Site icon TeluguMirchi.com

రివ్యూ: ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’.. మధ్య తరగతి మహాభారతం

టైటిల్‌ : మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్
నటీనటులు :  ఆనంద్‌ దేవరకొండ,  వర్ష బొలమ్మ, చైతన్య గరికపాటి, గోపరాజు రమణ, సురభి ప్రభావతి, తరుణ్‌ భాస్కర్‌ తదితరులు
నిర్మాణ సంస్థ: భవ్య క్రియేషన్‌
నిర్మాత:  వెనిగళ్ళ ఆనందప్రసాద్‌
దర్శకత్వం: వినోద్‌ అనంతోజు
సంగీతం: స్వీకార్‌ అగస్తీ, ఆర్‌హెచ్‌ విక్రమ్‌
సినిమాటోగ్రఫీ: సన్నీ కురపాటి
ఎడిటర్‌ : రవితేజ గిరజాల
విడుదల తేది : నవంబరు 20, 2020 ( అమెజాన్‌ ప్రైమ్‌)
తెలుగుమిర్చి రేటింగ్ : 2.75/ 5

లాక్‌డౌన్ సమయంలో తెలుగు ప్రేక్షకులకు ఓటీటీ ప్లాట్‌ఫాంలు హోం థియేటర్లుగా మారిపోయాయి. థియేటర్లు మూతబడటంతో ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరిస్తున్నారు మన హీరోలు. తాజాగా  యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ కూడా అదేబాటలో నడిచాడు. ఆయన హీరోగా నటించిన ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 20న విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం. తాజాగా యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ  నటించిన ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో  విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం

గుంటూరు ద‌గ్గర కొల‌క‌లూరులో  కొండ‌ల‌రావుది చిన్న కాఫీ హోటెల్‌. అక్కడ బొంబాయి చెట్నీ మంచి ఫేమ‌స్‌. అది చేసేది కొండ‌ల‌రావు అబ్బాయి… రాఘ‌వ‌నే. ఇంట‌ర్ వ‌ర‌కూ చ‌దివాడు. గుంటూరులో ఓ మంచి కాఫీ హోటెల్ పెట్టాల‌ని, త‌న బొంబాయి చెట్నీ రుచి గుంటూరు వాసుల‌కు చూపించాల‌ని క‌ల‌లు కంటుంటాడు. త‌న మ‌ర‌ద‌లు సంధ్య అంటే త‌న‌కు చాలా ఇష్టం. కానీ గుంటూరులో హోటెల్ పెట్టడం కొండ‌ల‌రావుకి ఇష్టం ఉండ‌దు . ఇలాంటి ప‌రిస్థితుల్లో రాఘ‌వ గుంటూరులో హోటెల్ పెట్టాడా? అక్కడ నిల‌దొక్కుకున్నాడా? త‌న మ‌ర‌ద‌ల్ని పెళ్లి చేసుకున్నాడా? అన్నదే మిగిలిన క‌థ‌.

మధ్యతరగతి కుటుంబాల నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఎప్పుడు బాగానే ఉంటాయి. ఇలాంటి సినిమాల్లోని ఎమోషన్‌ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్’ కథ కొత్తదేమి కాదు. అందరికి తెలిసిన కథే. అయినప్పటికీ దర్శకుడు వినోద్‌  తెరకెక్కించిన విధానం బాగుంది. తొలి సినిమానే ఇలాంటి నేపథ్యం ఉన్న కథను ఎంచుకొని సాహసమే చేశాడని చెప్పొచ్చు . గుంటూరులో సాగే ఈ కథతో, ఆ క్యారెక్టర్లతో మనందరం ఓ రెండు గంటలు ట్రావెల్ చేస్తాం. హీరో హీరోయిన్ తప్ప దాదాపు అందరూ కొత్త మొఖాలే.కానీ వాళ్ల నుండి డైరెక్టర్ రాబట్టుకున్న పనితనం సూపర్బ్.సినిమా మొదలైనప్పటి ఫస్ట్ సీన్ నుంచే డైరెక్టర్ తన మార్కు చూపించాడు.మిడిల్ క్లాస్ వాళ్లు ఎలా మాట్లాడతారు,చిన్న చిన్న వాటికి ఎలా రియాక్ట్ అవుతారు అనేది దర్శకుడు చక్కగా క్యాచ్ చేశాడు.

ఆనంద్ దేవరకొండ కు రెండో సినిమా ఇది. మొదటి సినిమా దొరసానితో పోల్చుకుంటే ఈ సినిమాలో ఆనంద్‌ నటన కాస్త మెరుగుపడింది. మధ్యతరగతి కుర్రాడిగా ఆనంద్‌ చక్కగా ఒదిగిపోయాడు. . ముఖ్యంగా హీరో తండ్రి పాత్ర ఆక‌ట్టుకుంటుంది. గోప‌రాజు ర‌మ‌ణ‌.. అత్యంత స‌హ‌జ‌మైన రీతిలో న‌టించారు. వ‌ర్ష బొల్ల‌మ్మ‌.. క్యూట్ గా క‌నిపించింది. ఆమె అమాయ‌క‌పు మోము ఆక‌ట్టుకుంటుంది. మిగిలిన‌వాళ్లంతా కొత్త‌వాళ్లే. గుంటూరే.. పాట బాగుంది. గుంటూరు వాసుల‌కు య‌మ‌గా న‌చ్చేసే పాట ఇది. శివుడి నేప‌థ్యంలో సాగే పాట‌లోనూ చాలా అర్థం ఉంది. జ‌హ‌మైన క‌థ‌నంతో ర‌క్తి క‌ట్టించాల‌ని చూశాడు ద‌ర్శ‌కుడు. కొంతవరకూ సఫలమయ్యాడు. 

Exit mobile version