మాజీ మంత్రి, వైసీపీ నేత పెనుమత్స సాంబశివరాజు మృతి చెందారు. గత కొన్ని రోజులుగా విశాఖలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక నాయకుడిగా ఆయన గుర్తింపును సొంతం చేసుకున్నారు.
1989-94 లో మంత్రిగా, 1958లో సమితి ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహించారు. 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన ఆయన గజపతినగరం, సతివాడ శాసనసభ స్థానాల నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి రాజకీయ కురువృద్ధుడిగా గుర్తింపు పొందారు.