ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన 11మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఏపీ మండలి ఛైర్మన్ ఆఫీస్‌లో ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఏకగ్రీవమైన నూతన ఎమ్మెల్సీలతో శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు ప్రమాణం చేయించారు.
అనంతపురం నుంచి యల్లారెడ్డిగారి శివరామిరెడ్డి , కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురామ్, మొండితోక అరుణ్‌కుమార్, తూర్పుగోదావరి నుంచి అనంత సత్యఉదయ్‌భాస్కర్, గుంటూరు నుంచి డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు, విజయనగరం నుంచి ఇందుకూరి రఘురాజు, విశాఖపట్నం నుంచి వరుదు కళ్యాణి, చెన్నుబోయిన శ్రీనివాసరావు, చిత్తూరు నుంచి కృష్ణరాఘవ జయేంద్రభరత్, ప్రకాశం నుంచి తూమాటి మాధవరావులు ఎమెల్సీగా ప్రమాణం చేశారు.