Site icon TeluguMirchi.com

ఏప్రిల్ 6న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు!

balletsఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీ, లోక్ సభలతో పాటు పురపాలక సంఘాలకు ఎన్నికల నగారా మోగగా.. వీటితో పాటు పంచాయతీ రాజ్ సమరానికి తెరలేవనుంది. రాష్ట్రంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ కసరత్తు పూర్తయింది. ఏప్రిల్ 6న ఒకే దశలో ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఏప్రిల్ 9న ఫలితాలు వెల్లడించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం అధికారికంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఈ ఎన్నికలను ఈవీఎంల ద్వారా గాక బ్యాలెట్ పత్రం ద్వారా నిర్వహిస్తారు.

Exit mobile version