తెలుగు మిర్చి రేటింగ్ : 3/5
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి – పల్లెటూరి ప్రేమకథలో పంచ్‌లు, ఫన్, ఫీల్ అన్నీ కిక్కిరిసిన ప్యాకేజ్!
టీవీ యాంకర్‌గా తళుక్కున మెరిసిన ప్రదీప్ మాచిరాజు, హీరోగా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. యంగ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్స్ నితిన్ మరియు భరత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం, ప్రేమకథ, పల్లెటూరి నేపథ్యం, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌ని మేళవించిన ఓ వినోదాత్మక ప్రయాణం. Monks & Monkeys బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమా, ట్రైలర్, పాటలతోనే పాజిటివ్ బజ్ తెచ్చుకుని, ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలైంది.
కథలోకి వెళ్తే…
హైదరాబాద్‌లో పనిచేస్తున్న సివిల్ ఇంజనీర్ కృష్ణ (ప్రదీప్), ఆంధ్ర-తమిళనాడు బోర్డర్‌లోని ఓ ప్రత్యేక గ్రామానికి మరుగుదొడ్లు నిర్మించే పనితో వెళ్తాడు. ఆ ఊరులో ఉన్న కఠినమైన సంప్రదాయాలు, విచిత్ర నియమాల మధ్య, అక్కడే ఉండే ఏకైక అమ్మాయి రాజా (దీపికా పిల్లి)తో ప్రేమలో పడతాడు. అయితే ఆమెను ఊరి దేవతలా పరిగణించి, ఆమెను పెళ్లి చేసుకునే వ్యక్తినే ఊరి ప్రెసిడెంట్‌గా మార్చే ఆలోచనతో ఊరివాళ్లు ముందే ప్లాన్ చేసారు. ఆ తరువాత జరిగిన పరిణామాలు ఏంటి? కృష్ణకి, రాజాకి పరిచయం ఎలా ఏర్పడుతుంది? వారి ప్రేమ చివరకు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది? అన్నదే కథ.
నటీనటుల నటనపై ఓ లుక్క్…
ప్రదీప్ పాత్రలోనూ, డైలాగ్ డెలివరీలోనూ మెచ్యూరిటీ చూపించాడు. అతని నటనలో నేచురలిటీ ఉంది. దీపికా పిల్లి పల్లెటూరి అమ్మాయిగా ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది. స్క్రీన్‌పై వారి కాంబినేషన్ ఆకట్టుకుంది. కామెడీ డిపార్ట్మెంటులో సత్య, గెటప్ శ్రీను దుమ్ము దులిపారు. ముఖ్యంగా సత్య-ప్రదీప్ ట్రాక్ పక్కా ఎంటర్‌టైన్‌మెంట్‌గా నిలిచింది. మురళీధర్ గౌడ్, రోహిణి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికంగా ఎలా ఉంది?
సినిమాకు సంగీతం అందించిన రథన్ మ్యూజిక్ యూత్‌ఫుల్‌గా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎనర్జిటిక్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ ప్రశంసించదగ్గది — పల్లెటూరి వాతావరణాన్ని బ్యూటిఫుల్‌గా క్యాప్చర్ చేశారు. లొకేషన్స్, ఆర్ట్ డైరెక్షన్, నిర్మాణ విలువలు సినిమా విజువల్ రిచ్నెస్ కి తోడ్పడ్డాయి. ఒక్క లోపముందంటే అది నిడివి — క్లైమాక్స్‌కు ముందు కథ కొద్దిగా లాగిన ఫీల్ వస్తుంది.
ఫైనల్ వెర్డిక్ట్:
‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఒక ఎంటర్‌టైనింగ్ ప్రేమ కథ. పల్లెటూరి బ్యాక్‌డ్రాప్, ఫన్ టచ్, అద్భుతమైన సపోర్టింగ్ కాస్ట్‌తో కలిసి సినిమా ఒక మాస్ & క్లాస్ ఆడియన్స్‌కి దగ్గర అయ్యేలా ఉంది. హాస్యం, హృదయాన్ని తాకే సన్నివేశాలు కలిపి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను అందించారు దర్శకులు.
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5