రివ్యూ : బంగార్రాజు – సోగ్గాడిలా ఆకట్టుకోలేకపోయాడు

స్టార్ కాస్ట్ : నాగార్జున , నాగ చైతన్య , రమ్యకృష్ణ , కృతిశెట్టి తదితరులు..
దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ
నిర్మాతలు: అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్
మ్యూజిక్ : అనూప్ రూబెన్స్
విడుదల తేది : జనవరి 14, 2021
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

కింగ్ నాగార్జున డ్రీమ్ ప్రాజెక్ట్ బంగార్రాజు. త‌న కెరీర్‌లో అతిపెద్ద హిట్‌గా నిలిచిన సోగ్గాడే చిన్నినాయ‌న మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాకి కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా ఈరోజు జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం సోగ్గాడి అంచనాలను అందుకుందా లేదా అనేది చూద్దాం.

కథ :

‘సోగ్గాడే చిన్ని నాయన’చిత్రం ఎక్కడ ముగిసిందో.. అక్కడి నుంచి ‘బంగార్రాజు’కథ మొదలవుతుంది. బంగార్రాజు కొడుకు రాము (నాగార్జున) జీవితాన్ని సరిదిద్దడానికి స్వర్గ లోకం నుంచి భూలోకానికి వచ్చిన బంగార్రాజు రాము–సీతల మధ్య సమస్యలను పరిష్కరించి పైకి వెళ్లిపోతాడు. ఈసారి తన మనవడు చిన బంగార్రాజు (నాగచైతన్య)ను దార్లోకి తీసుకురావడానికి, అతని ప్రాణానికి ఉన్న ముప్పును, కుటుంబ సమస్యలను తొలగించడానికి యముడి ఆజ్ఞ మేరకు భూలోకానికి వస్తాడు. కిందికి వచ్చాక ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి వాటిని ఎలా పరిష్కరించాడు. క్షణం కూడా పడని చిన బంగార్రాజుకు, నాగలక్ష్మీ (కృతిశెట్టికి) ఎలా ముడి వేశాడు అనేది కథ. అసలు చిన్న బంగార్రాజుని ఎందుకు హత్య చేయాలనుకున్నారు? హత్యకు కుట్ర చేసిందెవరు? ఆపదలో ఉన్న మనవడిని బంగార్రాజు ఎలా కాపాడుకున్నాడు? ఊరి గుడి కింద ఉన్న నిధులపై కన్నేసిన దుష్టశక్తుల పన్నాగాలను బంగార్రాజు ఎలా తిప్పికొట్టారు? అనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది.

ప్లస్ :

  • క్లైమాక్స్
  • విజువల్స్
  • నటి నటుల యాక్టింగ్

మైనస్ :

  • కథ
  • ఫస్ట్ హాఫ్

నటీనటుల తీరు :

  • చై కంటే నాగార్జుననే హైలెట్‌ అయ్యాడని చెప్పాలి. క్లైమాక్స్‌లో వీరిద్దకు కలిసే చేసే ఫైట్‌ సీన్‌ కూడా ఆకట్టుకుంటుంది.
  • నాగచైతన్య చిన్న బంగార్రాజుగా మెప్పించలేకపోయాడు. పాత్రకు అవసరమైన కొంటెతనాన్ని అతను చూపించలేకపోయాడు. ఇక్కడే నాగార్జునకు.. చైతూకు మధ్య తేడా తెలుస్తుంది. చైతూ ఆహార్యం కూడా సాధారణంగా అనిపిస్తుంది. ఇతను బంగార్రాజు టైపే అన్న ఫీలింగే ఎక్కడా ఆ పాత్ర కలిగించలేదు.
  • ర‌మ్య‌కృష్ణ స‌త్తెమ్మ పాత్ర‌లో ఎన‌ర్జిటిక్‌గా న‌టించారు. ఆమె పాత్ర‌లో షార్ప్‌నెస్ త‌గ్గ‌కుండా ఉండేలా ద‌ర్శ‌కుడు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.
  • కృతి శెట్టి .. నాగ ల‌క్ష్మి పాత్ర‌లో ఒదిగిపోయే ప్ర‌య‌త్నం చేసింది. అయితే క‌థంతా ఎక్కువ‌గా నాగార్జు, చైత‌న్య చుట్టూనే తిర‌గ‌డంతో ఆమె పాత్ర‌కు అనుకున్నంత స్కోప్ ఇచ్చిన‌ట్లు మ‌న‌కు తెర‌పై క‌న‌ప‌డ‌దు.
  • స్పెషల్ సాంగ్ లో కనిపించిన ఫరియా సినిమాలో హ్యాపీ మూడ్ కి మరింత జోష్ ని తీసుకొచ్చేలా చేసింది
  • ఇక రావు ర‌మేష్‌, వెన్నెల కిషోర్‌, బ్ర‌హ్మాజీ, ఝాన్సీ త‌ది త‌రులు వారి వారి పాత్ర‌ల్లో చ‌క్క‌గా న‌టించారు

సాంకేతిక వర్గం :

  • అనూప్ రూబెన్స్ పాటలు సోసోగా అనిపిస్తాయి. పాటల విషయంలో ప్రేక్షకులు కచ్చితంగా ‘సోగ్గాడే చిన్నినాయనా’తో పోల్చిచూస్తారు. కానీ ఆ స్థాయిలో అయితే ఆల్బమ్ లేదు. లడ్డుండా.. బంగారా పాటలు కొంచెం ఎంటర్టైనింగ్ గానే సాగాయి.
  • యువరాజ్ ఛాయాగ్రహణం సినిమాకు ప్రధాన ఆకర్షణల్లో ఒకటి. పాటలు సహా అన్ని చోట్లా విజువల్స్ కలర్ ఫుల్ గా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు కూడా బాగా కుదిరాయి.
  • కళ్యాణ్ కృష్ణ.. సత్యానంద్ కలిసి వండిన స్క్రిప్టు ఆశించిన స్థాయిలో మెరుపులు లేవు. క‌ళ్యాణ్ కృష్ణ చేసుకున్న క‌థ‌లో లాజిక్స్ వెతుక్కోక‌పోతే సినిమాను కూల్‌గానే చూసేయ‌వ‌చ్చు. ఓవ‌ర్ ఎమోష‌న్స్‌, డ్రాగింగ్ సీన్స్ లేవు.

ఫైనల్ గా : సోగ్గాడే తో పోలిస్తే బంగార్రాజు కాస్త తగ్గడనే చెప్పాలి.