Site icon TeluguMirchi.com

రివ్యూ : బ్యాడ్ లక్ ‘సఖి’

స్టార్ కాస్ట్ : కీర్తి సురేష్ , జగపతి బాబు , ఆదిపిని శెట్టి తదితరులు..
దర్శకత్వం : నగేష్ కుకూనూర్
నిర్మాతలు: సుధీర్ చంద్ర పదిరి
మ్యూజిక్ : దేవి శ్రీ
విడుదల తేది : జనవరి 28, 2021
తెలుగు మిర్చి రేటింగ్ : 2.25/5

మహానటి ఫేమ్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో షూటింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘గుడ్ లక్ సఖి’. నగేష్ కుకునూర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇందులో ఆది పినిశెట్టి హీరోగా, జగపతి బాబు కీలక పాత్రలో నటించారు. దీన్ని దిల్‌ రాజు సమర్పణలో సుధీర్‌ చంద్ర పదిరి.. శ్రావ్య వర్మతో కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా..మంచి అంచనాల మధ్య ఈరోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది..? కీర్తి హిట్ కొట్టిందా..లేదా..? అసలు కథ ఏంటి..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

సఖి (కీర్తి సురేష్) ఒక పల్లెటూరు అమ్మాయి. ఆమెను అందరూ దురదృష్టం గా భావిస్తూ ఉంటారు. అందుకే ఆమెను అందరూ “బ్యాడ్ లక్ సఖి” అని పిలుస్తూ ఉంటారు. నాలుగైదు పెళ్ళి సంబంధాలు వచ్చినా చివరి క్షణంలో అవి తప్పిపోతాయి. అయినా తన మనవరాలి కోసం ఏదో ఒక రోజు రాజకుమారుడు వస్తాడని ఆమె నానమ్మ నమ్ముతూ ఉంటుంది. అదే సమయంలో ఆ ఊరికి రిటర్న్డ్ కల్నల్ (జగపతిబాబు) వస్తాడు. గ్రామీణ యువత ప్రతిభను వెలికి తీసి, మంచి షూటర్స్ ను తయారు చేయాలన్నది ఆయన కోరిక. అప్పుడే సఖి చిన్నప్పటి స్నేహితుడు గోలి రాజు ఉరఫ్ రామారావు (ఆది పినిశెట్టి) కూడా నాటకాల్లో కాస్తంత పేరు సంపాదించి, ఆమెను కలుస్తాడు. అతని ప్రోత్సాహంతో కల్నల్ దగ్గర సఖి షూటింగ్ నేర్చుకుంటుంది. మరి షూటింగ్ నేర్చుకున్న సఖి..తన జాతకాన్ని మార్చుకుంటుందా లేదా..? సూరి (రాహుల్ రామకృష్ణ) పాత్ర ఈ కథను ఎలా మలుపు తిప్పింది? చివరికి ఏమైంది? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

మైనస్ :

నటీనటుల తీరు :

మహానటి చిత్రంతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్..ఆ రేంజ్ హిట్ , పేరు మళ్లీ తెచ్చుకోల్పొయింది. ఇక ఈ మూవీ లో బాడ్ లక్ సఖి గా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దానికి కారణం ఆమె తప్పు కాదు డైరెక్టర్
లోపమే.షార్ప్ షూటర్ గా నటించిన కీర్తి సురేష్ ఈ సినిమా కోసం చాలా కష్టపడింది.

కల్నల్ గా జగపతిబాబు, గోలీ రాజు గా ఆది పినిశెట్టి చక్కగా నటించారు. కానీ ఆ యా పాత్రలను దర్శకుడు ఎఫెక్టివ్ గా తీర్చి దిద్దలేదు. రాహుల్ రామకృష్ణ విలన్ కాని విలన్ పాత్ర పోషించాడు. ఆ పాత్ర ఎటూ కాకుండా పోయింది.

రఘుబాబు, రమాప్రభ, ప్రభావతి, గాయత్రి భార్గవి, శ్వేతవర్మ, దివ్య శ్రీపాద వంటి వారు మిగిలిన పాత్రలను పోషించారు.

సాంకేతిక వర్గం :

ఓవరాల్ : సఖి బాడ్ లక్ సఖినే .

Exit mobile version