రివ్యూ : భరత్ అనే నేను – ఉత్తమ సీఎం..

టైటిల్ : భరత్ అనే నేను (2018)
స్టార్ కాస్ట్ : మహేష్ బాబు , కైరా అద్వానీ , ప్రకాష్ రాజ్ తదితరులు
దర్శకత్వం : కొరటాల శివ
నిర్మాతలు: డి.వి.వి దానయ్య
మ్యూజిక్ : దేవి శ్రీ ప్రసాద్
విడుదల తేది : ఏప్రిల్ 20, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 3.5/5

రివ్యూ : రివ్యూ : భరత్ అనే నేను – ఉత్తమ సీఎం

సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం భరత్ అనే నేను. ఈ చిత్రం ఫై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు.. శ్రీమంతుడు తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం , మొదటి సారి ముఖ్య మంత్రి పాత్రలో మహేష్ కనిపించడం , ట్రైలర్ సైతం ఆసక్తిగా ఉండడం తో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా ..ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా..అని యావత్ సినీ ప్రేక్షకులు అంచనాలు వేసుకుంటున్నారు. ఆ అంచనాలకు తగట్టే ఈ మూవీ ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

మరి ముఖ్య మంత్రి గా మహేష్ రాష్ట్రానికి ఏం చేసాడు…? ఏం మెసేజ్ ఇచ్చాడు..? అసలు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు..? ఎందుకు అవ్వాల్సి వచ్చిందనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

భరత్ రామ్ (మహేష్ బాబు) లండన్‌ ఆక్సఫోర్డ్ యూనివర్సిటీ లో చదుతుంటాడు..సడెన్ గా తన తండ్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి (శరత్ కుమార్ ) మరణ వార్త తో ఇండియా కు వస్తాడు. ఆ తర్వాత పార్టీ పెద్దలంతా కూడా భరత్ ను ముఖ్య మంత్రి గా అవ్వాలని , నాన్న గారి ప్లేస్ లో మీరు మాత్రమే ఉండాలని ఒత్తిడి తెస్తారు. కానీ రాజకీయాలు అంటే పెద్దగా అనుభవం లేని భరత్ , పార్టీ పెద్దల కోరిక మేరకు ముఖ్య మంత్రి అవుతాడు. ఆలా ముఖ్య మంత్రి అయినా భరత్ ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాడు..? విపక్షాల కుట్రల నుండి ఎలా బయటపడ్డాడు..? వసుమతి (కైరా అద్వానీ) కి , భరత్ కు సంబంధం ఏంటి..? రాజకీయ పార్టీలకు భరత్ ఏం మెసేజ్ ఇచ్చాడు..? అనేవి మీరు తెర ఫై చూడాల్సిందే.

ప్లస్ :

* మహేష్ బాబు యాక్టింగ్

* కొరటాల శివ డైరెక్షన్

* కథ

* మ్యూజిక్

* సినిమా ఫొటోగ్రఫీ

మైనస్ :

* సెకండ్ హాఫ్ లో కాస్త స్లో

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* ముందుగా మహేష్ బాబు గురించి చెప్పాలి. మొదటిసారి ముఖ్య మంత్రి రోల్ లో మహేష్ అద్భుతం గా నటించాడు. యంగ్ అండ్ స్టైలిష్ ముఖ్య‌మంత్రిగా మహేష్ అదరగొట్టాడు. ఆ పాత్ర ప్రిన్స్‌కి అతికినట్టు సరిపోయాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యారెక్టర్‌కు మహేష్ వన్నె తెచ్చాడు. పొలిటికల్ పంచ్ డైలాగ్స్ కూడా అదరగొట్టాడు. ఇక ఫైట్స్ లలో అయితే మాస్ ఆడియన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేయవచ్చు.

* బాలీవుడ్‌లో ‘ధోనీ’ చిత్రంతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించి వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది కైరా అద్వానీ. ‘భరత్ అనే నేను’ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. వసుమతి గా ఈ మూవీ లో మహేష్ తో పోటీగా నటించింది. గ్లామర్ పరంగానే కాక నటన పరంగా కూడా మంచి మార్కులు కొట్టేసింది. అసలు ఇమేది తెలుగు లో మొదటి సినిమా నేనా అనే సందేహం వచ్చే మాదిరిగా ఈమె చాల బాగా నటించింది.

* భరత్ తండ్రిగా శరత్ కుమార్ నటించాడు. చాల రోజుల తర్వాత శరత్ మళ్లీ తెలుగు లో చేసిన సినిమా ఇది. ఈ మూవీ లో ఈయనకు మంచి రోల్ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పటికి గుర్తుండి పోయేట్లు చేసాడు డైరెక్టర్.

* మహేష్ బాబు తల్లిగా ఆమని కనిపించింది. తన పాత్ర కు నాయ్యం చేసింది.

* వసుమతి తండ్రి గా రావు రమేష్ నటించాడు. ఇలాంటి పాత్రల్లో రమేష్ కు చేయడం కొత్తమే కాదు. చాల చక్కగా నటించాడు.

* బ్రహ్మాజీ ఉన్నది కాసేపైనా నవ్వులు పండించాడు. ప్రకాష్‌రాజ్‌ మరోసారి తనకు అలవాటైన పాత్రలో అల్లుకుపోయాడు.

* పృధ్విరాజ్ , సీనియర్ నటి సితార , పోసాని కృష్ణ మురళి , దేవదాస్ కనకాల , రవి శంకర్ , జీవ , యాశ్పాల్ శర్మ మొదలగు వారు వారి వారి పాత్రల్లో బాగానే నటించారు.

సాంకేతిక విభాగం :

* ముందుగా దేవి శ్రీ ప్రసాద్ గురించి చెప్పుకోవాలి..దేవి మ్యూజిక్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి కథ అయినా దానికి తగట్టు మ్యూజిక్ అందివ్వడం లో దేవి తర్వాతే ఎవరైనా..ఇక ఈ మూవీ కి సైతం అలాంటి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు.

* ‘శ్రీమంతుడు’ తరువాత కొరటాల, మహేష్, దేవి శ్రీ కాంబో లో వచ్చింది ఈ మూవీ. వచ్చాడయ్యో సామీ.., భరత్ అనే నేను టైటిల్ సాంగ్స్ కు మ్యూజిక్ అదిరిపోయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పిన తక్కువే.

* రవి కె. చంద్రన్, ఎస్ తిర్రు అందించిన సినిమాటోగ్రఫీ అద్భుతం గా ఉంది. ముఖ్యం గా అసెంబ్లీ సెట్ నిజం గా ఇంత బాగుంటుందా అనే రీతిలో చాల బాగా చూపించారు. అన్ని సెట్ లతో పాటు , హీరో , హీరోయిన్లను చాల అందం గా చూపించారు.

* సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్షన్ గురించి ఎంత చెప్పిన తక్కువే. అసెంబ్లీ సెట్ తో పాటు మరికొన్ని సెట్ లు చాల బాగా వేశారు. సినిమాలో వీరి పనితనం హైలైట్ గా నిలిచింది.

* రామ్ లక్షణ్ స్టంట్స్ మాస్ ఆడియన్స్ కు బాగా నచ్చుతాయి.. ఇంటర్వెల్ ఫైట్ తో పాటు క్లైమాక్స్ ఫైట్ ప్రతి ఒక్కరికి నచ్చుతాయి.

* శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ సినిమాకు బలాన్ని చేకూర్చేవిగా ఉన్నాయి.

* ఇక నిర్మాణ విలువల విషయానికి వస్తే…డివివి ఎంటర్ టైన్మెంట్ పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. వారు పెట్టిన ప్రతి రూపాయి తెరఫై కనిపిస్తుంది. ఆయన బ్యానర్ లో ఇంత ఎక్కువ బడ్జెట్ సినిమా ఇదేనని చెప్పాలి.

* ఇక డైరెక్టర్ కొరటాల దగ్గరకు వెళ్తే…మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్.. ఈ మూడు చిత్రాలు టాలీవుడ్ బిగ్ బ్లాక్ బస్టర్ హిట్లే. ఈ మూడింటితో వరుసగా అపజయమన్నదే లేకుంగా హ్యాట్రిక్ హిట్‌లను తన ఖాతాలో వేసుకున్న అరుదైన ఘనతను సాధించాడు. మహేష్ కెరియర్‌లో ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల ఈ ప్రాజెక్ట్‌ను డీల్ చేస్తుండటం ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసాయి.

అభిమానులు , ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను అందుకోవడం లో కొరటాల సక్సెస్ అయ్యారు. ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి..ఎలాంటి మార్పులు తీసుకొస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేది చాల చక్కగా చెప్పారు. పొలిటికల్ కథ అయినప్పటికీ క్లాస్ & మాస్ ఆడియన్స్ కు నచ్చే విధంగా కథ రాసుకున్నాడు.

చివరిగా :

శ్రీమంతుడు సినిమాలో ఎలాగైతే ఊరు దత్తత అంశాన్ని తీసుకొచ్చాడో..ఈ భరత్ అనే నేను మూవీ లో సరికొత్త రాజకీయ కోణాన్ని చూపించాడు. ముఖ్య మంత్రి అంటే ఏవో నాల్గు వాగ్దానాలు చేయడం , తన కుటుంబానికి సరిపడా డబ్బులు సంపాదించుకోవం కాకుండా , రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది…ప్రజలు ఏం కోరుకుంటున్నారో..వారి కోర్కెలను ఎలా తీర్చాలి అనేది చాల బాగా చూపించారు.

ప్రెస్‌మీట్‌ ఎపిసోడ్‌ సన్నివేశాల్లో దర్శకుడు చెప్పాలనుకున్న భావాలను మహేష్‌ మాటల్లో చెప్పించాడు. ఈ సన్నివేశంలో డైలాగ్స్ ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులను అద్దం పడతాయి. మీడియాను సైతం కార్నర్‌ చేస్తూ రాసుకొన్న డైలాగ్‌లు ఆలోచింపచేసేలా ఉన్నాయి. ఇలాంటి కథకు మహేష్ ను ఎంచుకొని సక్సెస్ అయ్యాడు. ఈ మూవీ తో మహేష్ ఉత్తమ నటుడు అవార్డు అందుకోవడం ఖాయం. అలాగే ఈ మూవీ కి సైతం అవార్డుల పంట పండడం ఖాయంలా అనిపిస్తుంది. ఓవరాల్ గా భరత్ అనే నేను..ప్రతి ఒక్కరికి నచ్చే సీఎం.