Site icon TeluguMirchi.com

రివ్యూ : పసలేని ‘అరణ్య’

న‌టీన‌టులు: రానా దగ్గుబాటి, విష్ణు విశాల్, జోయా హుస్సేన్ త‌దిత‌రులు
దర్శకత్వం : ప్రభు సాల్మన్‌
నిర్మాతలు: ఈరోస్‌ ఇంటర్‌నేషనల్‌ సంస్థ‌‌
మ్యూజిక్ : శాంతను మొయిత్రా
విడుదల తేది : మార్చి 26, 2021
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

భల్లాల దేవా గా వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయినా రానా..తాజాగా మరో పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రభు సోలొమన్ దర్శకత్వంలో హిందీలో ఘన విజయం సాధించిన హతి మేరె సాతి స్ఫూర్తితో తెరకెక్కిన ఈ చిత్రం అరణ్య పేరుతొ ఈరోజు తెలుగు, తమిళ్ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది..కథ ఏంటి..అసలు అరణ్య ఎవరు అనేది చూద్దాం.

కథ :

నరేంద్ర భూపతి అలియాస్‌ అరణ్య(రానా ) ప్రకృతి ప్రేమికుడు. అడవులు, వన్యప్రాణులు అంటే ఎంతో ఇష్టపడే ఈయన..తన తాతలు 500 ఎకరాల అడవిని ప్రభుత్వానికి రాసిచ్చెస్తే… ఆయన ఆ అడవికి, అక్కడి వన్యప్రాణులకు సంరక్షకుడిగా ఉంటాడు. అడవులు పెరగడానికి కారణం ఏనుగులని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యతపై మనపై ఉందని చెబుతుంటాడు. లక్షకు పైగా మొక్కలు నాటి రాష్ట్రపతి చేతుల మీదుగా ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అవార్డు అందుకుంటాడు. అందుకే, నరేంద్ర భూపతిని అక్కడి గిరిజన ప్రజలు అరణ్యగా పిలుచుకుంటారు.

ఇదిలా ఉంటే.. అటవీ శాఖ మంత్రి కనకమేడల రాజగోపాలం(అనంత్‌ మహేదేవన్‌) ఆ అడవి స్థలంపై కన్నుపడుతుంది. అక్కడ డీఆర్‌ఎల్‌ టౌన్‌షిప్‌ని నిర్మించాలని భావిస్తాడు. దీని కోసం 60 ఎకరాల అడవిని నాశనం చేయాలనుకుంటాడు. మరి అరణ్య దానిని ఎలా అడ్డుకుంటాడు.. ? అడవిని, ఏనుగులను అరణ్య ఎలా కాపాడాడు? అనేదే అసలు కథ.

ప్లస్ :

నటీనటుల తీరు :

సాంకేతిక వర్గం :

నక్సలైట్ల ప్రస్తావన, ఒక మహిళా నక్సలైట్‌ను మావటి సింగా (విష్ణు విశాల్) ప్రేమించడం వంటి అంశాలకు దర్శకుడు న్యాయం చేయలేదు. సినిమా నిడివి పెంచడానికే ఈ సన్నివేశాలు అన్నట్టు ఉన్నాయి. రానా, ఏనుగుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా పెద్దగా ఆకట్టుకోవు. చాలా సాదా సీదాగా అనిపిస్తాయి. ట్విస్టులు ఏమీ లేకుండా సినిమా ను తీసుకెళ్లడం పెద్ద మైనస్.

ఫైనల్ : పసలేని అరణ్య.

Exit mobile version