నటీనటులు: పవన్ కల్యాణ్, రానా , నిత్య మీనన్, సంయుక్త మీనన్, సముద్ర ఖని తదితరులు
దర్శకత్వం: సాగర్ కే చంద్ర
స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ
మ్యూజిక్: తమన్
రిలీజ్ డేట్ : 25 -02-2022
తెలుగు మిర్చి రేటింగ్ : 3.25/5
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ మూవీ భారీ అంచనాల నడుమ ఈరోజు వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. వాస్తవానికి జనవరి సంక్రాంతి రేస్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసినప్పటికీ పలు కారణాల కారణంగా ఈరోజు కు వాయిదా పడింది. సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ అందించడం విశేషం. థమన్ మ్యూజిక్ అందించగా.. నిత్య మీనన్, సంయుక్త మీనన్లు హీరోయిన్లు గా నటించారు.
మలయాళ చిత్రం అయ్యప్పనుం కోశియుమ్ కు రీమేక్ రావడం..మలయాళం ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడం తో..భీమ్లా నాయక్ ఫై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక థమన్ మ్యూజిక్ ఆదరిపోవడం , ట్రైలర్స్ , వీడియోస్ సూపర్బ్ గా ఉండడం తో సినిమా ఫై ఆసక్తి రెట్టింపు అయ్యింది. మరి ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా ఉందా..? సాగర్ పవన్ కళ్యాణ్ ను ఎలా చూపించాడు ..? థమన్ బ్యాక్ గ్రౌండ్ ఎలా ఉంది..? త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , డైలాగ్స్ ఎలా ఉన్నాయి..? ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్యలో కొనసాగే ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు..? అనేది ఇప్పుడు పూర్తి రివ్యూ లో చూద్దాం.
కథ :
వరంగల్ మాజీ ఎంపీ (సముద్ర ఖని) కుమారుడైన డేనియల్ శేఖర్ (రానా దగ్గుబాటి) రాజకీయంగా ఎంతో పలుకుబడి ఉన్న వ్యక్తి. తనకు ఎదురులేదు అనే పొగరుతో..తాను ఏంచేసినా ఎవరు అడ్డు చెప్పారనే ధీమా తో ఉంటాడు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో మద్యపానంపై ఆంక్షలు ఉన్న ప్రదేశంలో పీకల దాకా తాగి పోలీస్ సబ్ ఇన్స్‌పెక్టర్ భీమ్లా నాయక్ (పవన్ కళ్యాణ్ ) కు పట్టుబడతాడు. పోలీసులపై దాడి చేయడం, మద్యపానంపై ఆంక్షలు ఉన్న సమయంలో ఫుల్ గా తాగడం తో డేనియల్ శేఖర్ ను అరెస్ట్ చేసిన భీమ్లా నాయక్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తాడు. రాజకీయంగా పలుకుబడి ఉండటంతో ఫై సీఐ సూచన మేరకు డేనియల్ శేఖర్‌కు పోలీస్ స్టేషన్‌లో మర్యాదలు చేస్తారు. ఆ వీడియోస్ ఫై అధికారులు చూసి భీమ్లా నాయక్ తో పాటు మరికొంతమందిని సస్పెండ్ చేస్తారు. ఆలా సస్పెండ్ గురైన భీమ్లా నాయక్ ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు..? భీమ్లా నాయక్‌ను డేనియల్ శేఖర్ ఎలాంటి కేసులో ఇరికించాడు? భీమ్లా నాయక్ – డేనియల్ శేఖర్ మధ్య ఎలాంటి గొడవలు జరుగుతాయి..? ఈ గొడవల్లో ఎవరు ఫై చేయి సాధిస్తారు..? సుగుణ (నిత్యా మీనన్ ) కు భీమ్లా నాయక్ కు సంబంధం ఏంటి..? ఇలాంటి విషయాలు తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
ప్లస్ :
- పవన్ కళ్యాణ్ , రానా యాక్టింగ్
- ఎమోషనల్ సన్నివేశాలు
- థమన్ మ్యూజిక్
- ఇంటర్వెల్, సెకండ్ హాఫ్
- త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , డైలాగ్స్
- సాగర్ డైరెక్షన్
మైనస్ :
- యాక్షన్ సీన్స్
- ఒకే దానిపై సినిమా అంత నడవడం
- రన్ టైం
- కామెడీ
నటీనటుల తీరు :
- పవన్ కళ్యాణ్ పలు రకాల కోణాల్లో నటించి అలరించారు. నిజాయితీగల పోలీస్ ఆఫీసర్‌గా, అలాగే తండాలో గిరిజన ప్రజల కోసం ప్రాణాలకు తెగించే యువకుడిగా, మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే సంస్కారవంతుడిగా, పేదల కష్టం వస్తే తోడుంటే మనిషిగా ఇలా అన్ని యాంగిల్స్ లలో చించేసాడు.
- ఇక రానా డేనియల్ పాత్రలో తన మార్క్ యాక్టింగ్ తో అదరగొట్టాడు. పొగరు ఉన్న రాజకీయ నేతగా పరకాయ ప్రవేశం చేసాడు.
- సుగుణ పాత్రలో నిత్యమీనన్ రొమాంటిక్ సీన్లు, ఎమోషనల్ సీన్లలో తనదైన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. మరో నటి సంయుక్త మీనన్ తన పాత్రకు తగ్గట్లు నటించింది.
- సముద్రఖని , రఘుబాబు, నర్రా శ్రీనివాస్ తదితరులు తమ పాత్రల మేరకు నటించారు.
సాంకేతిక వర్గం :
- థమన్ మరోసారి బాక్సలు బద్దలు కొట్టాడు. పాటలే కాదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సైతం కుమ్మేసాడు.
- రవి కే చంద్రన్ సినిమాఫొటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
- ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ వేసిన సెట్స్ ఆకట్టుకున్నాయి.
- సితారా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు ఎక్కడ తగ్గలేదు. సినిమా అంత కూడా భారీగా తెరకెక్కించారు.
- త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు సినిమాకు కలిసొచ్చాయి. కాకపోతే ఒకేదానిపై సినిమా అంత నడిచేసరికి కాస్త అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. రానా – పవన్ కళ్యాణ్ ల మధ్య డైలాగ్స్ బాగా పేలాయి.
- ఇక డైరెక్టర్ సాగర్ కె చంద్ర విషయానికి వస్తే..రీమేక్ మూవీ అయినప్పటికీ ఎక్కడ కూడా ఆ ఛాయలు కనిపించకుండా. పవన్ ఇమేజ్ ను దృష్టి లో పెట్టుకొని సినిమాను తెరకెక్కించారు. రానా , పవన్ ఇద్దర్ని కూడా సమానంగా చూపించి..అభిమానులను అలరించారు.
ఫైనల్ గా : ఇది పక్క మాస్ ఎంటర్టైనర్