Site icon TeluguMirchi.com

రివ్యూ : చీకటి రాజ్యం

టైటిల్ : చీకటి రాజ్యం (2015)
స్టార్ కాస్ట్ : కమల్ హసన్, త్రిష, ప్రకాష్ రాజ్, మధు శాలిని
డైరెక్టర్ : రాజేష్‌.ఎం.సెల్వ‌
ప్రొడ్యూసర్ : ఎస్‌.చంద్ర‌హాస‌న్‌, క‌మ‌ల్‌హాస‌న్‌
మ్యూజిక్ : జిబ్రాన్‌
విడుదల తేది : నవంబర్ 20, 2015
తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5

రివ్యూ : చీకటి రాజ్యం- చీకట్లో కాస్త వెలుగులను చూపించాడు


ప్రయోగాలు చేయడం లో తనకు తనే సాటి అనిపించుకున్న కమల్ హసన్ ‘విశ్వ రూపం ‘ సక్సెస్ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని చీకటి రాజ్యం అనే ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. కమల్ హసన్ , ప్రకాష్ రాజ్ , త్రిష , మధుశాలిని జంటగా నటించిన ఈ చిత్రం తమిళ వర్షన్‌ లో ‘తూంగవనం’ గా దీపావళి రోజున విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది..మరి తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకోగలిగిందో ఇప్పుడు చూద్దాం…

కథ :

దివాకర్ (కమల్‌హాసన్) నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి.. దివాక‌ర్‌ భార్య సుజాత (మధుశాలిని) దివాకర్ కు విడాకులు ఇచ్చి డాక్ట‌ర్‌ వృతి చేసుకుంటూ గడుపుతుంది.. కంట్రోల్ బ్యూరో ఆఫీసర్ అయిన దివాకర్ తన తోటిద్యోగి మణి (యుగిసేథు)తో కలిసి స్మగ్లర్స్ నుండి డ్రగ్స్ కాజేసి దాని ద్వారా తన అవసరాలు తీర్చుకోవాలని ప్లాన్ చేస్తాడు. ఈ సందర్భం లో ఓ ముఠా నుండి పెద్ద ఎత్తున కొకైన్ స్వాధీనం చేసుకుంటారు. అది విఠల్ రావు (ప్రకాష్ రాజ్) డ్రగ్స్ ముఠాకి తెలియడంతో దివాకర్ కొడుకు వాసు (అమన్ అబ్దుల్లా)ని కిడ్నాప్ చేసి దివాకర్ దగ్గర ఉన్న సరుకును రాబట్టుకోవాలని ప్లాన్ చేస్తాడు.

అప్పుడు దివాకర్ ఏం చేస్తాడు.? కొడుకును కాపాడుకుంటాడా లేక సరుకును కాపాడుకుంటాడా..? అనేది తెరఫై చూడాల్సిందే..

ప్లస్ :

ముఖ్యంగా ఈ చిత్రానికి ప్లస్ అంటే కథ అని చెప్పుకోవాలి.. క‌మ‌ల్‌హాస‌న్ చేసిన స్క్రీన్ ప్లే చాల బాగుంది. కొత్త లుక్ లో కమల్ కనిపించాడు…నార్కాటిక్ ఆఫీస‌ర్‌గా త్రిష మంచి పాత్ర‌లో కనిపించడమే కాకుండా తన గ్లామర్ యూత్ ని కట్టిపడేసింది..

జిబ్ర‌న్ అందించిన సంగీతం & బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్ర‌కాష్ రాజ్‌, సంప‌త్‌, కిశోర్‌ వారివారి పత్రాల కు తగ్గట్టు బాగా నటించారు…

మైనస్ :

ఫ్రెంచ్ చిత్ర ఆదరంగా తెరకెక్కించిన ఈ చిత్రం లో కొత్త ట్విస్ట్ లు ఏమి ఉండవు..సినిమా మొదలయిన కొంత సేపటికే మిగతా కథ ఏంటో తెలిసిపోతుంది…అలాగే కామెడీ అనే అంశాలు లేకపోవడం..యాక్షన్‌ థ్రిల్లర్‌ అంటే ఫైట్స్ మీద ఎక్కువ ఇంటర్స్ట్ పెడతారు కానీ ఇందులో అలాంటి చెప్పుకోదగ్గ ఫైట్స్ ఏమి ఉండవు..

సాంకేతిక విభాగం :

అబ్బూరి రవి అందించిన సంభాషణలు పాత్రల భావోద్వేగానికి తగ్గట్టు వున్నాయి. అలాగే రామజోగయ్య శాస్త్రి రాసిన ప్రమోషనల్ గీతం అందర్ని ఆకట్టుకుంటుంది..ఇలాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే చాల ప్రదానం..కమల్ స్క్రీన్ ప్లే పనితనం బాగుంది..కమల్ శిష్యుడు రాజేష్‌ ఎమ్‌. సెల్వ కథ కు తగ్గట్టు తన దర్శకత్వ ప్రతిభను కనపరిచి శభాష్ అనిపించుకున్నాడు.

చివరిగా :

రెండున్న‌ర ద‌శాబ్దాల త‌ర్వాత క‌మ‌ల్ హాస‌న్ నేరుగా తెలుగు లో సినిమా రావడం తో ప్రేక్షకులలో ఎక్స్ పెక్టేష‌న్స్ ఎక్కువ‌గా పెట్టుకున్నారు. మ‌ధుశాలిని లిప్‌లాక్‌, త్రిష గ్లామ‌ర్‌, ప్ర‌కాష్‌రాజ్ తోడ‌వ‌డం వంటివ‌న్నీ సినిమాపై భారీ అంచ‌నాల‌ను పెంచేలా చేసాయి. ఈ సినిమా ఓవ‌రాల్‌గా ఎ సెంట‌ర్ చిత్రం అని చెప్పవచ్చు..మాస్ జనాలు ఆకట్టుకునే అంశాలు తక్కువగా ఉండడం తో అక్కడ ఆడడం కష్టమే అని చెప్పాలి…మొత్తంగా కమల్ చీకట్లో కాస్త వెలుగులను చూపించాడు..

Exit mobile version