, ఉగ్రవాదం వంటి సీరియస్ అంశాలను టోన్ లెస్‌గా చూపించడం సినిమాని నష్టం చేసేసింది. డైలాగ్స్, క్యారెక్టర్ డెవలప్‌మెంట్, స్క్రీన్‌ప్లే అన్నీ అపాక్షికంగా ఉన్నట్టు అనిపిస్తుంది.
సిద్దు జొన్నలగడ్డ: టిల్లు శేడ్స్ ఇంకా కనిపించాయి. యాక్షన్‌కు వెళ్తే ఫిట్ అయినప్పటికీ, పాత్రలో ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయింది.
వైష్ణవీ చైతన్య: బేబీ ఫేమ్ నుండి రోల్ ఎక్స్‌పెక్ట్ చేసినంతగా వర్కౌట్ కాలేదు. ఆమె పాత్ర మరింత బలంగా ఉండాల్సింది.
ప్రకాశ్ రాజ్: మంచి నటుడు అయినప్పటికీ, ఈ సినిమాలో సీరియస్ నెస్ లేకపోవడం వల్ల పాత్ర పండలేదు.
నరేష్, బ్రహ్మాజీ: పాత్రలు ఉండడమే తప్ప, ఎలాంటి ఇంపాక్ట్ లేకుండా పోయాయి.
“జాక్” — ఒక్కో చోట ఫన్నీగా, చాలాచోట్ల కన్ఫ్యూజింగ్‌గా, ఎక్కువగా రొటీన్‌గా. కావాలంటే టైం పాస్ కోసం ఓసారి ట్రై చేయొచ్చు. టిల్లుని ఆశించి వెళ్తే మాత్రం నిరాశే.
తెలుగు మిర్చి రేటింగ్ : 1.75/5