నటీనటులు: కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని తదితరులు
దర్శకత్వం : కౌశిక్ పెగళ్లపాటి
నిర్మాతలు: జీఏ2 పిక్చర్స్
మ్యూజిక్ : జాక్స్ బిజోయ్
విడుదల తేది : మార్చి 19, 2021
తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5
ఆర్ఎక్స్ 100 , హిప్పీ , గుణ 369, 90 ఎంఎల్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ హీరో కార్తికేయ..ఈరోజు చావు కబురు చల్లగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం కాగా.. జేక్స్ బెజాయ్ సంగీతం సమకూర్చారు. ఈ మూవీ లో శవాల బండికి డ్రైవర్‌గా, బస్తీ బాలరాజుగా కార్తికేయ నటించగా..ఆయనకు జోడిగా లావణ్య త్రిపాఠి జోడికట్టింది. మరి ఈ మూవీ కథ ఏంటి..? కార్తికేయ యాక్టింగ్ ఎలా ఉంది..? మొదలగు విశేషాలు ఇప్పుడు చూద్దాం.
కథ :
బస్తీ బాలరాజు (కార్తికేయ) శవాల వాహనానికి డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. ఓ రోజు మల్లిక (లావణ్య త్రిపాఠి) ని చూసి ఇష్టపడతాడు. కానీ మల్లిక కు అప్పటికే పెళ్ళై , భర్త చనిపోతాడు. ఈ భాధ నుండి బయటకు రాలేకపోతుంటుంది. ఇదే సమయంలో బాలరాజు తనను ప్రేమించాలంటూ మల్లిక వెంట పడుతుంటాడు. మరి బాలరాజు ప్రేమకు మల్లిక ఓకే చెపుతుందా..? బాలరాజు తన తల్లి గంగమ్మ (ఆమని) కు ఎందుకు రెండో పెళ్లి చేయాలనీ అనుకుంటాడు..? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
ప్లస్ :
- సెకండ్ హాఫ్
- కార్తికేయ యాక్టింగ్
- ఆమనీ యాక్టింగ్
మైనస్ :
- ఫస్ట్ హాఫ్
- సాంగ్స్
- కథనం
- స్లో నేరేషన్
నటీనటుల తీరు :
- బస్తీ బాలరాజు అనే ఊరమాస్ రోల్ లో కార్తికేయ అదరగొట్టాడు. సినిమా భారాన్ని తన భుజాల మీద వేసుకొని మెప్పించాడు. ఎమోషనల్ సీన్లలో కూడా అద్భుతంగా నటించాడు.
- భర్తను కోల్పోయిన మల్లిక పాత్రలో లావణ్య త్రిపాఠి అద్భుతంగా నటించింది. పూర్తి డీ గ్లామర్ రోల్ ఆమెది.
- గంగమ్మ పాత్రలో ఆమనీ జీవించేశారని చెప్పొచ్చు. గంగమ్మ క్యారెక్టరైజేషన్ సినిమాకు చాలా ఫ్లస్ పాయింట్. కోడలి మేలు కోరే మామ పాత్రలో మురళీశర్మ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు.
- మురళీ శర్మ.. హీరోయిన్ మామ పాత్రలో ఆకట్టుకున్నారు. క్లైమాక్స్ సీన్‌లో తన సీనియారిటీని చూపించారు. కమెడియన్ భద్రం, శ్రీకాంత్ అయ్యంగార్ పర్వాలేదు అనిపించాడు. రంగస్థలం మహేష్‌లు హీరో స్నేహితులుగా ఉన్నంతలో కామెడీ బాగానే పండించారు.
- ఐటమ్ సాంగ్ లో చిందులేసిన అనసూయ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఆమె అందాల కోసమే ఆమెను ఎంపిక చేసారు తప్ప..ఏమిలేదు.
సాంకేతిక వర్గం :
- చేక్స్ బిజోయ్ సాంగ్స్ బాగున్నప్పటికీ.. కథకు తగ్గట్లు వాడుకోలేకపోయారు.
- కామ్ చావ్లా సినిమాటోగ్రఫీ బాగుంది.
- సత్య ఎడిటింగ్ ఏమాత్రం బాగాలేదు. చాల సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. ఫస్ట్ హాఫ్ దారుణంగా ఉంది. ముఖ్యంగా హీరోయిన్ వెంటపడే సీన్లు తగ్గిస్తే బాగుండేది.
- నిర్మాణ విలువలు సినిమా రేంజ్‌కి తగ్గట్టే ఉన్నాయి.
- కౌశిక్ పెగళ్లపాటి కథనం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఫస్ట్ హాఫ్ ఏమాత్రం ఆసక్తికరంగా రాసుకోలేకపోయాడు. చాల సన్నివేశాలు బోర్ కొట్టించాయి. డైలాగ్స్ సైతం ఇబ్బంది పెట్టించాయి. సాంగ్స్ వస్తుంటే వామ్మో అనుకునేలా ఉన్నాయి. చావు.. పుట్టుక నేపథ్యంలో గమ్మత్తైన పాయింట్‌ని తీసుకుని అందమైన ప్రేమకథగా మలిచాడు. అయితే దాన్ని కన్వెన్సింగ్‌గా బ్యాలెన్స్ చేయడంలో ఈ కొత్త దర్శకుడి అనుభవం చాల్లేదు. సెకండ్ హాఫ్ కాస్త పర్వాలేదు అనిపించాడు.
ఫైనల్ :
పోయినవారిని ఎలాగో తీసుకురాలేము. ఉన్నవారిని సంతోషంగా చూసుకుంటూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలి ఇదే డైరెక్టర్ చెప్పిన ‘చావు కబురు చల్లగా’.