Site icon TeluguMirchi.com

జొమాటో సీఈవోని మాల్‌ లిఫ్ట్‌లోకి అనుమతించని సిబ్బంది


జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ డెలివరీ బాయ్‌ అవతారం ఎత్తారు. విధుల్లో ఉన్న సమయంలో తన డెలివరీ ఏజెంట్లకు ఎదురవుతోన్న ఇబ్బందికర పరిస్థితుల్ని తెలుసుకునేందుకు భార్య గ్రేసియా మనోజ్‌ తో కలిసి డెలివరీ ఏజెంట్‌గా విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో ఆయనకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆర్డర్‌ కలెక్ట్‌ చేసుకునేందుకు ఓ మాల్‌కు వెళ్లగా.. అక్కడ ఆయన్ని లిఫ్ట్‌లోకి అనుమతించలేదు. తనకు ఎదురైన ఈ అనుభవం గురించి దీపిందర్‌ సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. గురుగ్రామ్‌ లోని ఓ మాల్‌లో హల్దీరామ్స్‌ నుంచి ఆర్డర్‌ కలెక్ట్‌ చేసుకునేందుకు వెళ్లినట్లు తెలిపారు. అయితే అక్కడ లిఫ్ట్‌లోకి తనను అనుమతించలేదని చెప్పారు. మెట్ల మార్గం నుంచే వెళ్లాల్సిందిగా వారు సూచించినట్లు చెప్పారు. దీంతో మూడు అంతస్తులు మెట్లెక్కి వెళ్లారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది.

Exit mobile version