Site icon TeluguMirchi.com

రివ్యూ: ‘అమృత రామ‌మ్‌’- ఓవర్ డోస్ 

సినిమా పేరు : ‘అమృత రామ‌మ్‌’
నటీనటులు : రామ్ మిట్టకంటి , అమిత రంగనాథ్, శ్రీజిత్, జేడీ చేకూరు ..
దర్శకత్వం : సురేందర్ కే
నిర్మాత‌లు : ఎస్ ఎన్ రెడ్డి
సంగీతం : ఎన్ ఎస్ ప్రసు
సినిమాటోగ్రఫర్ : సంతోష్ శనమొని
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్
‘అమృత రామ‌మ్‌’ .. లాక్ డౌన్ థియేటర్లు టోటల్ గా మూతపడ్డాయి. దింతో పరిశ్రమ ఓటీటీ వైపు చూస్తోంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో నేరుగా విడుద‌లైన తొలి సినిమా ఇదే కావ‌డంతో – ‘అమృత రామ‌మ్‌’పై ఫోక‌స్ పడింది. ఈ రోజు జీ5 వేదికగా విడుదలైంది. ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? ఇప్పుడు చూద్దాం.

కథ: రామ్‌ ఆస్ట్రేలియాలో మాస్టర్స్‌ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటాడు. అదే సమయంలో అమృత (అమిత రంగనాథ్‌) మాస్టర్స్‌ చదివేందుకు ఆస్ట్రేలియా వస్తుంది. తొలి చూపులోనే రామ్‌ని ఇష్ట‌ప‌డుతుంది. పిచ్చిగా ప్రేమిస్తుంది. రామ్ నుంచి ఒక్క క్ష‌ణం కూడా దూరంగా ఉండ‌లేదు. అమృత మితిమీరిన ప్రేమ ఒక్కోసారి రామ్‌కి ఇరిటేషన్ తెప్పిస్తుంది. దింతో ఇద్ద‌రి మ‌ధ్యా దూరం పెరిగిపోతుంది. మరి వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు ఏ స్థాయికి వెళ్లాయి? ఏ కార‌ణంతో వీళ్లు విడిపోవాల్సివ‌చ్చింది? చివరకు ఇద్దరూ కలిశారా? లేదా? అన్నది కథ

ఎలా వుంది?
ట్రైలర్ లో చూపినట్లు ఇదో క ప్రేమకథ. ప్రేమంటే.. ఒకరిలో ఒకరు ఉండటం అనే కాన్సెప్ట్‌తో దీన్ని తెరకెక్కించారు. రామ్‌ను చూసిన తొలిచూపులోనే అమృత ప్రేమలో పడటం, ప్రేమను వ్యక్తపరుచుకోవడం, వారి మధ్య వచ్చే రొమాంటిక్‌ సన్నివేశాలతో ఫస్ట్ సాగుతుంది. ఐతే సెకెండ్ హాఫ్ వచ్చేసరికి వేగం తగ్గింది. కొన్ని చోట్ల సినిమా ప్రేక్షకుల సహనానికి పరీక్షపెట్టింది. చివర్లో ఓ విషాదంతో సినిమా ముగుస్తుంది. ప్రేక్షకుడి ఫీలింగ్ కూడా అలానే ఉంటుంది.

ఎవరెలా చేశారు ? కొత్త నటీనటులతో ఈ సినిమాను తెరకెక్కించారు. కథానాయకుడు రామ్‌ పర్వాలేదు హీరోయిన్‌ అమిత రంగనాథ్‌ ఓకే. మిగిలిన నటీనటులందరూ కొత్తవారే. ఎవరి పాత్ర పరిధి మేరకు వారు నటించారు.

టెక్నీకల్ గా.. ఆస్ట్రేలియా బ్యాక్ డ్రాప్ తీసుకోవ‌డం వ‌ల్ల, లొకేష‌న్లు కొత్త‌గా క‌నిపించ‌డం వ‌ల్ల‌, ఇది వ‌ర‌కు తెర‌పై చూడ‌ని న‌టీన‌టులు ఆయా పాత్ర‌లు పోషించ‌డం వ కొత్త లుక్ వచ్చింది. కెమెరాపనితనం పర్వాలేదు అనిపిస్తుంది. నేపధ్య సంగీతం ఓకే.

ఫైనల్ టచ్ : ఒక ఎమోషనల్ స్టోరీ ని చెప్పాలని అనుకున్నాడు దర్శకుడు. ఐతే అది అంత సఫలం కాలేదు. క్లైమాక్స్ ఓకే అనిపించినా సినిమా నడిచిన విధానం మాత్రం అంతగా ఆకట్టుకోదు. కధనం పరంగా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే సినిమా మంచి ప్రేమ కథ నిలిచే అవకాశం ఉండేది.

తెలుగుమిర్చి రేటింగ్ : 2.5 / 5

Exit mobile version