నటీనటులు : సుందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, రావు రమేష్, మురళీ శర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ
నిర్మాతలు : టి. జి. విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం
సంగీతం : హిప్ హాప్ తమీజా
సినిమాటోగ్రఫీ : కవిన్ రాజ్
ఎడిటింగ్ : చోటా. కె. ప్రసాద్
దర్శకత్వం : డెన్నిస్ జీవన్ కనుకొలను
తెలుగుమిర్చి రేటింగ్ : 2.5/5
సందీప్ కిషన్ మంచి నటుడు. కానీ విజయాలే దక్కలేదు. చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ కెరీర్ ని మలుపు తిప్పే విజయాలు రాలేదు. ఈసారి ఒక స్పోర్ట్స్ డ్రామా ప్రయత్నించాడు. అదే ఏ1 ఎక్స్ ప్రెస్. మరి సందీప్ కోరుకున్న విజయం ఈ సినిమా ఇచ్చిందా ? అసలు ఏమిటీ ఈ ఏ1 ఎక్స్ ప్రెస్ కధ.
కథ :
యానాం లోని ఓ హాకీ గ్రౌండ్. హాకీ కోచ్ మురళీ (మురళీ శర్మ) అక్కడి పేద క్రీడాకారులకు ఉచితంగా కోచింగ్ ఇస్తుంటారు. అక్కడి లోకల్ రాజకీయ నాయకుడు(రావు రమేష్) ఈ ల్యాండ్ పై కన్నేసి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అమ్మాలని చూస్తాడు. హైదరాబాద్ నుంచి యానాం బంధువుల ఇంటికి వచ్చిన సందీప్(సందీప్ కిషన్) తొలి చూపులోనే హాకీ ప్లేయర్ లావణ్య(లావణ్య త్రిపాఠి)తో ప్రేమలో పడిపోతాడు. కొన్ని ఊహించని సంఘటనల రీత్యా సంజు ఆ గ్రౌండ్ ను కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి దానికి దారి తీసిన బలమైన కారణం ఏంటి? అసలు సంజూ ఎవరు ? అతడి నేపధ్యం ఏమిటి అనేది తెలియాలంటే ఏ1 ఎక్స్ ప్రెస్ చూడాలి.
విశ్లేషణ :
క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలో తెలుగులో చాలానే వచ్చాయి. అయితే ఏ1 ఎక్స్ప్రెస్ ప్రత్యేకత ఏంటంటే.. హాకీ క్రీడా నేపథ్యంలో సౌత్ ఇండియాలోనే వచ్చిన మొదటి సినిమా ఇది. తొలి సినిమాతోనే ఈ ప్రయోగం చేశాడు దర్శకుడు డెన్నిస్ జీవన్ . ఫస్టాఫ్ అంతా సింపుల్‌గా నడిపించిన దర్శకుడు.. సెకండాఫ్ నుంచి అసలు కథని చూపించాడు. మన దేశంలో ఒక క్రీడాకారుడికి జరుగుతున్న అన్యాయంతో పాటు స్నేహం గొప్పతనాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేశాడు.
సాధారణంగా క్రీడా నేపథ్య చిత్రాలంటే కావాల్సినంత భావోద్వేగాలతో స్ఫూర్తివంతంగా సాగుతాయి. కానీ ఈ సినిమాలో మాత్రం రాజకీయాలు, వివక్ష వల్ల ప్రతిభావంతులైన క్రీడాకారులు ఎందుకు ఎదగలేకపోతున్నారనే అంశాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. దీనికి ప్రేమ కథతో పాటు వాణిజ్య అంశాల్ని జోడించారు. హాకీ నేపథ్యానికి స్థానిక రాజకీయాలు అద్ది కథ రాసుకున్నారు. ప్రతిభ ఉండి ఆర్థి క స్టోమత లేక, రాజకీయాలకు బలైపోతున్న టాలెంటెడ్ క్రీడాకారులు ఎలా అంతర్మథనానికి గురవుతున్నారో చర్చించే ప్రయత్నం చేశారు. అయితే ఈ స్పోర్ట్స డ్రామాను తీర్చిదిద్దే క్రమంలో దర్శకుడు ఏ విషయంలోనూ పూర్తిగా న్యాయం చేయలేకపోయాడనే భావన కలుగుతుంది .
నటీనటుల పెర్ఫామెన్స్:
నటీనటుల పెర్ఫామెన్స్ విషయానికి వస్తే సందీప్ కిషన్ ఈ సినిమాకు చేసిన గ్రౌండ్ వర్క్ అలాగే మొదటి నుంచి తనలో ఉన్న తపన కంప్లీట్ గా ఈ సినిమాలో కనిపిస్తుంది. ఒక స్పోర్ట్స్ పర్సెన్ లానే కాకుండా రోమ్ కామ్ రోల్ లో కూడా సూపర్బ్ గా కనిపించాడు . కోచ్‌గా మురళీశర్మ అద్బుతమైన నటనను ప్రదర్శించాడు. ఆయన పాత్ర గుర్తుండి పోతుంది. ఇక రావురమేష్ తనదైన విలనీతో మెప్పించాడు. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి తమ శైలికి భిన్నంగా సీరియస్ పాత్రల్లో మంచి నటనను కనబరిచారు. సంగీతం మినహా మిగతా విభాగాలు పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. నిర్మాణ విలువలు అంతంత మాత్రమే
ప్లస్ పాయింట్స్
సందీప్ కిషన్ పెర్ఫార్మెన్స్
సంగీతం
సినిమా చివరి 20 నిమిషాలు
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్
రొటీన్ స్టోరీ
హాకీ ని అంతగా రిజిస్టర్ చేయలేకపోవడం
ఫైనల్ గా : పేరుకే ఎ1 ఎక్స్‌ప్రెస్ కానీ… సినిమాలో మాత్రం అంత స్పీడ్ లేదు. కమర్షియాలిటీ కోసం కావల్సిననన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కానీ, కథ కథనాల విషయాలపై మాత్రం అంతగా దృష్టిపెట్టలేదు.