బీజేపీలో వైకాపా విలీనం కానుందట!

modi jaganఉత్తర భారతదేశంలో బీజేపీ గాలి బలంగా వీస్తుంది. అయితే దక్షిణ భారతంలో మాత్రం మోడీ ప్రభావం అంతగా కనిపించడం లేదు. ముఖ్యంగా తెలంగాణ మరియు ఏపీలో బీజేపీ ఎంత గట్టిగా ప్రయత్నించినా కూడా మూడవ లేదా నాల్గవ స్థానాలకే పరిమితం అవుతుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికలపై బీజేపీ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఒక ప్రముఖ దిన పత్రిక కథనం ప్రకారం ఏపీలో బీజేపీ అధికారమే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగబోతుంది. అందుకోసం ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైకాపాను తనలో విలీనంకు కూడా బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది.

అక్రమాస్తుల కేసులో జగన్‌ పీకల్లోతు కష్టాల్లో ఉన్నాడు. బీజేపీ తల్చుకుంటే జగన్‌ను కొన్ని నెలల వ్యవధిలోనే జైలుకు పంపించే అవకాశం ఉంది. అదే అదునుగా బీజేపీ భావించి వైకాపాను తమలో విలీనం చేసుకోవాలని భావిస్తుంది. వచ్చే ఎన్నికల సమయం నాటికి బీజేపీలో వైకాపాను విలీనం చేసుకుని, వైఎస్‌ జగన్‌ లేదా మరెవ్వరినైనా సీఎం అభ్యర్థిగా నిర్ణయించి 2019 ఎన్నికలకు వెళ్లాలనేది నిర్ణయంగా సదరు మీడియా సంస్థ ఒక కథనంను ప్రచురితం చేసింది.

నిప్పులేనిదే పొగ రాదు అంటారు. మరి నిజంగానే బీజేపీలో వైకాపా విలీనం అయ్యే అవకాశాలున్నాయా అనేది చూడాలి. బీజేపీ నాయకులు ఈ విషయంపై నోరు విప్పడం లేదు, వైకాపా నేతలు మాత్రం ఆ కథనంను ఖండిస్తున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం 5% ఆ కథనంలో నిజం ఉండి ఉండవచ్చు అంటున్నారు.