Site icon TeluguMirchi.com

రివ్యూ : ‘అఆ’ – అందరు చూడదగ్గ వినోదభరిత చిత్రం..

టైటిల్ : అఆ.. (2016)
స్టార్ కాస్ట్ : నితిన్ , సమంత, అనుపమ
డైరెక్టర్ : త్రివిక్రమ్
ప్రొడ్యూసర్స్ : ఎస్. రాధాకృష్ణ
మ్యూజిక్ : మిక్కి జె మేయర్
విడుదల తేది : జూన్ 2, 2016
తెలుగు మిర్చి రేటింగ్ : 3.5/5


రివ్యూ :
అ..ఆ అందరు చూడదగ్గ వినోదభరిత చిత్రం

అత్తారింటికి దారేది , సన్ అఫ్ సత్య మూర్తి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వం లో రొమాంటిక్ & కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘అ..ఆ ‘ (‘అనసూయ రామలింగం’ వర్సెస్ ‘ఆనంద్ విహారి’). నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించగా హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై ఎస్. రాధాకృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం ఫై సినీ అబిమనులే కాక సాదారణ ప్రేక్షకులు సైతం ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు…మరి వారి అంచనాలను అందుకోవడం లో ‘అ..ఆ ‘ ఎంతవరకు సక్సెస్ అయ్యిందో ఇప్పుడు చూద్దాం…

కథ:

విహారి ఆనంద్ (నందు ) (నితిన్ ) చెఫ్‌గా పనిచేస్తూ తన చెల్లి భాను (అనన్య ), అమ్మ కామేశ్వరి (ఈశ్వరి రావు ) తో కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ కల్వపూడి గ్రామం లో వుంటాడు.. అనసూయ రామలింగం (సమంత ) తనకు ఇష్టమైన పనిచేయలనుకునే అల్లరి పిల్ల..కానీ తన తల్లి మహాలక్ష్మి (నదియ) మాత్రం తనకు కోరుకునే విధంగా తన కూతురు ఉండాలని అనుకుంటుంది. కానీ అనసూయ ఆమెకు రివర్స్ దీంతో తన మాటను లెక్క చేయని అనసూయ కు పెళ్లి చేయాలనీ నదియ ఓ పెళ్లి చూపులు అరేంజ్ చేస్తుంది..ఆ పెళ్లి చూపుల నుండి తప్పించుకుని తన మావయ్య ఊరికి వస్తుంది..మావయ్య కొడుకు నందు ను చూసి ఇష్టపడుతుంది..నందు కూడా అనసూయ ను చూసి ఇష్టపడతాడు..కట్ చేస్తే..

పల్లం వెంకన్న (రావు రమేష్) కు కూతురు నాగవల్లి (అనుపమ పరమేశ్వరన్ ) అంటే ఎంతో ఇష్టం..ఓ రోజు తనకు నందు అంటే ఇష్టమని , అతడినే పెళ్లి చేసుకుంటానని చెపుతుంది..కూతురి కోరిక తీర్చడం కోసం నందు ను పిలిచి నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ నా కూతురిని పెళ్లి చేసుకోమని చెపుతాడు..దానికి నందు ఒకే అని చెప్పి ఓ కండిషన్ పెడతాడు..ఆ కండిషన్ ఏంటి..? రావు రమేష్ దగ్గర నితిన్ ఎందుకు డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది..? చివరకు నందు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు..? అనేవి మీరు తెరఫై చూడాల్సిందే..

ప్లస్ :

* త్రివిక్రమ్ మార్క్ డైరెక్షన్..

* నితిన్ – సమంత ల యాక్టింగ్

* సినిమాటోగ్రఫీ

* మ్యూజిక్

మైనస్ :

* సెకండ్ హాఫ్

* రొటీన్ స్టొరీ

* స్లో నేరేషన్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

అనసూయ రామలింగం క్యారెక్టర్ లో సమంత చాల బాగా నటించింది..మొదటిసారి కామెడీ రోల్ నటించి మంచి మార్కులు కొట్టేసింది..గ్లామర్ పరంగా కూడా ఆదరగోట్టింది. ఇక నితిన్ లోని మరో కోణాన్ని తెర ఫై చూపించాడు దర్శకుడు త్రివిక్రమ్..మేకోవర్ నుంచి డైలాగ్ డెలివరి వరకు నితిన్ లోనో కొత్త నటనను కనపరిచి సక్సెస్ అయ్యాడు.

ధనవంతురాలు మహాలక్ష్మి క్యారెక్టర్ లో నదియా తన హుందా తనని చూపించింది.. నాగవల్లి గా అనుపమ పరమేశ్వరన్ బాగానే నటించింది..మొదటి తెలుగు చిత్రం అయిన కానీ తన పాత్ర కు తనే డబ్బింగ్ చెప్పుకొని శభాష్ అనిపించుకుంది..

ప్రతినాయకుడు అంటే కేవలం హీరో తో ఫైట్స్ చేయడమే కాదు మాటలతోను గాయపరచవచ్చు అనే పాత్ర లో రావురమేష్ తన మార్క్ ను చూపించాడు..మిగతా ఆర్టిస్ట్ ల కొస్తే పోసాని , ప్రవీణ్ , హరి తేజ , ఈశ్వరి రావు, నరేష్ , అజయ్ వారి పరిది మేరకు బాగానే నటించారు..

సాంకేతిక విభాగం :

ముందుగా సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలి.. నటరాజన్ సుబ్రహ్మణ్యం ఎంతో చక్కగా తన పనితనాన్ని నిరూపించుకున్నాడు..ముఖ్యంగా పల్లెటూరి వాతావరణాన్ని ఆయన చిత్రీకరించిన తీరు చూస్తే..మన ఊరు కూడా ఇంత బాగుంటే ఎంత బాగుండు అనిపిస్తుంది.. అలాగే హీరో, హీరోయిన్స్ కూడా చాల చక్కగా తెర ఫై చూపించి సక్సెస్ అయ్యాడు..ఆ తర్వాత మిక్కి జే మేయర్ అందించిన సంగీతం గురించి చెప్పాలి..ఆడియో పరంగానే కాక తెర ఫై కూడా వినసొంపుగా ఉన్నాయి..నేపథ్య సంగీతం కూడా బాగుంది .

ఇక త్రివిక్రమ్ గురించి చెప్పలంటే అతని మాటలే చెపుతాయి అతని గురించి. పదునైన అస్త్రాలుగా వినిపించే మాటలు అందులోని అనురాగాలు పంచుతాయి. ఆత్మీయత గుర్తు చేస్తూ బాధ్యతను గుర్తు చేస్తాయి. బోలేడంత వెటకారం చూపిస్తూ అందులోనూ లాజిక్కుని గుర్తు చేస్తాయి. అలాంటి డైలాగ్స్ అ..ఆ లో నిండుగా ఉన్నాయి.. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ లోను తన మార్క్ ను ఎక్కడ తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు…కానీ స్టొరీ నే కాస్త కొత్తగా ఆలోచిస్తే బాగుండు అనిపించింది..మొత్తానికి అ..ఆ పూర్తి నాయ్యం చేసాడు.

చివరిగా :

కథ లో కొత్తదనం ఏమి కనిపించకున్న కానీ రెండున్నర గంటలసేపు త్రివిక్రమ్‌ మార్క్‌ వినోదాన్ని చూస్తూ , సరదా మాటలు వింటు ప్రేక్షకులు మంచి కాలక్షేపం చేస్తారు..మొత్తంగా ‘అఆ’ అందరు చూడదగ్గ వినోదభరిత చిత్రం..

Exit mobile version