ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటలో ఉన్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా మరియు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను జగన్ కలవడం జరిగింది. కలిసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక హోదా విషయమై విజ్ఞప్తిని సీఎం జగన్ మోహన్ రెడ్డి చేశారు. ఇంకా పలు విషయాలపై ఢిల్లీ పెద్దలను కలిసిన సీఎం జగన్ ప్రత్యేక హోదా విషయంలో మాత్రం చాలా సీరియస్‌గానే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.
ఏపీ ప్రజలు బలంగా కోరుకుంటున్న ప్రత్యేక హోదాను దేశ ప్రధానిగా నెరవేర్చాల్సిన బాధ్య మీపై ఉందంటూ మోడీకి ప్రత్యేక హోదా విషయమై ఒక విజ్ఞప్తి లేఖను కూడా ఇవ్వడం జరిగింది. ఆర్థిక మంత్రి మరియు హోం మంత్రి అమిత్ షాలతో కూడా భేటీ అయిన సీఎం జగన్ నిన్నంతా బిజీగా గడిపేశాడు. నితిన్ గడ్కారిని కలిసిన జగన్ కొత్త రహదారుల నిర్మాణం మరియు రోడ్ల విస్తరణకు గ్రాంట్లు విడుదల చేయాలని కూడా గడ్కారిని కోరడం జరిగింది. ప్రత్యేక హోదా విషయమై ఏ ఒక్కరి నుండి కూడా సరైన హామీ మాత్రం వచ్చినట్లుగా లేదు. కేంద్ర మంత్రులను కలిసిన జగన్ వెంట ఎంపీలు విజయ్ సాయి రెడ్డి మరియు అవినాష్ రెడ్డిలు ఉన్నారు.