Site icon TeluguMirchi.com

రివ్యూ : భీమ్లా నాయక్ – యాక్షన్ ఎంటర్టైనర్

నటీనటులు: పవన్ కల్యాణ్, రానా , నిత్య మీనన్, సంయుక్త మీనన్, సముద్ర ఖని తదితరులు
దర్శకత్వం: సాగర్ కే చంద్ర
స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ
మ్యూజిక్: తమన్
రిలీజ్ డేట్ : 25 -02-2022
తెలుగు మిర్చి రేటింగ్ : 3.25/5

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ మూవీ భారీ అంచనాల నడుమ ఈరోజు వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. వాస్తవానికి జనవరి సంక్రాంతి రేస్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసినప్పటికీ పలు కారణాల కారణంగా ఈరోజు కు వాయిదా పడింది. సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ అందించడం విశేషం. థమన్ మ్యూజిక్ అందించగా.. నిత్య మీనన్, సంయుక్త మీనన్లు హీరోయిన్లు గా నటించారు.

మలయాళ చిత్రం అయ్యప్పనుం కోశియుమ్ కు రీమేక్ రావడం..మలయాళం ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడం తో..భీమ్లా నాయక్ ఫై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక థమన్ మ్యూజిక్ ఆదరిపోవడం , ట్రైలర్స్ , వీడియోస్ సూపర్బ్ గా ఉండడం తో సినిమా ఫై ఆసక్తి రెట్టింపు అయ్యింది. మరి ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా ఉందా..? సాగర్ పవన్ కళ్యాణ్ ను ఎలా చూపించాడు ..? థమన్ బ్యాక్ గ్రౌండ్ ఎలా ఉంది..? త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , డైలాగ్స్ ఎలా ఉన్నాయి..? ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్యలో కొనసాగే ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు..? అనేది ఇప్పుడు పూర్తి రివ్యూ లో చూద్దాం.

కథ :

వరంగల్ మాజీ ఎంపీ (సముద్ర ఖని) కుమారుడైన డేనియల్ శేఖర్ (రానా దగ్గుబాటి) రాజకీయంగా ఎంతో పలుకుబడి ఉన్న వ్యక్తి. తనకు ఎదురులేదు అనే పొగరుతో..తాను ఏంచేసినా ఎవరు అడ్డు చెప్పారనే ధీమా తో ఉంటాడు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో మద్యపానంపై ఆంక్షలు ఉన్న ప్రదేశంలో పీకల దాకా తాగి పోలీస్ సబ్ ఇన్స్‌పెక్టర్ భీమ్లా నాయక్ (పవన్ కళ్యాణ్ ) కు పట్టుబడతాడు. పోలీసులపై దాడి చేయడం, మద్యపానంపై ఆంక్షలు ఉన్న సమయంలో ఫుల్ గా తాగడం తో డేనియల్ శేఖర్ ను అరెస్ట్ చేసిన భీమ్లా నాయక్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తాడు. రాజకీయంగా పలుకుబడి ఉండటంతో ఫై సీఐ సూచన మేరకు డేనియల్ శేఖర్‌కు పోలీస్ స్టేషన్‌లో మర్యాదలు చేస్తారు. ఆ వీడియోస్ ఫై అధికారులు చూసి భీమ్లా నాయక్ తో పాటు మరికొంతమందిని సస్పెండ్ చేస్తారు. ఆలా సస్పెండ్ గురైన భీమ్లా నాయక్ ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు..? భీమ్లా నాయక్‌ను డేనియల్ శేఖర్ ఎలాంటి కేసులో ఇరికించాడు? భీమ్లా నాయక్ – డేనియల్ శేఖర్ మధ్య ఎలాంటి గొడవలు జరుగుతాయి..? ఈ గొడవల్లో ఎవరు ఫై చేయి సాధిస్తారు..? సుగుణ (నిత్యా మీనన్ ) కు భీమ్లా నాయక్ కు సంబంధం ఏంటి..? ఇలాంటి విషయాలు తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

మైనస్ :

నటీనటుల తీరు :

సాంకేతిక వర్గం :

ఫైనల్ గా : ఇది పక్క మాస్ ఎంటర్టైనర్

Exit mobile version