Site icon TeluguMirchi.com

కరోనా మరణం.. జగన్ సీరియస్


కరోనా వైరస్ సోకి చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకున్న సంఘటనపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. ‘ కర్నూలు జిల్లాలో ‘కరోనా’ తో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకోవడం అమానవీయమని, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిపై ఆప్యాయత, సానుభూతి చూపించాల్సింది పోయి వివక్ష చూపడం సరికాదని అన్నారు

కాగా.. ‘కరోనా’తో మృతి చెందిన వారి అంతిమసంస్కారాలను అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్ ను ఆదేశించారు. వైరస్ సోకితే సరైన చికిత్స, మందులు వాడితే నయమైపోతుందని, భయపడాల్సిన పని లేదని ధైర్యం చెప్పారు. ‘కరోనా’ విషయమై దుష్ప్రచారాలు చేయొద్దని, ఇలాంటి ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Exit mobile version