Site icon TeluguMirchi.com

‘బిల్డ్‌ ఏపీ’ కాదు ‘జగన్‌ కిల్డ్‌ ఏపీ’

ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ‘బిల్డ్‌ ఏపీ’ పేరుతో కొత్త పథకానికి వైకాపా ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం అమలుపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఆస్తులన్నీ అమ్మేసి ఏపీని చంపేస్తూ దానికి సీఎం జగన్‌ మిషన్‌ ‘బిల్డ్‌ ఏపీ’ పేరు పెట్టారని నారా లోకేశ్‌ మండిపడ్డారు.

ఈ కార్యక్రమం పేరు ‘మిషన్‌ బిల్డ్‌ ఏపీ’ కాదని ‘జగన్‌ కిల్డ్‌ ఏపీ’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి జగన్‌ ఉన్మాది కొడుకులా వ్యవహరిస్తున్నారని లోకేశ్‌ దుయ్యబట్టారు. ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుంటే జగన్‌ మాత్రం దోపిడీకి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని మండిపడ్డారు.

Exit mobile version