కడపలో ఉక్కు ప్లాంటు ఏర్పాటును డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీ సీఎం రమేష్ , ఎమ్మెల్సీ బీటెక్ రవి లు ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఎనిమిది రోజులుగా సీఎం రమేష్ , బీటెక్ రవి లు నిరాహారదీక్ష చేస్తుండగా, మరోపక్క కడప లో ఉన్న ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యే లు రాజీనామాలు చేస్తున్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ఈ రోజు తెలిపారు. వారితో పాటు టీడీపీ ఎమ్మెల్యే లు కూడా రాజీనామాలు చెయ్యాలని సవాల్ చేసారు.
ప్రస్తుతం నిరాహారదీక్ష చేస్తున్న టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మరియు ఎమ్మెల్సీ బీటెక్ రవి ల ఆరోగ్యం క్షిణిస్తుందని వైద్యులు తెలపడంతో టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు . ముఖ్యమంత్రి అక్కడ పరిస్థితులు సమీక్షించాలని మంత్రి గంటా శ్రీనివాస్ ను పంపించారు.
ఈ దీక్ష చేస్తున్న సీఎం రమేష్ మరియు బీటెక్ రవి కు డీఎంకే నేత కరుణానిధి కుమార్తె కనిమొళి స్వయంగా వచ్చి సంఘీభావం ప్రకటించారు. కేంద్రం వెంటనే వారి డిమాండ్ ను తీర్చాలని ఆమె కోరారు . ఈ దీక్షకు అన్ని వర్గాల నుండి మద్దతు వస్తుంది .