నంద్యాల ఉప ఎన్నికల ప్రచార హోరు కొనసాగుతుంది. ఇంత కాలం కాస్త సైలెంట్‌గా ఉంటూ వస్తున్న వైకాపా అధినేత జగన్ ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికల ప్రచార సభలో తెలుగు దేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును నడి రోడ్డుపై కాల్చి చంపాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంకా తీవ్ర స్థాయిలో చంద్రబాబు నాయుడును విమర్శించాడు. ఆ విమర్శలతో వైకాపాకు మైలేజ్ పెరగడం ఖాయం అని అంతా భావించారు. కాని పరిస్థితి అడ్డం తిరిగింది. జగన్ వ్యాఖ్యలకు తీవ్ర స్థాయిలో టీడీపీ నాయకులు రియాక్ట్ అవుతున్నారు.
ప్రజల ముందుకు వైకాపా అధినేత చేసిన వ్యాఖ్యలను పెద్ద ఎత్తున నాయకులు తీసుకు వెళ్లి జగన్ తీరు ఇది, ఆయన ఇంకా ఒక ఫ్యాక్షన్ నాయకుడిని, తాను రౌడీలా ప్రవర్తిస్తాను అంటూ ఆయన వ్యాఖ్యలు చెప్పకనే చెబుతున్నారు. ఒక బాధ్యతగల పదవిలో ఉండే ఒక సీఎంను నడిరోడ్డుమీద కాల్చి చంపాలి అని ఒక బహిరంగ సభలో చేయడం అనేది తీవ్రంగా పరిగణలోకి తీసుకోవాలి. ఆ వ్యాఖ్యలు ఆయనలోని గెలుపు ఆరాటం చూపిస్తుందని మరి కొందరు ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి వైకాపా మైలేజ్ దక్కుతుందని చేసిన వ్యాఖ్యలు కాస్త తిరిగి వైకాపా మీదకు వచ్చాయి. ఆ వ్యాఖ్యల కారణంగా జగన్ ప్రజల్లో ఎంతో చులకన అయ్యాడు అనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికి అయినా జగన్ కాస్త జాగ్రత్తగా మాట్లాడుతాడేమో చూడాలి.