Site icon TeluguMirchi.com

రివ్యూ : ‘ఇంకొక్కడు ‘ – కొంతమందికే….

టైటిల్ : ‘ఇంకొక్కడు ‘ (2016)
స్టార్ కాస్ట్ : విక్రమ్, నయనతార , నిత్యామీనన్ తదితరులు…
డైరెక్టర్ : ఆనంద్ శంకర్
ప్రొడ్యూసర్స్ : శిబు థమీన్స్
మ్యూజిక్ : హరీస్ జైరాజ్
విడుదల తేది : 08 సెప్టెంబర్ , 2016
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

రివ్యూ : ‘ఇంకొక్కడు ‘ – కొంతమందికే….

‘విక్రమ్’ సినిమా వస్తుందంటే చాలు సినీ ప్రేక్షకులు ఏదో తెలియని అంచనా వేసుకుంటారు..ప్రతి చిత్రం ఓ ప్రయోగాత్మకంగా ఉండాలనుకునే హీరో విక్రమ్, శివ పుత్రుడు , అపరిచితుడు , నాన్న , మొన్నటి ఐ వరకు కూడా అలాగా చేసినవే..ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పాత్ర కోసం నటించడం కాదు జీవిస్తాడు. అందుకే అతడి సినిమాలంటే అందరికి ఇష్టం.

ఇక తెలుగు లో అపరిచితుడు తర్వాత ఆ రేంజ్ హిట్ మాత్రం కొట్టలేకపోయిన విక్రమ్ , తాజాగా ఇంకొక్కడు తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రెండు విభిన్న గెటప్స్ లలో విక్రమ్ కనిపించడం తో ఈ సినిమా ఫై అభిమానులు బాగానే అంచనాలు పెట్టుకున్నారు. మరి వారి అంచనాలను అందుకోవడం లో ‘ఇంకొక్కడు ‘ ఏ మేరకు అందుకున్నాడో ఇప్పుడు చూద్దాం..

కథ :

లవ్ (విక్రమ్ ) ‘స్పీడ్’ అనే ఓ డ్రగ్‌ను కనిపెట్టిన ఓ సైంటిస్ట్.. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల 75 ఏళ్ళ ముసలివాడైనా వ్యక్తి కూడా దాడి చేయగలిగాడని తెలుసుకుంటాడు లవ్. ఈ స్పీడ్ డ్రగ్స్ తో కోట్లు సంపాదించుకోవాలని చెడు పనులు చేయడం మొదలు పెడతాడు..ఈ క్రమంలోని మలేషియాలోని భారతీయ కార్యాలయంఫై దాడికి పాల్పడతాడు. ఈ దాడి కి పాల్పడింది లవ్ అని తెలుసుకున్న సిబ్బంది ఆ కేసు ను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన అరుషి(నిత్యామీనన్) కు అప్పజెప్పుతారు.

అదే టైం లో అరుషి కి గతం లో లవ్ వల్ల అఖిలన్ -మాజీ రా ఏజెంట్ (విక్రమ్) తన భార్య మీరా (నయనతార) ను పోగొట్టుకున్న విషయం తెలుస్తుంది..దీంతో అఖిలన్ కు ఈ దాడి గురించి చెప్పి , లవ్ ను చంపితే, నీ పగ కూడా తీరుతుందని అతడి ని తీసుకొని మలేషియా కు వెళ్ళేతుంది..ఆ తర్వాత ఏం జరిగింది..? అసలు లవ్, మీరా ను ఎందుకు చంపాల్సి వచ్చింది..? చివరకు అఖిల్ , లవ్ ను ఎలా చంపుతాడు..? అనేది మీరు తెర ఫై చూడాల్సిందే…

ప్లస్ :

* విక్రమ్ ద్విపాత్రాభినయ నటన

* హరీష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

* ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ

* విజువల్ ఎఫెక్ట్స్

* ఫస్ట్ హాఫ్

మైనస్ :

* రొటీన్ స్టోరీ

* కామెడీ

* స్క్రీన్ ప్లే

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

విక్రమ్ నటన గురించి కొత్తగా ఏం చెప్పనవసరం లేదు..ప్రయోగం కోసం ఎంతకైనా తెగిస్తాడు..అలాంటిదే ఈ చిత్రం లోను చేసాడు..రా ఏజెంట్ అఖిలన్ గా, సైంటిస్ట్, నెగటివ్ షేడ్స్ ఉన్న లవ్ పాత్రలో విక్రమ్ నటను అదరగొట్టాడు. లవ్ పాత్ర అందరికి బాగా నచ్చుతుంది..విక్రమ్ ఇలాంటి పాత్రలు కూడా చేస్తాడా అని మరోసారి అనుకుంటాం..

ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే నయనతార అందంతో పాటు తన నటనతో కూడా ఆకట్టుకుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రోల్ నిత్యామీనన్ కనిపించినప్పటికీ పాత్ర చిన్నది కావడం తో ఆమె నటనకు పెద్ద స్కోప్ లేకుండాపోయింది. నాజర్, తంబిరామయ్య, కరుణాకరన్ తదితరులు వారి వారి పాత్రల మేర చక్కగా నటించారు.

సాంకేతిక విభాగం :

ముందుగా ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ గురించి చెప్పుకోవాలి, ప్రతి ఫ్రేమ్ ను రిచ్ గా చూపించడంలో సినిమాటోగ్రఫర్ గా సక్సెస్ అయ్యాడు. భాను శ్రీనివాసన్ ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ స్పీడ్ గానే లాగించాడు కానీ సెకండ్ హాఫ్ కాస్త తన కత్తెర కు పని చెపితే బాగుండు.

హారీష్ జైరాజ్ సంగీతం పెద్దగా వర్క్ అవుట్ కాలేదు..హెలెనా…అనే పాట మినహా మిగతా ట్యూన్స్ ఆడియెన్స్ కు ఎక్కవు. కాకపోతే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టాడు..ముఖ్యంగా ఛేజింగ్ సీన్స్ లలో అరిపించాడు. శశాంక్ మాటలు కొత్తగా చెప్పడానికి ఏం ఉంటాయి..ఎప్పటినుండో డబ్బింగ్ చిత్రాలకు వింటూనే వస్తున్నాం..అదే మాదిరిగా ఉన్నాయి తప్ప పేల్చే డైలాగ్స్ మాత్రం లేవు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి. లవ్ పాత్రకు కాస్యూమ్స్ పరంగా, మేకప్ పరంగా తీసుకున్న జాగ్రత్తలను అభినందించాల్సిందే!

చివరిగా :

అందరికి తెలిసిన కాన్సెప్ట్‌నే ఆనంద్ శంకర్ తీసుకున్నాడు , తప్ప కొత్త కాన్సెప్ట్ అయితే కాదు..కాకపోతే కమర్షియల్ సినిమా ఫార్మాట్‌లో చెప్పే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్ ను థ్రిల్లింగ్ గా రూపొందించడంలోదర్శకుడు మంచి మార్కులనే సంపాదించుకున్నాడు. కాకపోతే సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి బోర్ కొట్టించాడు..

యాక్షన్ సీన్స్, ట్విస్ట్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ చాలా చోట్ల సినిమాని స్లో నడిపించాడు. అంతే కాదు కొన్ని సీన్స్ అయితే ఏ మాత్రం లాజిక్ లేనట్టుగా తీసిపడేసాడు.. దాంతో చూసిన ప్రేక్షకులకు ఇదివరకే చూసిన చిత్రమే అనే ఫీలింగ్ కలుగుతుంది.

కొత్తగా ఈ చిత్రం లో చూసింది ఏంటి అంటే విక్రమ్ ను మొదటిసారి పూర్తి స్థాయి విలన్ రోల్ లో చూడడం. తప్ప ఏమిలేదు. విక్రమ్ ఎంతో ముచ్చటపడి చేసిన ఈ స్పై థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుంది అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..

ఓవరాల్ గా ‘ఇంకొక్కడు ‘ – కొంతమందికే….

Exit mobile version