ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణను తెలగాణకు బదిలీ చేస్తున్నట్లు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. విచారణపై మృతుడి భార్య, కుమార్తె అసంతృప్తితో ఉన్నందున పక్క రాష్ట్రానికి బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్ట్ తెలిపింది. నేర విచారణ నిష్పాక్షికంగా జరపడం కోసమే విచారణ బదిలీ చేస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా వివేకా హత్య కేసు విచారణకు స్థానిక యంత్రాంగం ఏమాత్రం సహకరించడం లేదని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది.