దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముద్దుల కూతురు షర్మిల రాజకీయ సంచలనానికి తెర లేపారు. తన తల్లితండ్రుల వివాహ దినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని లోటస్‌పాండ్‌లో సమావేశం పెట్టి కొత్త పార్టీని ఖారారు చేశారు.
అయితే ఈ పార్టీ పెట్టడం జగన్ కి ఇష్టం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృస్ణారెడ్డి వివరించారు. ”తెలంగాణ రాజకీయాలపై వైఎస్ జగన్ స్పష్టమైన వైఖరితో ఉన్నారు. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలన్నదే ఆయన ఆలోచన. తెలంగాణలో పార్టీపై చాలాసార్లు చర్చ జరిగింది. ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటాయని వైఎస్ జగన్ వద్దన్నారు. కానీ షర్మిల పార్టీ వైపు మొగ్గు చూపారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగతం” అని చెప్పుకొచ్చారు.
షర్మిల మాత్రం ”అన్న జగన్‌కూ.. నాకు ఎలాంటి పోటీ ఉండదు. ఎవరి పార్టీ కోసం వారు కట్టుబడి ఉంటాం. అలాగే ఆన్న ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే.. నేను తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉండబోతున్నా’ చెప్పారు.
అయితే ఈ టోటల్ ఎపిసోడ్ ని సాక్షి మీడియా లైట్ తీసుకుంది. షర్మిల వార్త అసలు సాక్షిలో కనిపించలేదు. బ్రేకింగ్ కాదు కదా కనీసం స్క్రోలింగ్ లో కూడా పెద్దగా చూపించకపోవడం గమనార్హం.