Site icon TeluguMirchi.com

రివ్యూ : డీజే టిల్లు – సిద్దు సౌండ్ దద్దరిల్లింది

స్టార్ కాస్ట్ : సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్, బ్రహ్మాజీ,నర్రాశీను తదితరులు..
దర్శకత్వం : విమల్‌ కృష్ణ
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ
మ్యూజిక్ : రామ్‌ మిరియాల, శ్రీచరణ్‌ పాకాల
విడుదల తేది : ఫిబ్రవరి 12, 2021
తెలుగు మిర్చి రేటింగ్ : 3.25/5

యంగ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం ‘ డీజే టిల్లు’. ‘అట్లుంటది మనతోనే’ అనేది సినిమా ఉపశీర్షిక. నేహా శెట్టి ఈచిత్రంలో హీరోయిన్‌గా నటించగా.. విమల్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. మంచి అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది..? సిద్దు యాక్టింగ్ ఎలా ఉంది..? అసలు కథ ఏంటి..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

బాలగంగాధర్‌ తిలక్‌ అలియాస్‌ డీజే టిల్లు (సిద్ధూ) డీజే ప్లేయర్‌గా పనిచేస్తాడు. ఒక క్లబ్‌లో రాధిక (నేహా శెట్టి) పరిచయం అవుతుంది. కాసేపటికే ఇద్దరూ ప్రేమలో పడతారు. టిల్లు పుట్టినరోజున కుటుంబ సభ్యులకు రాధికను పరిచయం చేసే ప్రోగ్రాం పెట్టి ఓ పార్టీ ఏర్పాటు చేస్తాడు. అయితే టిల్లు, రాధికా ల ప్రేమ వ్యవహారం తెలిసి రాధిక బాయ్ ఫ్రెండ్ (కిరిటీ దామ‌రాజు) రాధిక‌తో గొడ‌వ ప‌డ‌తాడు. ఆ గొడ‌వ‌లో అనుకోకుండా రాధిక బాయ్ ఫ్రెండ్ చ‌నిపోతాడు. రాధిక భ‌యంతో టిల్లుకి ఫోన్ చేసి ఇంటికి పిలుస్తుంది.

ఇంటికి వ‌చ్చిన టిల్లుకి ప‌రిస్థితి అర్థ‌మ‌వుతుంది. పోలీసుల‌కు ఫోన్ చేస్తే ప‌రిస్థితి పెద్ద‌ద‌వుతుంద‌ని వారు భావిస్తారు. దాంతో రాధిక కోసం టిల్లు శ‌వాన్ని పాతి పెడ‌తాడు. అయితే ఆ శ‌వాన్ని ఒక‌రు వీడియో తీసి టిల్లు, రాధిక‌ను పాతిక ల‌క్ష‌లు డిమాండ్ చేస్తారు. అప్పుడు ఇద్ద‌రూ ఏం చేస్తారు? హ‌త్య కేసు నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

ప్లస్ :

మైనస్ :

సాంకేతిక వర్గం :

నటీనటుల తీరు :

ఫైనల్ గా : డీజే టిల్లు సినిమా పూర్తిగా నాన్ స్టాప్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఆధారంగా సాగే ఫుల్టు, బిందాస్ సినిమా. సిద్దూ జొన్నలగడ్డ మల్టీ టాస్కింగ్ వర్క్, యాటిట్యూడ్, డ్రెసింగ్, లుక్, బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు.

Exit mobile version